కుటుంబ కథాంశంతో ‘సఃకుటుంబానాం’ | Sahkutumbanaam First Look And Motion Poster Released | Sakshi
Sakshi News home page

కుటుంబ కథాంశంతో ‘సఃకుటుంబానాం’

Published Thu, Apr 11 2024 5:19 PM | Last Updated on Thu, Apr 11 2024 5:19 PM

Sahkutumbanaam First Look And Motion Poster Released - Sakshi

రామ్‌ కిరణ్‌, మేఘ ఆకాష్‌ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మానందం, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హెచ్‌.మహదేవ గౌడ్‌ నిర్మాత. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ,మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు.  ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్‌ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో ఇంత మంది ఆరిస్టులు, ఇంత మంచి కాంబినేషన్స్‌తో ఏ సినిమా రాలేదు. ఇందులో చాలా మంచి కథ ఉంది. ఎవరూ ఊహించని రీతిలో ఈ చిత్రం ఉంటుంది.

నిర్మాత మహదేవ్‌ మాట్లాడుతూ.. అచ్చమైన తెలుగు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందరు మెచ్చేలా కుటుంబ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement