సాక్షి, హైదరాబాద్: కైతలాపూర్ ఆర్‌ఓబీని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. హైటెక్ సిటీ– బోరబండ స్టేషన్ల మధ్య నిర్మించిన ఆర్‌ఓబీతో కూకట్‌పల్లి, హైటెక్ సిటీల మధ్య సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. జేఎన్‌టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్‌షిప్ జంక్షన్, హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్, సైబర్‌టవర్ జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు.
సనత్‌నగర్, బాలానగర్, సికింద్రాబాద్‌ల నుంచి వచ్చేవారు మూసాపేట వద్ద డైవర్ట్ అయి కైతలాపూర్ మీదుగా మాదాపూర్ మెయిన్‌రోడ్ చేరుకోవచ్చు. తద్వారా 3.5 కి.మీ దూరం తగ్గడంతోపాటు గంట ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ఎస్సార్‌డీపీలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.86 కోట్లు. ఎస్సార్‌డీపీ ద్వారా చేపట్టిన 41 పనుల్లో ఇప్పటి వరకు 29 పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిలో ఏడు ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment