రోడ్డుపై భారీగా చేరిన వర్షపు నీరు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఢిల్లీతో పాటు నోయిడాలోని ప్రధాన రహదారులపై నిలిచిన వర్షపు నీటితో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వర్షాల కారణంగా ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వర‍్షపు నీరు ఎక్కువగా నిలిచిపోవటం వల్ల ఘాజీపూర్ ముర్గా మండీ, ఖజిర్ చౌక్, మోదీ మిల్ ఫ్లైఓవర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించి పోయిందని అధికారులు తెలిపారు. నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Comments
Please login to add a commentAdd a comment