
కలకత్తా: ట్రైన్‌లలో ప్రయాణికుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. రైళ్లలో గొడవ పడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ముంబయి లోకల్ ట్రైన్‌లో మహిళల ఫైటింగ్ వార్త మరవక ముందే కలకత్తా లోకల్ ట్రైన్‌లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలు గుంపుగా ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
కలకత్తా లోకల్ ట్రైన్‌లో మహిళలు వీరంగం సృష్టించారు. ఒకరినొకరు జట్లు పట్టుకుని చెప్పులతో కొట్టుకున్నారు. బూతులు తిట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. లోకల్ ట్రైన్ మహిళా కంపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ఘటనను ఓ యూజర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కేవలం మూడు రోజుల్లో 6 వేల వ్యూస్ వచ్చాయి.
Kolkata local🙂 pic.twitter.com/fZDjsJm93L
— Ayushi (@Ayushihihaha) July 11, 2023
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రైన్‌లో ఉచితంగా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ చూడొచ్చు అంటూ ఓ యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు. మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది.. కానీ ఇలాంటి ఘటనలు కూడా చూడాల్సి వస్తోందంటూ మరో యూజర్ స్పందించాడు. క్లినిక్ ప్లస్ యాడ్‌లా ఉందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
ఇదీ చదవండి: సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. వీడియో వైరల్..