గాల్లో ఎగిరే రాకెట్ పయనం నేల మీద నుంచే ప్రారంభమవుతుంది. అది ఇస్రోలోనైనా, ఇంటి ముందు వాకిట్లో అయినా! అయితే ఓ పెద్దాయన మాత్రం రాకెట్‌ను పంపించేందుకు కొత్త విధానాన్ని కనుగొన్నాడు. కానీ దీన్ని ఎవరూ ప్రయత్నించద్దని కోరుతున్నాడు. అదేంటని తికమకపడకుండా ముందుగా ఈ వార్త చదివేయండి.. అటవీ అధికారి సుశాంత్ నందా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఓ వ్యక్తి నడిరోడ్డుపై నిలబడుతూ ఓ సాహసానికి పూనుకున్నాడు. దర్జాగా సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. ఓ చేతిలో రాకెట్లతో నిలబడ్డాడు. (అవార్డు విన్నింగ్ లెవల్లో నటించింది)
ఇంకేముందీ.. ఎవరూ ఆ దారి గుండా రావడం లేదని నిశ్చయించుకున్నాక అసలు పని ప్రారంభించాడు. ఒక్కో రాకెట్‌ను కుడి చేతులోకి తీసుకుని దాని చివరను నోట్లో ఉన్న సిగరెట్‌కు అంటించి గాల్లోకి పంపాడు. ఏ మాత్రం తొణుకు బెణుకూ లేకుండా సునాయాసంగా రాకెట్లను అంతరిక్షంలోకి కాకపోయినా ఆకాశంలోకి పంపాడు. సుమారు పది రాకెట్లను కేవలం పద్దెనిమిది సెకండ్లలో గాల్లోకి పంపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "అదిరిందయ్యా నీ ప్రయోగం" అంటూ కొందరు అదుర్స్ అని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం "కొంచెం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదం" అని మండిపడుతున్నారు. కాగా ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి వైరల్ అవుతోంది. (బర్త్‌డే గిఫ్ట్.. సర్‌ప్రైజ్ సూపర్!!)
Comments
Please login to add a commentAdd a comment