బెంగళూరు : రోజు రోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలతో ఐటీ నగరంగా పేరుగాంచిన బెంగళూరు వాసులు సతమతమవుతున్నారు. ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డీసీ తమ్మన్న కొత్త ఆలోచనతో వచ్చారు. పార్కింగ్ స్పేస్ లేకపోతే కార్లను కొనుగోలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్కింగ్ స్పేస్ లేనివారికి కార్లను అమ్మకుండా చేయడం వల్ల ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.
సొంత వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించాడాన్ని కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. డీజిల్ వాహనాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు కూడా వెల్లడించారు. ఉచితంగా బస్ పాస్‌లు ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీపై మాట్లాడుతూ ఈ విషయంపై అతి త్వరలోనే ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు. దాదాపు 19.6 లక్షల మంది విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వనున్నారు.
బెంగుళూరు ట్రాపిక్ జాంల కారణంగా ఏటా రూ. 38 వేల కోట్లు నష్టం వాటిల్లుతోందని ఓ ప్రైవేటు ఏజెన్సీ రిపోర్టును వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment