ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు | Heavy Crowd At Praja Bhavan | Sakshi
Sakshi News home page

ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు

Published Sat, Dec 16 2023 8:17 AM | Last Updated on Sat, Dec 16 2023 1:53 PM

Heavy Crowd At Praja Bhavan - Sakshi

హైదరాబాద్: సమస్యలను ఏకరువు పెట్టుకునేందుకు నగరంలోని ప్రజా భవన్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి అర్జీదారులు బారులు తీరుతున్నారు. శుక్రవారం ప్రజావాణిలో దరఖాస్తులనుసమర్పించేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావడంతో ప్రజాభవన్‌ సమీపంలోని రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.

కొందరు క్యూలైన్‌లోనే అల్పాహారం తీసుకున్నారు. సందట్లో సడేమియా వలే ఇక్కడ దరఖాస్తులను రాసేందుకు కొందరు తెల్ల కాగితాలను సైతం విక్రయించారు. మొత్తానికి శుక్రవారం గ్రీన్‌హిల్స్‌లోని ప్రజాభవన్‌ వేలాది మంది అర్జీదారులతో కిటకిటలాడుతూ కనిపించింది.           

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement