reverse driving
-
రైలు కింద పడిన మహిళ.. కాపాడేందుకు ట్రైన్ రివర్స్
ముంబై: ఓ మహిళ రైలు కింద పడి ప్రాణాలతో బయడపటింది. రైలు కింద మహిళా చిక్కుకున్న విషయాన్ని గ్రహించిన పైలట్ ట్రైన్‌ను వెనక్కి వెళ్లనివ్వడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది, అయితే ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లను కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై లోకల్ స్టేషన్లో సోమవారం చోటుచేసుకుంది.ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మహిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ రైలు రద్దీగా ఉండటంతో ఆమె ఎక్కే క్రమంలో కాలు జారింది. దీంతో.. రైలు కింద పడిపోయింది. అప్పటికే రైలు కదలడంతో.. ఒక కంపార్ట్మెంట్ ఆమె పై నుంచి వెళ్లింది. అప్పుడు ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బంది అలారం మోగించడంతో.. రైలు వెనక్కు వెళ్లింది.పోలీసు అధికారులు ట్రాక్‌లపై దిగి.. ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంటనే మహిళను సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నిల తెలిపారు. ఈ ఘటనలో మహిళ తన రెండు కాళ్లను కోల్పోయింది.కాగా.. ముంబైలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను రద్దు కావడంతో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరింది. ఫుట్‌బోర్డు వద్ద కూడా నిలబడి మరీ ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలోనే బేలాపూర్ స్టేషన్లో చాలాసేపు తర్వాత థానేకి వెళ్లే రైలు రావడంతో.. జనాలందరూ ఎగబడ్డారు. దీంతో బాధిత మహిళ కాలుజారి కిందపడినట్లు అధికారులు పేర్కొన్నారు. -
రివర్స్ గేర్‌లో 2 కి.మీ.లు
మైసూరు: అటవీ ప్రాంతంలో ప్రసవం కోసం గర్భిణిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా అడవి ఏనుగు అడ్డువచ్చి దాడికి యతి్నంచింది. అంబులెన్స్ డ్రైవర్ చాకచక్యంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెనక్కు తీసుకెళ్లి గర్భిణిని కాపాడాడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటెలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. జీఎం హళ్ళి గ్రామానికి చెందిన లంబాడి మహిళ సుచిత్ర నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చి హెచ్డికోటె ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ఒక అడవి ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడింది. సుమారు 15 నిమిషాల పాటు గజరాజు కదలకుండా అలాగే ఉంది. డ్రైవర్ శరత్ అంబులెన్స్‌ను ముందుకు పోనివ్వగా ఏనుగు అంబులెన్స్ మీదకు దూసుకొచ్చింది. దీంతో డ్రైవర్ రివర్స్ గేర్ వేసి సుమారు 2 కిలోమీటర్ల దూరం వెనక్కు ప్రయాణించాడు. ఏనుగు కొంతదూరం వెంబడించి నిలిచిపోయింది. అంబులెన్స్‌లో ఉన్న ఆశా కార్యకర్త సావిత్రిబాయి గర్భిణికి కాన్పు చేసింది. తరువాత మరో మార్గంలో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. -
ఏడాదిన్నరకే నూరేళ్లు... తండ్రి నడిపే వాహనమే..
బనశంకరి: ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆడుకుంటుండగా విధి కన్నెర్ర చేసి తన వశం చేసుకుంది. తండ్రి నడుపుతున్న వాహనమే మృత్యుశకటమై చిన్నారి ప్రాణాలు బలిగొంది. బోసినవ్వుల చిన్నారి ఇకలేదని తెలియడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన సర్జాపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సర్జాపుర కామనహళ్లిలో బాలకృష్ణ తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. దంపతులకు ఏడాదిన్నర వయసున్న మనీశా అనే కుమార్తె ఉంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ముందు మనీశా ఆడుకుంటోంది. బాలకృష్ణ తన ఐచర్ వాహనాన్ని రివర్స్ చేస్తుండగా ఆకస్మికంగా పసికందు వాహనం కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. (చదవండి: పెళ్లై ఏడు నెలలే ... తల్లిదండ్రులను చూడటానికని వెళ్లి..) -
Ola Electric: బైక్ ఫీచర్లు మామూలుగా లేవుగా..!
వరల్డ్ వైడ్‌గా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ బైక్ గురించి వస్తున్న వార్తలు బైక్ లవర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రి-బుకింగ్స్‌లో కూడా సంచలానాన్ని సృష్టించింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే లక్షకుపైగా బైక్‌లు బుక్ అయ్యాయి. ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను ఏగబడిమరి ప్రి-బుకింగ్స్ చేసుకున్నారు. తాజాగా భవీష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లును రిలీజ్ చేశాడు. ఈ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైక్‌ల విభాగంలో మరో సంచలనాన్ని సృష్టించనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ముందుకే కాదు వెనక్కి కూడా ప్రయాణించగలవని భవీష్ అగర్వాల్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. రివర్స్ ఫీచర్‌తో పాటుగా కీ లెస్ స్టార్టింగ్‌ను ఓలా ఎలక్ట్రిక్ బైక్ సపోర్ట్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్ సహాయంతో స్కూటర్‌ను యాక్సెస్ చేయవచ్చును. స్కూటర్లో బెస్ట్-ఇన్-సెగ్మెంట్ బూట్ స్పేస్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్-ఫస్ట్ లేదా సెగ్మెంట్ బెస్ట్‌గా నిలుస్తోందని కంపెనీ తెలిపింది. !won em ot netsiL A revolution to Reverse climate change! See you on 15th August at https://t.co/lzUzbWbFl7 #JoinTheRevolution @OlaElectric pic.twitter.com/WXXn3sD8CN — Bhavish Aggarwal (@bhash) August 7, 2021 -
వెనక్కి ప్రయాణించిన రైలు
-
వెనక్కి ప్రయాణించిన రైలు.. తప్పిన భారీ ముప్పు
డెహ్రాడూన్: ఓ రైలు కొన్ని కిలోమీటర్ల మేర వెనక్కి ప్రయాణం చేసింది. అదృష్టం కొద్ది ఆ సమయంలో పట్టాలపై ఎవరు లేకపోవడం.. వేరే రైళ్లు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఢిల్లీ నుంచి తనక్‌పూర్ వెళ్తోన్న పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం రివర్స్‌లో ప్రయాణం చేసింది. అలా కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాక ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ట్రాక్ మీద వేరే రైళ్లు రాకపోవడం.. జనాలు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. జంతువును తప్పించడం కోసం సడెన్ బ్రేక్ వేయడంతో ఇలా జరిగిందని తెలిపారు అధికారులు. ఈ సందర్భంగా చంపావత్ ఎస్పీ లోకేశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘సడెన్‌గా పట్టాలపైకి ఓ జంతువు వచ్చింది. దాన్ని కాపడటం కోసం సడెన్ బ్రేక్ వేశారు. దాంతో రైలు దానికదే వెనక్కి ప్రయాణించడం ప్రారంభించింది. బన్బాసా నుంచి చనక్‌పూర్ వరకు వెళ్లిన రైలు ఆ తర్వాత ఆగిపోయింది. ఈ సమయంలో రైలులో 60-70 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరిని చనక్‌పూర్ నుంచి బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు పంపించాము’’ అని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించి లోకో పైలెట్, గార్డ్ని సస్పెండ్ చేసినట్లు నార్త్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. చదవండి: బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్ ఒక్క క్షణం ఆలస్యమైతే.. పరిస్థితి? వైరల్ వీడియో -
11 ఏళ్లుగా రివర్స్‌గేర్...
ఏదైనా పనిని అందరిలా కాకుండా విభిన్నంగా చేస్తే ఆ వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఈ సూత్రాన్ని హర్‌ప్రీత్ దేవ్ చక్కగా ఒంటబట్టించుకున్నాడు. కారును ముందుకు కాకుండా వెనక్కి నడిపించడంలో సిద్ధహస్తుడయ్యాడు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఈయన.. అక్కడివారందరికీ సుపరిచితుడే. గత 11 సంవత్సరాలుగా తన ఫియట్ పద్మినీ కారును ఇలా వెనక్కే నడుపుతున్నాడు. ఇంతకీ ఈ రివర్స్ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే 2003కి వెళ్లాల్సిందే. ఓ రోజు అర్ధరాత్రి వేళ హర్‌ప్రీత్ కారు రివర్స్ చేస్తుండగా గేర్ అలాగే ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా గేర్ మారలేదు. దీంతో నగర శివార్ల నుంచి భటిండా వరకు రివర్స్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. అప్పుడే ఈ రివర్స్ డ్రైవింగ్ ఆలోచన వచ్చింది. అంతే, అప్పటి నుంచి అలా రివర్స్‌గానే వెళుతున్నాడు. ముందుకెళ్లడానికి ఒకటి, రివర్స్ వెళ్లడానికి నాలుగు గేర్లు ఉండేలా గేర్‌బాక్సును కూడా మార్పించాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే రివర్స్ డ్రైవింగ్ చేయడానికి వీలుగా ప్రత్యేకమైన లెసైన్సు కూడా పొందాడు. వెనక్కి డ్రైవింగ్ అంటే ఏదో నెమ్మదిగా వెళ్తాడనుకుంటే పొరపాటే. గంటకు అత్యధికంగా 50 మైళ్ల వేగంతో దూసుకెళతాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య శాంతి స్థాపన కోసం 2005లో రాజస్థాన్ నుంచి లాహోర్ వరకు వెనక్కి డ్రైవింగ్ చేశాడు. ఇలా వెనక్కి డ్రైవింగ్ చేయడం వల్ల మెడనొప్పి తదితర సమస్యలతో బాధపడుతున్నట్టు హర్‌ప్రీత్ చెప్పాడు. కష్టపడకుండా రికార్డులు సాధించడం కుదరదు కదా? అందుకే ఇవన్నీ భరిస్తున్నట్టు వెల్లడించాడు. నిజమే కదా..!