టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఈ బ్యూటీ సొంతం. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరను మెప్పిస్తున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. అక్కడ విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.
తాజాగా హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ సినిమాలో అనసూయ నటించనుంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని మూవీ టీం వెల్లడించింది. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాశి ఖన్నా, ఈషా రెబ్బా కథానాయుకలుగా నటించున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment