
చెన్నై సినిమా: మిర్చి శివ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం 'సింగిల్ శంకరుమ్.. స్మార్ట్ ఫోన్ సిమ్రానుమ్'. నటి మేఘా ఆకాష్, అంజు కురియన్ కథానాయికలుగా, గాయకు డు మనో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. పి.ఎస్.విఘ్నేష్ షా దర్శకుడిగా పరిచయమవు తున్న ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ పతాకంపై కె.కుమార్ నిర్మిస్తున్నారు. ఆర్థర్ ఎ.విల్సన్ చాయాగ్రహణం, లియోస్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈచిత్రం చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువా రం విడుదల చేసినట్లు దర్శకుడు చెప్పారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో శివ మోకాళ్లపై వంగి ఉండటం, అతన్ని పట్టుకుని హాలీవుడ్ సూపర్ హీరోస్ హల్క్, ఐరన్ మ్యాన్‌లు ఉండటం మనం చూడొచ్చు. ఇందులో హల్క్ లుంగీ ధరించి ఉండటమే కాకుండా చెంపై పుట్టుమచ్చ, నుదిటిపై విబూదితో చాలా ఆసక్తిగా ఉంది. ఇక ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ వండర్ వుమెన్ వంటి కేప్ ధరించి, అతని వెనుక కత్తి ఉండటాన్ని మనం గమనించవచ్చు.
చదవండి: సల్మాన్‌కు నటి ముద్దులు, హగ్గులు.. మందు కొట్టావా? అంటూ ట్రోలింగ్
Feeling extremely happy to release the first look of #singleshankarumsmartphonesimranum 😍 @actorshiva @akash_megha @AnjuKurian10 @vignesh_sha @larkstudios_chn @makapa_anand @kumarkarupannan @leon_james @ArthurWisonA @Gdurairaj10 @editorBoopathi @dineshashok_13 @proyuvraaj pic.twitter.com/CgaOmgMBrX
— vignesh sha (@vignesh_sha) May 4, 2022