
సాక్షి, చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఎక్కడా ఆపకుండా ఆయన వాహనాలు పయనించే రీతిలో చర్యలు తీసుకున్నారు. ఆయన కాన్వాయ్‌లో పదికి పైగా వాహనాలు ఉంటాయి. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాహితాన్ని కాంక్షించే విధంగా స్టాలిన్ పయనం సాగుతోంది.
నగరాల్లో ట్రాఫిక్ రద్దీని గుర్తించిన స్టాలిన్ తన కాన్వాయ్ వాహనాల సంఖ్య సగానికి సగం తగ్గించేశారు. ఇక ఆయన పయనించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలపరు. ప్రజల వాహనాలతో కలిసి ఆయన కాన్వాయ్ సాగే విధంగా ఆదివారం నుంచి చర్యలు తీసుకోనున్నారు.
చదవండి: (ఖుష్బూకు ‘ప్రత్యేక’ పదవి)
దివ్యాంగులకు సాయం
సచివాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు దివ్యాంగులకు సీఎం వీల్‌చైర్‌లు, స్కూటర్లను పంపిణీ చేశారు. అదేవిధంగా స్కూటర్ల మరమ్మతుల నిమిత్తం రూ. 1,500 సాయంకు శ్రీకారం చుట్టారు. అలాగే, దివ్యాంగుల రిజర్వేషన్ కింద ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న వారికి నియామక ఉత్తర్వులను అందజేశారు.