భార్యతో వ్యభిచారం చేయించి.. చివరికిలా! | Turkish pimp who forced his wife to become a prostitute is shot dead | Sakshi
Sakshi News home page

భార్యతో వ్యభిచారం చేయించి.. చివరికిలా!

Published Sat, May 7 2016 8:07 PM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM

భార్య కాగ్లాతో అబ్దుల్ తురాన్ - Sakshi

భార్య కాగ్లాతో అబ్దుల్ తురాన్

ఇస్తాంబుల్: డబ్బుకోసం భార్యతో వ్యభిచారం చేయించిన భర్త చివరికి ఆమె కస్టమర్ చేతిలో హతమైన ఘటన టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్ తురాన్ (26) డబ్బు సంపాధించడానికి భార్య కాగ్లాను వ్యభిచార వృత్తిలోకి దింపాడు. అంతేకాదు అతనే కస్టమర్లతో మాట్లాడి మరీ.. ఎక్కువ డబ్బు ఇచ్చేవారికి భార్యను అప్పగించేవాడు.

ఈ క్రమంలో అదే పట్టణానికి చెందిన సహిన్ అనే ఖరీదైన కస్టమర్ తో కాగ్లా ప్రేమలో పడింది. దీంతో తిరిగి భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని కాగ్లా సహిన్తోనే ఉండిపోయింది. కాగ్లా చర్యతో కోపోద్రిక్తుడైన తురాన్.. సహిన్ను నిలదీయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. తురాన్ తన భార్యను వెనక్కి ఇవ్వమని, ఎక్కువ డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయడంతో సహిన్ తన స్నేహితులతో కలిసి అతడిని కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement