చెన్నై : భార్యపై అనుమానంతో ఎనిమిది రోజుల మగబిడ్డను నేలకేసి కొట్టి చంపేడో భర్త. బిడ్డకు తన పోలిక రాలేదన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడలూరుకు చెందిన ఏలుమలై లారీ డ్రైవర్. అతడి భార్య శివరంజని ఈనెల 10వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదివరకే భార్యపై అనుమానం పెంచుకుని వేధిస్తూ వచ్చిన ఏలుమలై గురువారం రాత్రి బిడ్డను చూసేందుకు అత్తారింటికి వచ్చాడు.
ఏలుమలై బిడ్డను చూడగానే తన పోలిక లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా తల్లి ఒడిలో ఉన్న బిడ్డను బలవంతంగా లాక్కుని నేలకేసి కొట్టి కడతేర్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలుమలైని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment