
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఉన్న డౌన్‌టౌన్ హోటల్‌పై బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఓ విదేశీ యువతితో పాటు పంజాబ్‌కు చెందిన మరో యువతి ఇక్కడ వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరిని పోలీసులు శనివారం పునరావాస కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే... సైఫాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న అమృతాక్యాజిల్ హోటల్‌లో సాయి అలియాస్ శర్మ అనే వ్యక్తి రెండు గదులను అద్దెకు తీసుకొని విదేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.
కొంత మంది విటులు ఈ హోటల్‌కు కాకుండా తాము కోరుకున్న హోటల్‌కు యువతులను పంపించాలని ఒప్పందం కుదర్చుకుంటే ఆ మేరకు ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తూ సహాయకుడిగా రాజేష్‌కుమార్ సాహును నియమించుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఓ విటుడు బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ది డౌన్‌టౌన్ హోటల్‌లో గదిని బుక్ చేసుకొని అక్కడికి ఉజ్బకిస్తాన్ దేశానికి చెందిన ఓ యువతిని రప్పించుకున్నాడు. ఆమెతో పాటు పంజాబ్‌కు చెందిన మరో యువతిని కూడా ఒప్పందంలో భాగంగా పంపించాడు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేసి ఉజ్బకిస్తాన్‌కు చెందిన అజీజాతో పాటు ఖుషీపాటక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన వ్యభిచార నిర్వాహకుడు సాయి పరారీలో ఉండగా ఆయన అనుచరుడు రాజేష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. యువతులను సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. ది టౌన్‌టౌన్ హోటల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ఎస్‌ఐ బచ్చు శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment