'Good Night' Movie OTT Release Date, Platform - Sakshi
Sakshi News home page

Good Night Movie OTT: ఆ మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. తెలుగులోనూ!

Jun 22 2023 8:25 AM | Updated on Jun 27 2023 11:15 AM

Good Night Movie OTT Release Date Telugu - Sakshi

'కాదేది కవితకనర్హం' అని ప్రముఖ రచయిత శ్రీశ్రీ చెప్పినట్లు.. సినిమా తీయాలంటే కొత్త కథలేం అక్కర్లేదు. మన చుట్టూ ఉన్న పరిసరాలు గమనిస‍్తే చాలు బోలెడు లైన్స్ దొరుకుతాయి. వాటిలో ఓ పాయింట్ తీసుకుని, దాన్ని రెండు-రెండున్నర గంటల చిత్రంగా తీసియొచ్చు. అన్నీ కలిసొస్తే హిట్ కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తెలుగులో తక్కువ గానీ తమిళ, మలయాళ డైరెక్టర్లు ఈ విషయంలో దిట్టలు. 

డైరెక్టర్ మారుతి గతంలో సింపుల్ పాయింట్స్ తో కొన్ని సినిమాలు తీశాడు. 'భలే భలే మగాడివోయ్'లో హీరోకి మతిమరుపు, 'మహానుభావుడు'లో హీరోకి ఓసీడీ(అతిశుభ్రత). ఈ మధ‍్య తమిళంలోనూ 'గుడ్ నైట్' అని మూవీ వచ్చింది. మనందరికీ తెలిసిన 'గురక' అనే సమస్య ఆధారంగా ఈ సినిమా తీశారు. అద్భుతమైన విజయం అందుకున్నారు. 

(ఇదీ చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని!)

ఇప్పుడీ సినిమాను జూలై 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళంలోనూ స్ట‍్రీమింగ్ కానుంది. దీని గురించి ఇప్పటికే తెలిసిన కొందరు ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మీరు మూవీ లవర్ అయితే మాత్రం అస్సలు మిస్సవ్వొద్దు.

'గుడ్ నైట్' కథేంటి?
మోహన్ (మణికందన్)కు గురక సమస్య. అక్కాబావతో కలిసి ఉంటాడు. తన జబ్బు వల్ల అందరూ తిడుతున్నా ఏదో అలా నెట్టుకొచ్చేస్తుంటాడు. అను(మీరా రఘునాధ్) పరిచయమైన తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరి స్నేహం పెళ్లి వరకు వెళ్తుంది. అయితే తనకు గురక ప్రాబ్లమ్ ఉందని ఆమె దగ్గర దాచిపెడతాడు. కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అనుకి అసలు విషయం తెలుస‍్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? భార్యభర్తలు సర్దుకున్నారా లేదా అనేదే ఓటీటీలోకి సినిమా వచ్చిన తర్వాత చూసి ఎంజాయ్ చేయండి.

(ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఫస్ట్‌లుక్.. ఇది గమనించారా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement