రైలు నడుస్తున్నప్పుడు ఆ రైలులోని లైట్లన్నింటినీ ఆర్పివేయడమనేది ఎక్కడైనా చూశారా? టెక్నికల్ ప్రోబ్లం కాకుండా అలా ఎప్పుడైనా జరుగుతుందా? సాధారణంగా ఇలా జరగదు. అయితే వీటికి భిన్నంగా ఆ ప్రాంతంలోకి రైలు రాగానే దానిలోని లైట్లన్నీ బంద్ అయిపోతాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో? అటువంటి ప్రాంతం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకిలా చేస్తారంటే..
చైన్నైలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో ఇలా జరుగుతుంది. చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌కు సమీపంలోని కొంత దూరంలోకి లోకల్ రైలు రాగానే దానిలోని లైట్లు ఆరిపోతాయి. అయితే ఇలా లోకల్ రైళ్ల విషయంలోనే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఒక లోకోపైలెట్ సమాధానమిచ్చారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొద్దిదూరం వరకూ మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ కాస్త దూరంలో ఓహెచ్‌ఈలో కరెంట్ ఉండదు. ఓహెచ్‌ఈ అనేది లోకోమోటివ్‌కు విద్యుత్‌ను అందిస్తుంది. అక్కడి ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌లో విద్యుత్ ఉండదు. ఇటువంటి ప్రాంతాన్ని నేచురల్ సెక్షన్ అని అంటారు.
కట్ కరెంట్ ప్రాంతంగా..
ఇటువంటి స్థలాలను రైల్వేనే రూపొందిస్తుంది. దీనిని ఓవర్ హెడ్ వోల్టేజ్, విద్యుత్ నిర్వహణ కోసం తయారు చేస్తారు. దీనిని కట్ కరెంట్ అని పిలుస్తారు. ఇది నూతన విద్యుత్ జోన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీని వల్ల కొంత దూరం వరకు కరెంటు ఉండదు. లోకల్ రైళ్ల లైట్లు డ్రైవర్ క్యాబిన్ నుండి పనిచేస్తాయి.
వాటి పవర్ సిస్టమ్ భిన్నంగా ఉంటుంది. ఇది ఈ ప్రదేశంలో ప్రభావితమవుతుంది. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లు, పాసింజర్ రైళ్లలో కోచ్‌లకు వేర్వేరుగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. దీని కారణంగా ఆ రైళ్లలో ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తదు. నూతన జోన్ కారణంగా ఇక్కడ నుండి వెళ్ళే లోకల్ రైళ్లలోని లైట్లు స్విచ్ ఆఫ్ అవుతాయి.
ఇది కూడా చదవండి: పాములు పట్టడంలో ఎవరైనా అతని తర్వాతే.. ‘స్నేక్ మ్యాన్’ స్టోరీ!
Comments
Please login to add a commentAdd a comment