గణేశ్ నిమజ్జన పర్వానికి భాగ్యనగరం సర్వ సన్నద్ధమైంది. భారీ ఊరేగింపు.. టపాసుల మోతలు.. బాణసంచా వెలుగులు.. బ్యాండ్ మేళాలు.. డీజే హోరు.. భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా నేడు జరగనున్న వేడుకకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిమజ్జనోత్సవానికి అన్ని ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు పూర్తిచేశాయి.