Parking space
-
పార్కింగ్ స్థలం ఉంటేనే ఇక కొత్త వాహనం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో వాహనం కొనడం ఒకెత్తయితే, దాని పార్కింగ్‌కు స్థలం దొరకడం మరొక ఎత్తు. ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ స్థలం కొరతతో నగరవాసులు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ సిటీలో అస్తవ్యస్తంగా ఉన్న పార్కింగ్ వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రజలు కొత్తవాహనాలను కొనే ముందు వాటిని పార్కింగ్‌కు సొంత స్థలం ఉందని ప్రమాణపత్రం ఇవ్వాలని తీర్మానించింది. స్మార్ట్‌పార్కింగ్ వ్యవస్థను అమలు చేయనుంది. చదవండి: (రెడ్ అలర్ట్: రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం) నగరమంతటా పార్కింగ్ ఫీజులు సీఎం విధానసౌధలో ఉన్నతాధికారులతో పార్కింగ్ సమస్యపై చర్చించారు. విధానాల రూపకల్పన కోసం కమిటీని వేశారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు మాదిరిగా నగరమంతటా ప్రధాన స్థలాల్లో వాహనాల పార్కింగ్‌కు నిర్ణీత ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇళ్ల పక్కన ఉండే ఖాళీ స్థలాలను పార్కింగ్ ప్రదేశాలుగా వాడుకోవాలని చర్చించారు. కమిటీ నివేదిక వచ్చాక పార్కింగ్ ప్రదేశాలను ఖరారు చేస్తారు. -
బెంగళూరు వాసులు.. కొత్త కార్లు కొనొద్దు
బెంగళూరు : రోజు రోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలతో ఐటీ నగరంగా పేరుగాంచిన బెంగళూరు వాసులు సతమతమవుతున్నారు. ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డీసీ తమ్మన్న కొత్త ఆలోచనతో వచ్చారు. పార్కింగ్ స్పేస్ లేకపోతే కార్లను కొనుగోలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్కింగ్ స్పేస్ లేనివారికి కార్లను అమ్మకుండా చేయడం వల్ల ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సొంత వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించాడాన్ని కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. డీజిల్ వాహనాలకు ఫుల్స్టాప్ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు కూడా వెల్లడించారు. ఉచితంగా బస్ పాస్‌లు ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీపై మాట్లాడుతూ ఈ విషయంపై అతి త్వరలోనే ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు. దాదాపు 19.6 లక్షల మంది విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వనున్నారు. బెంగుళూరు ట్రాపిక్ జాంల కారణంగా ఏటా రూ. 38 వేల కోట్లు నష్టం వాటిల్లుతోందని ఓ ప్రైవేటు ఏజెన్సీ రిపోర్టును వెలువరించింది. -
పార్కింగ్ స్థలం కోసం మహిళపై నటుడి దాడి
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్కింగ్ స్థలం విషయమై ఆయన తనపై భౌతికంగా దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించినట్టు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలోని యారి రోడ్డులో ఉన్న జోహ్రా అఘాది నగర్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. నవాజుద్దీన్‌తోపాటు ఫిర్యాదుదారు కూడా ఇదే సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఏడాది కిందట ఈ హౌసింగ్ సొసైటీలోకి మకాం మార్చిన నవాజుద్దీన్ సిద్దిఖీ పార్కింగ్ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించారని, ఈ విషయమై ఆదివారం మధ్యాహ్నం వాగ్వాదం జరుగడంతో అతను, అతని సోదరుడు, సిబ్బంది తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించి, తోసేశారని సొసైటీ చైర్మన్ సోనా దండేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 354 (మహిళపై దాడి, నేరపూరిత బలప్రయోగం) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్కింగ్ జోన్లపై దృష్టి
నోయిడా: నగరంలో పార్కింగ్ జోన్ల ఏర్పాటుపై నోయిడా అథారిటీ దృష్టి సారించింది. సెక్టార్ 18లో దుకాణాల వద్ద పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేయనుంది. అదే ప్రాంతంలోని గురుద్వారలో ఉచిత పార్కింగ్ జోన్ల సౌకర్యం కల్పించడానికి కసరత్తు చేస్తోంది. ఆర్నెళ్లలో అందుబాటులోకి.. సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో పార్కింగ్ జోన్లను నిర్మించడానికి నిర్ణయించింది. వీటిని ఆర్నెళ్లలో అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నట్లు గురుద్వార అధికారులు పేర్కొన్నారు. భూగర్భ ప్రాంతాల్లో సుమారు 2,200 చదరపు మీటర్లలో రెండు పార్కింగ్ జోన్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇవి ఒకసారి పూర్తి అయితే, నిత్యం 150 వాహనాలను పార్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. గురుద్వారాల్లో ఉచితం ఇంకా నగరంలోని మిగతా గురుద్వారాలైన బాంగ్లా సాహిబ్, రాక్బాగంజీ ప్రాంతాల్లో భక్తులకు ఉచితంగా పార్కింగ్ వసతి కల్పించనుంది. ఇక్కడ పార్కింగ్ వసతి కల్పించినందుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయమని, ప్రజలు, భక్తులకు సేవలందించడమే ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు. నోయిడాలోని సెక్టార్-18ని షాపింగ్ స్వర్గంగా పిలుస్తారు. ఇక్కడ రద్దీగా ఉంటుంది. వాహనాలు రోడ్లను ఆక్రమించి పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ అంతరాయం కల్గుతోంది. దీన్ని అధిగమించడం కోసమే పార్కింగ్ జోన్లను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణంలో.. ప్రస్తుతం రూ. 250 కోట్ల వ్యయంతో బహుళ ప్రయోజన పార్కింగ్ జోన్ నిర్మాణంలో ఉంది. ఇందులో సుమారు 4,000 వాహనాలను పార్కింగ్ చేసే అవకాశం ఉంది. ఇది 2016 వరకు పూర్తి అవుతుంది. ఇక్కడ పార్కింగ్ చార్జీలుంటాయి. నిర్ణీత సమయానికి రూ.200 , రూ. 300 చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. -
పార్కింగ్‌కు ‘మార్కింగ్’
సాక్షి, హైదరాబాద్: రోడ్డు పక్కన బండి పెడితే చాలు చేతిలో చీటి పెట్టి పార్కింగ్ చార్జి వసూలు చేసే అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు. జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలమేదో, కానిదేదో తెలియకపోవడంతో ఎవరు పడితే వారు చార్జి వసూలు చేస్తున్నారు. రహదారులనే పార్కింగ్ లాట్లుగా మార్చిన జీహెచ్ఎంసీ వైఖరిని ఆసరా చేసుకుని, ప్రైవేట్ వ్యక్తులు కూడా నగరంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కూడళ్లలో ఈ దందాకు పాల్పడుతున్నారు. ఇకపై ఈ పరిస్థితి లేకుండా.. జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన స్థలాల్లో పార్కింగ్ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకో సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు పార్కింగ్ ప్రదేశంలో అవసరమైన మార్కింగ్‌లు.. పార్కింగ్ ఫీజుల వివరాలతో పాటు సదరు పార్కింగ్ ఏరియాను టెండర్ల ద్వారా జీహెచ్ఎంసీ ఎవరికి కేటాయించారు, తదితర వివరాలు ప్రముఖం గా కన్పించేలా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు విరుద్ధం గా వ్యవహరించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పార్కింగ్ కేటాయించిన స్థలం కంటే అదనపు స్థలాన్ని ఆక్రమించి వసూలు చేస్తున్నా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తొలిదశలో ఎంపిక చేసిన 47 పార్కింగ్ ఏర్పాట్లలో వీటిని అమల్లోకి తేనున్నట్లు వివరించారు. రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎవరైనా అక్రమ వసూలుకు పాల్పడితే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు సైతం (040-21 11 11 11) ఫిర్యాదు చేయవచ్చు. పార్కింగ్ లాట్ల వద్ద ఉండాల్సిన ఏర్పాట్లు.. పార్కింగ్ ఫీజు వివరాలు ప్రముఖంగా కనిపించేలా ఏర్పాట్లు పార్కింగ్ సదుపాయం వేళల వివరాలు {పస్తుత రేట్ల మేరకు, పార్కింగ్ ఫీజులు.. నాలుగు చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు రూ. 10, తర్వాత ప్రతి గంటకు రూ. 5 ద్విచక్ర వాహనాలు మొదటి రెండు గంటలకు రూ. 5. ఆపై గంటకు రూ. 3.మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. ఈ ధరల్లోనూ మార్పులు చేసే అవకాశముంది. కొస మెరుపు: రెండేళ్ల క్రితం అప్పటి కమిషనర్ కృష్ణబాబు ఇలాంటి ప్రకటనే చేశారు. కానీ అమలుకు నోచుకోలేదు.