మీడియాతో మాట్లాడుతున్న మేయర్ బొంతు రామ్మోహన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేషన్లకు నిధులను విడుదల చేయాలని మేయ ర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హరిత ప్లాజాలో రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షు డు జి.రాజేశంగౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మేయర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యాలు, ఫ్యాక్టరీలు, తదితర సంస్థల నుంచి నూరు శాతం ఆస్తి పన్ను వసూలుకు ప్రభుత్వం కార్పొరేషన్లకు అనుమతివ్వాలని కోరారు. పట్టణ స్థానిక సంస్థలు తమ నివేదికల్ని రాష్ట్ర ఆర్థిక కమిషన్‌కు పంపించాలని, అందుకనుగుణంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని రాజేశంగౌడ్ చెప్పారు.
కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్లు ఎన్.నరేందర్, సర్దార్ రవీందర్‌సింగ్, లక్ష్మీనారాయణ, సుజాత శ్రీశైలం, డాక్టర్ పాపాలాల్, మునిసిపల్ పరిపాలన డైరెక్టర్ టీకే శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్(ఫైనాన్స్) జయరాజ్ కెన్నెడి, ఆ కార్పొరేషన్ల కమిషనర్లు వీపీ గౌతమ్, కె.శశాంక, డి.జాన్ శాంసన్, సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment