
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని సంతపేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. సంతపేటలోని ఓబులంపల్లి కాలనీలో రవి భార్య భువనేశ్వరి, కూతురు గాయిత్రి (9), తల్లితో కలిసి నివాసముంటున్నాడు. ఓ స్థలం విషయంలో కుటుంబంలో రెండు మూడు నెలలుగా గొడవ జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని రవి, భువనేశ్వరి, గాయత్రి ప్రాణాలు తీసుకున్నారు. అయితే, స్థలం విషయంలో గొడవతో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారా.. మరేదైనా కారణముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment