రైల్లో బట్టలు విప్పి చితకబాదారు | Mumbai local train mob strips, whips teenage suspected of mobile theft | Sakshi
Sakshi News home page

రైల్లో బట్టలు విప్పి చితకబాదారు

Published Thu, Feb 18 2016 9:19 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

రైల్లో బట్టలు విప్పి చితకబాదారు

రైల్లో బట్టలు విప్పి చితకబాదారు

ముంబై: మొబైల్ ఫోన్‌ను దొంగలించారన్న కారణంతో ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు టీనేజ్ యువకులను కొందరు ప్రయాణికులు చితకబాదారు. వారి బట్టలు విప్పి దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.
 

బాధిత యువకులు నిస్సహాయంగా వేడుకుంటున్నా కనికరం చూపని ఆ వ్యక్తులు దుస్తులు విప్పి వారిని రైలు కంపార్ట్‌మెంట్‌లో చితకబాదారు. అనంతరం ప్లాట్‌ఫామ్‌పైకి దిగిన తర్వాత కూడా మళ్లీ యువకులపై దాడి చేసి.. తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయాలైన ఆ యువకుల పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు. కొన్ని రోజుల కిందట జరిగినట్టు భావిస్తున్న ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, వీడియో ఆధారంగా యువకులను, దాడి చేసినవారిని గుర్తిస్తామని ముంబై రైల్వే పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement