మూడో భార్యను ఇంటికి రప్పించాలని తండ్రితో గొడవ.. తట్టుకోలేక | Karnataka: Drunken Son Assassinated By Father | Sakshi
Sakshi News home page

మూడో భార్యను ఇంటికి రప్పించాలని తండ్రితో గొడవ.. తట్టుకోలేక

Aug 12 2021 3:28 PM | Updated on Aug 12 2021 4:09 PM

Karnataka: Drunken Son Assassinated By Father - Sakshi

సాక్షి, కెలమంగలం(బెంగళూరు): తాగుబోతు కొడుకుపెట్టే హింసలను భరించలేక తండ్రే మద్యంలో పురుగుల మందు ఇచ్చి హత్య చేసిన ఘోరం రాయకోట వద్ద జరిగింది. రాయకోట సమీపంలోని మేల్నోకియూరు గ్రామానికి చెందిన రాజ (41). ఇతని కొడుకు లోకేష్‌ (25). లోకేష్‌ తాగుడు అలవాటును తట్టుకోలేక ఇద్దరు భార్యలు విడిచిపెట్టగా, మూడో భార్య కొడియా ఇంట్లో ఉంది. అతని గొడవను భరించలేక ఆమె కూడా ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్యను రప్పించాలని తండ్రిని వేధించసాగాడు. దీంతో ఆవేశానికి గురైన తండ్రి గత నెల 23వ తేదీ మద్యంలో పురుగుల మందు కలిపి ఇచ్చి కొడుకును చంపాడు. రహస్యంగా తీసుకెళ్లి దహనం చేశాడు. లోకేష్‌ కనిపించడం లేదని తెలిసి రాయకోట పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం రాజ  సూళకుంట గ్రామాధికారి రత్నవేల్‌ వద్ద లొంగిపోయాడు. గ్రామాధికారి అతన్ని రాయకోట పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని డెంకణీకోట కోర్టులో హాజరు పరచగా, జడ్జి 15 రోజులపాటు రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను జైలుకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement