
సాక్షి, హైదరాబాద్: నిధులు లేక జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. వర్షాలు, ట్రాఫిక్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ మారువేషంలో పర్యటిస్తే, జనం ఇబ్బందులు తెలుస్తాయన్నారు. జీహెచ్‌ఎంసీ నిధులు మిషన్ భగీరథకు మళ్లించడం వల్లే జీహెచ్‌ఎంసీ ఏమీ చేయలేకపోతోందని పేర్కొన్నారు. వర్షాల సమయంలో జనం కష్టాలను తీర్చేందుకు ప్రత్యేకంగా రెయిన్ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment