టోల్ ప్లాజాల వద్ద నెలకొనే రద్దీని లైవ్‌గా ట్రాక్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా దేశంలోని సుమారు 100 టోల్ ప్లాజాలను గుర్తించింది. జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఆయా టోల్ గేట్ల వద్ద నెలకొనే ట్రాఫిక్‌ను ట్రాక్ చేస్తూ అందుకు అనువుగా హెచ్చరికలు, సలహాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
సెలవులు, వారాంతాలు, పండగలు..వంటి ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలుస్తుండడం గమనిస్తాం. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలుస్తుంటాయి. టోల్ గేట్ల నిర్వహణ సరళీకృతం చేయడంలో భాగంగా కేంద్రం ఫాస్టాక్ వంటి విధానాలు తీసుకొచ్చింది. అయినా చాలాచోట్ల వాహనాల రద్దీ తగ్గడంలేదు. అలాంటి సమయాల్లో వారికి సరైన మార్గదర్శకాలు, సలహాలు, సూచనలులేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితులను అదుపు చేయడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) టోల్ ప్లాజాలను లైవ్‌గా ట్రాక్ చేయాలని నిర్ణయించింది. అందుకోసం టోల్‌గేట్ టోల్ ఫ్రీ నంబర్ 1033కు వచ్చిన ఫిర్యాదుల ఆదారంగా దేశవ్యాప్తంగా దాదాపు 100 టోల్‌ప్లాజాలను ఎంచుకుంది.
ఇదీ చదవండి: ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!
ప్రత్యేకంగా జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఈ టోల్‌గేట్లను ట్రాక్ చేయనున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాల క్యూ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరికలు, సూచనలు అందించనున్నారు. దాంతోపాటు ట్రాఫిక్‌కు అనుగుణంగా సిబ్బందికి లేన్‌ల పంపిణీపై సలహాలు ఇస్తారు. ఈ జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలోని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌ఎంసీఎల్) అభివృద్ధి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment