Watch: Mumbai Local Train Commuter Refuses To Keep Feet Off Mans Seat, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: నేను లాయర్.. నా ఇష్టం.. లోకల్ ట్రైన్‌లో యువతి రుబాబు..

Published Fri, Feb 3 2023 4:30 PM | Last Updated on Fri, Feb 3 2023 5:00 PM

Mumbai Local Train Commuter Refuses To Keep Feet Off Mans Seat - Sakshi

ముంబై: మహారాష్ట్ర ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణికుడి సీటుపై కాలుపెట్టి మహిళా లాయర్ రుబాబు చేసింది. కాలు తీయమన్నా తీయకుండా దురుసుగా ప్రవర్తించింది. తాము లాయర్లమని, ఇష్టమొచ్చినట్లు ఉంటామని హల్‌చల్‌ చేసింది. తనతో పాటు ఉన్న మరోవ్యక్తితో కలిసి ప్రయాణికుడిపై వాగ్వాదానికి దిగింది అంతేకాదు ఈ దృశ్యాలను రికార్డు చేసినందుకు ప్రయాణికుడి మొబైల్‌ను లాక్కునేందుకు ప్రయత్నించింది.

ఇందుకు సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ లాయర్లు లోకల్ ట్రైన్‌లో ప్రయాణికులకు ఇబ్బంది కల్గించారని పేర్కొన్నాడు. ముంబై పోలీసులు, రైల్వే శాఖను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. లాయర్ల తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. లా చదివి ఇలాగేనా ప్రవర్తించేది అని మండిపడ్డారు. సామాన్యులంటే గౌరవం లేదా అని ఫైర్ అయ్యారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
చదవండి:  దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement