డెహ్రాడూన్: ఓ రైలు కొన్ని కిలోమీటర్ల మేర వెనక్కి ప్రయాణం చేసింది. అదృష్టం కొద్ది ఆ సమయంలో పట్టాలపై ఎవరు లేకపోవడం.. వేరే రైళ్లు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఢిల్లీ నుంచి తనక్‌పూర్ వెళ్తోన్న పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం రివర్స్‌లో ప్రయాణం చేసింది. అలా కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాక ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ట్రాక్ మీద వేరే రైళ్లు రాకపోవడం.. జనాలు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.
జంతువును తప్పించడం కోసం సడెన్ బ్రేక్ వేయడంతో ఇలా జరిగిందని తెలిపారు అధికారులు. ఈ సందర్భంగా చంపావత్ ఎస్పీ లోకేశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘సడెన్‌గా పట్టాలపైకి ఓ జంతువు వచ్చింది. దాన్ని కాపడటం కోసం సడెన్ బ్రేక్ వేశారు. దాంతో రైలు దానికదే వెనక్కి ప్రయాణించడం ప్రారంభించింది. బన్‌బాసా నుంచి చనక్‌పూర్ వరకు వెళ్లిన రైలు ఆ తర్వాత ఆగిపోయింది. ఈ సమయంలో రైలులో 60-70 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరిని చనక్‌పూర్ నుంచి బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు పంపించాము’’ అని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించి లోకో పైలెట్, గార్డ్‌ని సస్పెండ్ చేసినట్లు నార్త్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment