
బనశంకరి: ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆడుకుంటుండగా విధి కన్నెర్ర చేసి తన వశం చేసుకుంది. తండ్రి నడుపుతున్న వాహనమే మృత్యుశకటమై చిన్నారి ప్రాణాలు బలిగొంది. బోసినవ్వుల చిన్నారి ఇకలేదని తెలియడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన సర్జాపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
సర్జాపుర కామనహళ్లిలో బాలకృష్ణ తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. దంపతులకు ఏడాదిన్నర వయసున్న మనీశా అనే కుమార్తె ఉంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ముందు మనీశా ఆడుకుంటోంది. బాలకృష్ణ తన ఐచర్ వాహనాన్ని రివర్స్ చేస్తుండగా ఆకస్మికంగా పసికందు వాహనం కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
(చదవండి: పెళ్లై ఏడు నెలలే ... తల్లిదండ్రులను చూడటానికని వెళ్లి..)