పెరిగిన విద్యుత్ ఉత్పత్తి
Published Tue, Oct 1 2013 6:07 AM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM
విద్యుత్ కోతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పారిశ్రామి క, వ్యాపార వర్గాలకు తీపి కబురు. ప్రస్తుతం ఆయూ కేటగిరిల్లో అమలులో ఉన్న విద్యుత్ కోతలను 40 నుంచి 20 శాతానికి తగ్గిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం మంగళవారం నుంచి అమలులోకి రానుంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని విద్యుత్ కోతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార వర్గాలు ఐదేళ్లుగా విద్యుత్‌కోతలతో అల్లాడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం, డిమాండ్ పెరిగిపోవడం వంటి కారణాలతో రాష్ట్రం సతమతమవుతోంది. అయితే అనుకోని రీతిలో జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. డ్యామ్‌లన్నీ పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడింది. వివిధ ప్రాజెక్టులలో ఉత్పత్తి 600 నుంచి 1000 మెగావాట్లకు చేరుకుంది.
అలాగే 1200 మెగావాట్ల ఉత్పత్తి దిశగా పవన విద్యుత్ పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జయలలిత మంత్రులు, ఉన్నతాధికారులతో సచివాలయంలో సోమవారం సమావేశమయ్యూరు. విద్యుత్‌కోతల విషయంలో సామాన్యులు, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార వర్గాలకు ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయూ కేటగిరిల్లో అమలులో ఉన్న విద్యుత్ కోతలను 40 నుంచి 20 శాతానికి తగ్గించారు. గృహాలకు నిరంతర సరఫరాకు వీలుగా విద్యుత్ వినియోగ కీలకవేళల్లో సైతం 10 వాట్స్ పరిమితికి లోబడి వినియోగించుకోవచ్చని నిబంధనలను సడలించారు. ఈ విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేయూలని ఆదేశించారు.
గ్యాస్ రాయితీపై లేఖ
నగదు బదిలీ పథకం పరిధిలోకి వంటగ్యాస్ రాయితీని తీసుకురావడాన్ని అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానికి ఆమె సోమవారం లేఖ రాశారు. వంట గ్యాస్ అనేది గృహవాడకంలో అత్యంత ప్రాముఖ్యమైనదని, తక్షణ అవసరమైనదని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి వంట గ్యాస్ రారుుతీని నగదు బదిలీ పథకం పరిధి కింద నేరుగా వినియోగదారులకు అందజేస్తామని పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నా రు.
ఆధార్‌కార్డులు ఉన్నవారే నగదు బదిలీ పథకం పరిధిలో కి వస్తారని ముడిపెట్టడం ఆందోళనకరమని వెల్లడించారు. రాష్ట్రంలో నగదు బదిలీ పథకం పరిధిలోకి 6.7 కోట్ల మంది వస్తారని వివరించారు. ఇందులో 2.52 కోట్ల మందికే ఆధార్‌కార్డులు జారీ అయ్యూయని గుర్తు చేశారు. కార్డులో జారీలో కేంద్ర పరిధిలోని రెండు విభాగాల మధ్య సమన్వయలోపం వల్ల జాప్యం జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందడంలో ఆధార్‌కార్డుతో ముడిపెట్టరాదన్న సుప్రీంకోర్టు అదేశాలను ఆమె గుర్తు చేశారు. ఈ దృష్ట్యా నగదు బదిలీలో వంటగ్యాస్ రాయితీని చేర్చాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెంటనే విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement