Paradise
-
ప్రాజెక్టులు పరుగులు పెట్టేనా!
గ్లోబల్ సిటీ వైపు అడుగులు వేస్తూ.. ప్రగతి పథాన దూసుకెళుతోంది మన మహా నగరం. ఎలివేటెడ్ కారిడార్లు, ఫోర్త్‌సిటీ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణాలు, మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో రెండో దశకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం పెద్ద మొత్తంలో నిధులు అవసరం. అలాగే మూసీకి పునరుజ్జీవం కల్పంచాలనే సంకల్పంతో ఉంది. నది సుందరీకరణకు నడుం బిగించింది. ఈసారి రాష్ట్ర బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని జలమండలి సైతం ఆశిస్తోంది. వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ.5,500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమరి్పంచింది. ఇలా వివిధ విభాగాలు నిధుల కేటాయింపులపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. బుధవారం శాసన సభలో డిప్యూటీ సీఎం, విత్త మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో భాగ్యనగరానికి ఎంతమేరకు ప్రాధాన్యం దక్కుతుందో చూడాలి మరి. హైదరాబాద్ మహా నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాల మేరకు గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ప్రారంత్సవాలు పూర్తి చేసుకున్న ప్రాజెక్టులకు నిధుల కొరతే ప్రధాన సమస్యగా మారింది. నగరానికి ఉత్తరం వైపు రెండు ఎలివేటెడ్ కారిడార్లతో పాటు, ఫోర్త్‌సిటీ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ టెండర్ నోటీసులను వెల్లడించింది. మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో రెండో దశకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. కేంద్రం ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు సావరిన్ గ్యారెంటీ లభిస్తే ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో ఆయా ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు లభిస్తాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎలివేటెడ్ కారిడార్లు.. ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు 5.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌కు బేగంపేట్ విమానాశ్రయం వద్ద 600 మీటర్ల సొరంగ మార్గానికి ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతి లభించడంతో నిర్మాణ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.652 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. భూసేకరణకయ్యే ఖర్చులతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,450 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట వరకు 18.1 కిలో మీటర్ల రెండో ఎలివేటెడ్ కారిడార్‌కు సుమారు 197 ఎకరాల భూమి సేకరణకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఇందులో 113.48 ఎకరాలు రక్షణశాఖ నుంచి సేకరించాల్సి ఉంది. మరో 83.72 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాలి. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,232 కోట్లు కానున్నట్లు అంచనా. ఈ మార్గంలో క్షేత్రస్థాయి సర్వేతో పాటు అన్ని పనులు పూర్తయ్యాయి. రక్షణశాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే నిర్మాణం చేపట్టేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగా ఉంది. కానీ.. నిధుల కొరతే ప్రధాన సమస్య. రతన్‌టాటా గ్రీర్ఫీల్డ్ రోడ్డు.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు ‘రతన్‌టాటా రోడ్డు’గా నామకరణం చేసింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ ఔటర్‌రింగ్ రోడ్డులోని టాటా ఇంటర్చేంజ్ (రావిర్యాల) నుంచి ఆమన్‌గల్ రీజినల్ రింగ్ రోడ్డు వరకు 41.50 కిలోమీటర్ల రేడియల్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును రెండు దశలుగా నిర్మించనున్నారు. మొదటి దశలో రావిర్యాల నుంచి (టాటా ఇంటర్చేంజ్) నుంచి మీర్ఖాన్పేట్ వరకు 19.2 కిలో మీటర్లు పూర్తి చేస్తారు. ఇందుకోసం రూ.1,665 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. రెండోదశలో మీర్ఖాన్పేట్ నుంచి ట్రిపుల్ ఆర్ వద్ద అమన్‌గల్ వరకు రూ.2,365 కోట్లతో 22.3 కిలోమీటర్లు నిర్మించనున్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లోని 14 గ్రామాలకు ఈ రోడ్డుతో కనెక్టివిటీ సదుపాయం ఏర్పడనుంది. ఈ ప్రాజెక్టు కోసం హెచ్ఎండీఏ టెండర్లను కూడా ఆహ్వానించింది. మెట్రో రెండో దశ.. మెట్రోరెండో దశలో రెండు భాగాలుగా విస్తరణకు ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టులను రూపొందించింది. మొదటిభాగంగా 5 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి సుమారు రూ.24 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు మియాపూర్ నుంచి పటాన్చెరు. రాయదుర్గం నుంచి కోకాపేట్, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు విస్తరించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణతో పాటు అటు హైకోర్టు వరకు మరో లైన్ చేపట్టాల్సి ఉంది. మొత్తం 76.4 కిలోమీటర్ల మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రస్తుతం కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తోంది. దీంతో పాటు రెండో భాగంగా జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్లు చేపట్టనున్నారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్కిల్ వర్సిటీ వరకు ఈ కారిడార్ నిర్మాణం కోసం సుమారు రూ.6 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఫోర్త్‌సిటీతో పాటు నార్త్‌సిటీలో రెండు కారిడార్లకు సైతం డీపీఆర్‌లను రూపొందించేందుకు హెచ్ఏఎంఎల్ కసరత్తు చేపట్టింది. రెండో దశలో మొదట ప్రతిపాదించిన 5 కారిడార్లు కలిపి 76.4 కిలోమీటర్లు కాగా, ఫోర్త్‌సిటీతో రెండో దశ 116.4 కిలోమీటర్లకు పెరగనుంది. అలాగే నార్త్‌సిటీ రెండు కారిడార్లతో కలిపి మొత్తం రెండో దశ ప్రాజెక్టు 161.4 కిలోమీటర్లకు చేరనుంది. దీంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టును చేపట్టాలనేది ప్రతిపాదన.మూసీ మెరిసేనా? మూసీ నదికి పునరుజ్జీ కల్పించాలన్న ముఖ్యమంత్రి కల బడ్జెట్ కేటాయింపులతో తీరనుంది. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌పై మూసీ రిఫర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) కోటి ఆశలు పెట్టకుంది. తొలి దశలో ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.5 కి.మీ., అలాగే హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 8.5 కి.మీ. రెండు వైపులా 21 కి.మీ. మేర మూసీ నదీ సుందరీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయా అభివృద్ధి పనులకు తాజా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూసీ శుద్ధి, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ, సుందరీకరణ, బృహత్ ప్రణాళిక రూపకల్పనలపై ఎంఆర్డీసీఎల్ అధికారులు దృష్టి సారించారు. 2030 డిసెంబర్ 30 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్లన్నసాగర్ నుంచి మూసీకి 5 టీఎంసీల నీటిని తరలించి, నదిని శుద్ధి చేయడంతో పాటు మూసీ చుట్టూ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. అలాగే మూసీపై 11 వారసత్వ వంతెనలను నిర్మించనున్నారు. నది బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటు అమ్యూజ్మెంట్పార్క్, వాటర్ ఫాల్స్, చి్రల్డన్ వాటర్ స్పోర్ట్స్, వీధి వర్తకుల వ్యాపార సముదాయాలు, సైకిల్ ట్రాక్‌లు, గ్రీన్ స్పేస్‌లు, వంతెనలు, వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు, క్రీడా సౌకర్యాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలను అభివృద్ధి చేయనున్నారు.జలమండలికి ‘నిధుల’ వరద పారేనా! ఈసారి రాష్ట్ర బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని జలమండలి ఆశిస్తోంది. వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ.5,500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచింది. గోదావరి రెండు, మూడో దశ పనులు, ఓటర్ రింగ్ రోడ్ తాగునీటి సరఫరా పథకం–3, ఎస్టీపీ, రుణాల చెల్లింపు, ఉచిత నీరు, విద్యుత్ రాయితీ కింద నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్లో దాదాపు రూ.5,650 కోట్లతో ప్రతిపాదనలు చేయగా ప్రభుత్వం రూ.3,385 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం పెరిగిన అవసరాల దృష్ట్యా రూ.4 వేల కోట్లకు పైగా నిధుల కేటాయింపులు ఉండవచ్చని జలమండలి ఆశలు పెట్టుకుంది. మహా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం గోదావరి ఫేజ్–2, 3 నిర్మాణ పనుల మొత్తం వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం, నిర్మాణ సంస్థ వాటా 60 శాతం భరించాల్సి ఉంది. రాష్ట్ర వాటా కింద అవసరమైన నిధుల కేటాయింపునకు ప్రతిపాదనలు సమర్పించింది. ఓటర్ రింగ్‌రోడ్ తాగునీటి సరఫరా పథకం–3, సుంకిశాల పనులు చేపట్టేందుకు నిధులు అవసరమని భావిస్తోంది. వంద శాతం మురుగు శుద్ధి లక్ష్యంగా కొత్త ఎస్టీపీ ప్రాజెక్టుల మిగిలిన పనుల కోసం, ఉచిత నీటి సరఫరా నిధుపై జల మండలి ఆశలు పెట్టుకుంది. -
Hyderabad: ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు సొరంగ మార్గం..
సాక్షి, హైదరాబాద్: ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు(Elevated corridor) ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(Airport Authority of India) నుంచి తాజాగా అనుమతి లభించనుంది. ప్యారడైజ్(Paradise) నుంచి డెయిరీఫామ్(Dairy farm) వరకు 5.4 కిలోమీటర్ల కారిడార్ మార్గంలో బేగంపేట్ విమానాశ్రయం(Begumpet Airport) వద్ద సుమారు 600 మీటర్ల పొడవుతో సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. విమానాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఎలివేటెడ్‌కు ప్రత్యామ్నాయంగా సొరంగ మార్గం నిర్మించాల్సి ఉంటుందని హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఎయిర్పోర్ట్ అథారిటి నుంచి అనుమతి లభించడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభించనుంది. డెయిరీఫామ్ ఎలివేటెడ్ ప్రత్యేకతలు.. ప్యారడైజ్ నుంచి సికింద్రాబాద్, తాడ్‌బండ్, బోయిన్పల్లి మీదుగా డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం రూ.652 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. భూసేకరణ కోసం అయ్యే ఖర్చులతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,550 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు వల్ల నగరానికి ఉత్తరం వైపు వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. ప్రస్తుతం సుచిత్ర నుంచి మేడ్చల్ రూట్లో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. డెయిరీఫామ్ ఎలివేటెడ్ అందుబాటులోకి వస్తే జంక్షన్ రహితమైన, సిగ్నల్ర హితమైన, నిరాటంకమైన వాహనాల రాకపోకలు అందుబాటులోకి వస్తాయి. ⇒ ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు మొత్తం 5.4 కిలోమీటర్ల కారిడార్‌లో 3.05 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ⇒ బేగంపేట్ ఎయిర్‌పోర్టు వద్ద 600 మీటర్ల అండర్‌గ్రౌండ్ టన్నెల్‌ను నిర్మిస్తారు. ⇒ మొత్తం ఎలివేటెడ్ కారిడార్ 27 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో 25 మీటర్లు క్యారేజ్‌వే, 2 మీటర్లు మీడియన్ ఉంటుంది. రెండు వైపులా క్రాష్ బారియర్స్‌ను ఏర్పాటు చేస్తారు. ⇒ బోయిన్పల్లి జంక్షన్ వద్ద రెండు వైపులా 248 మీటర్ల నుంచి 475 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో ప్రవేశ, నిష్క్రమణ ర్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వాహనాలు 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ⇒ తాడ్‌బండ్ జంక్షన్ వద్ద మలుపులతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో 600 మీటర్ల టన్నెల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు. జియోమెట్రిక్ ప్రత్యేకతలతో టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ టన్నెల్ వల్ల వాహనాల రద్దీకి శాశ్వత పరిష్కారం లభించనుంది. 44వ జాతీయ రహదారి మార్గంలోనే కాకుండా కారిడార్‌కు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో కూడా వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. శామీర్‌పేట్ కారిడార్ ఇలా.. సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ ఔటర్‌రింగ్ రోడ్డు వరకు సుమారు 18.10 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సైతం హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. తిరుమలగిరి, అల్వాల్ మార్గంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం సుమారు 197 ఎకరాల భూమి సేకరణకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,232 కోట్లు అవుతుందని అంచనా. ఈ రూట్లో రక్షణ శాఖ నుంచి, హకీంపేట్ వద్ద ఎయిర్‌ఫోర్స్ నుంచి అనుమతి లభించాల్సి ఉందని పేర్కొన్నారు. శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌లో ఎయిర్‌ఫోర్స్ అనుమతి కీలకం కానుంది. ఈ అనుమతులు లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. Telangana: రాష్ట్ర బడ్జెట్ రూ. 3.20లక్షల కోట్లు? -
