సాక్షి, హైదరాబాద్: కోటి జనాభా దాటిన మహా నగరంలో ‘ట్రాఫిక్’తీర్చలేని ప్రధాన సమస్య. 10 కిలోమీటర్ల ప్రయాణానికి 30 నుంచి 45 నిమిషాలు సమయం వెచ్చించాల్సిందే. రద్దీ సమయాల్లో గంట కంటే ఎక్కువే పడుతుంది. దీన్ని తగ్గించడం కోసం హైదరాబాద్ మహానగరాభి వృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పలు కార్యక్రమాలు చేపడు తూనే ఉంది. ఇందులో భాగంగా వచ్చిన ఆలో చనే.. వస్తు నిల్వ కేంద్రాలు (లాజిస్టిక్ హబ్స్). నగరంలోకి భారీ వాహనాలు రాకుండా శివారు ప్రాంతాల్లోని హబ్స్‌లోనే ఆపేసి, వస్తువులను అక్కడే నిల్వ చేస్తారు. చిన్న వాహనాల్లో నగరంలోకి తీసుకొస్తారు. ఇలా మహా నగరం నలువైపులా నయా హబ్స్ రానున్నాయి. మంగల్‌పల్లి, బాటసిం గారం ప్రాంతాల్లో లాజిస్టిక్ హబ్స్ పనుల్లో వేగిరం పెరగగా... పటాన్‌చెరులో భూమిని చదును చేసి పనులు చేస్తున్నారు. అలాగే మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌పై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు మియాపూర్‌లో ఇంటర్‌సిటీ బస్‌టెర్మినల్ (ఐసీబీటీ) పనులపై కూడా హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది.
ఈ నాలుగు అందుబాటులోకొస్తే నగ రంపై పడే సగం ట్రాఫిక్ తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఇవేకాక పెద్దఅం బర్‌పేటలో ఐసీబీటీ, శంషాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సాధ్యాసాధ్యాలపైనా దృష్టిసారిం చారు. శంషాబాద్, మనోహరాబాద్, పటాన్‌చెరు, శామీర్‌పేటలోనూ లాజిస్టిక్ హబ్‌లపై అధ్యయనం చేసి అందుకయ్యే వ్యయాన్ని అంచనా వేసే పనిలో హెచ్‌ఎండీఏ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్‌భాగస్వామ్యంతో చేపడితే 200 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా.
ప్రయోజనాలు ఇవి....
బాటసింగారం, మంగల్‌పల్లిల్లోని లాజిస్టిక్ హబ్‌ల్లో అన్ని రకాల వస్తువులను నిల్వ చేయొచ్చు. పెద్దెత్తున సరుకులు తీసుకొచ్చిన భారీ వాహనాలు ఇక్కడే ఆగిపోతాయి. అక్కడి నుంచి నగర వ్యాపారులకు కావల్సినప్పుడు చిన్న వాహనాల్లో తీసుకెళ్లవచ్చు. తద్వారా కొంత వరకు రవాణా చార్జీలు తగ్గి సరుకుల ధరలూ తగ్గుతాయి. మినీ ట్రక్కులు, ఆటోలు, చిన్న వాహనాలకు గిరాకీ పెరుగుతుంది. భారీ వాహనాలు రాక ఆగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు తప్పుతాయి.
ఐసీబీటీ ప్రత్యేకతలు ఇవి...
- మంగల్‌పల్లి, బాటసింగారంలో ఒకేసారి 500 ట్రక్కులు పార్క్ చేయవచ్చు.
- 2 లక్షల చ.అ. గోదాములు, 10 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్.
- ఆటోమొబైల్ సర్వీస్‌కేంద్రం, పరికరాల నిల్వకు 10 వేల టన్నుల సామర్థ్యంతో గోదాములు.
- 100 మంది ఉండటానికి వీలుగా డార్మిటరీ, 5 వేల చ.అ. విస్తీర్ణంలో రెస్టారెంట్, 2,500 చ.అ.ల్లో పరిపాలన కార్యాలయం.
2011లోనే ఆలోచన...
ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వస్తున్న వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో ఎంజీ బీ ఎస్‌పై రద్దీ పెరిగింది. దీన్ని నియంత్రిం చేందుకు మియాపూర్‌లో భారీ బస్టాండ్‌ను నిర్మిం చాలని 2011లో అప్పటి ప్రభుత్వం ఆలోచించిం ది. రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఐసీబీటీకి వచ్చివెళ్లే ప్రజలు నగరంలోకి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు మెట్రో సర్వీసులు కూడా ఉండేలా చూసుకున్నారు.
మంగల్‌పల్లి(లాజిస్టిక్ హబ్)
ప్రాంతం: నాగార్జునసాగర్ హైవేపై ఓఆర్‌ఆర్ బొంగళూరు జంక్షన్ నుంచి 500 మీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్‌పల్లి. విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం, విస్తీర్ణం: 22 ఎకరాలు,
వ్యయం: రూ.20 కోట్లు, ప్రారంభం: 2017, ప్రస్తుత స్థితి: 40 శాతం పూర్తి మరో మూడు నెలలు పట్టే అవకాశం
బాటసింగారం(లాజిస్టిక్ హబ్) ప్రాంతం: విజయవాడ హైవేపై ఓఆర్‌ఆర్‌కి 7కి.మీ. దూరంలోని హయత్‌నగర్ మండలం బాటసింగారం.
విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం
విస్తీర్ణం:40 ఎకరాలు
వ్యయం:రూ.35 కోట్లు
ప్రారంభం:2017
ప్రస్తుత స్థితి:70 శాతం పూర్తి
కమర్షియల్ ఆపరేషన్‌కు గ్రీన్‌సిగ్నల్
పటాన్‌చెరు(లాజిస్టిక్ హబ్)
విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం, విస్తీర్ణం: 17 ఎకరాలు
ప్రస్తుత స్థితి: 5 ఎకరాల్లో పార్కింగ్ పనులు పూర్తి, చేసిన ఖర్చు: రూ.5 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment