
సాక్షి, పశ్చిమగోదావరి : నరసాపురం మండలం సార్వా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గల్ఫ్‌లో ఉన్న భార్య ఫోన్ చేయలేదనే కోపంతో భర్త అలీష తన ఇద్దరు పిల్లలను చితకబాదాడు. దాంతోపాటు ఆ దృశ్యాల్ని వీడియో రికార్డు చేసి.. తనకు ఫోన్ చేయకుంటే పిల్లల్ని చంపేస్తానంటూ భార్యపై బెదిరింపులకు దిగాడు. వీడియో వైరల్ కావడంతో పిల్లల్ని రక్షించేందుకు పోలీసులు అలీష ఇంటికి వెళ్లారు. అయితే, వీడియో చూసిన వారి బంధువులు అప్పటికే పిల్లల్ని తీసుకెళ్లిపోయారు. పరారీలో ఉన్న నిందితుడు అలీష కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment