
చెన్నై సినిమా: 'మాలై నేర మల్లిపూ' చిత్రం ఫస్ట్ లుక్ సినీ వర్గాలను ఆకట్టుకుంటోంది. 21 ఏళ్ల యువ కుడు సంజయ్ నారాయణన్ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ఇది. కొత్త నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని యాన్ ఎవిరి.ఫేమ్ (మ్యాటర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై) విజయలక్ష్మి నారాయణన్ నిర్మించారు. హృతిక్ శక్తివేల్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఒక ప్రము ఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందని నిర్మాత తెలిపారు.
దీనికి సంబంధించిన వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఓ వ్యభిచార యువతి బయోపిక్‌గా పేర్కొన్నారు. చిన్న వయసులోనే వ్యభిచార కూపంలోకి నెట్టబడిన లక్ష్మీ అనే యువతి జీవితంలో జరిగిన ఘటనలు, ఎదుర్కొన్న సమస్యలను, చీకటి కోణాలను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు.
చదవండి: నా సినిమాకు నాకే టికెట్లు దొరకలేదు: యంగ్ హీరో
Comments
Please login to add a commentAdd a comment