సినిమాకి ఆ టైటిలే పెట్టొచ్చుగా నాని
-
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న నాని పారడైస్ గ్లిమ్స్
-
సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న ది ప్యారడైజ్
-
నాని 'ప్యారడైజ్' గ్లింప్స్.. ఇది కాకుల కథ
'దసరా' నుంచి రూట్ మార్చిన నాని.. మాస్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'హిట్ 3' చేస్తున్నాడు. రీసెంట్ గా నాని పుట్టినరోజు టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలతో తీస్తున్న 'ప్యారడైజ్' గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ వీడియో ప్రారంభంలోనే బూతులు కూడా ఉంటాయనే వార్నింగ్ ఇచ్చారు. 'ప్యారడైజ్' ప్రపంచం ఎలా ఉండబోతుందనే చూపించేశారు. వీడియో మొత్తంలో ఆ కాకుల రిఫరెన్సులు గట్టిగాన ఉన్నాయి.(ఇదీ చదవండి: ఆస్కార్ ఉత్తమ చిత్రం ఓ బోల్డ్ మూవీ.. ఏంటి 'అనోరా' స్పెషల్?)ఇది కడుపు మండిన కాకుల కథ.. జమానా జమానా కెల్లి నడిచే శవాల కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పెంచి పోసిన ఓ జాతి కథ అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంది. నాని ఫేస్ చూపించలేదు గానీ పిలకలు వేసుకుని, మెడలో చైన్లతో చేతిలో గన్స్ తో చాలా వైవిధ్యంగా ఉన్నాడు.ఇందులో నాని తల్లిపాత్రలో సోనాలి కులకర్ణి అనే సీనియర్ నటి కనిపించబోతుంది. ఒకప్పటి సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇది. గ్లింప్స్ చూస్తుంటే బహుశా ఇందులో హీరోయిన్ పాత్ర ఉండకపోవచ్చనిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్ గానే ఉంది. 2026 మార్చి 26న మూవీ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
HYD: ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్..!
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఊరట కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. ప్యారడైజ్ జంక్షన్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం భూ సేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ కారిడార్ల భూ సేకరణను ప్రభుత్వం ప్రారంభించనుంది. భూ సేకరణ విషయమై డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, సర్వేయర్లతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం(నవంబర్ 19) సమావేశమయ్యారు. కాగా, ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం కంటోన్మెంట్ భూములు అవసరమయ్యాయి.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములివ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం భూములిచ్చేందుకు అంగీకరించడంతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. -
నాని కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా
-
అప్పుడు 'దసరా'.. ఇప్పుడు 'ది ప్యారడైజ్'
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించి, టైటిల్ లోగోను ‘ఎక్స్’లో షేర్ చేశారు నాని. పీరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని, ఇందులో సికింద్రాబాద్ కుర్రాడిగా నాని నటిస్తారని టాక్. హీరోయిన్ గా జాన్వీకపూర్ లేదా శ్రద్ధాకపూర్ నటిస్తారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు నాని ‘హిట్ 3’ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్ లో జరుగుతోంది. 2025 మే 1న ‘హిట్ 3’ రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
మెట్రో రెండో దశ.. నార్త్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టు నార్త్ హైదరాబాద్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. సికింద్రాబాద్, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ మీదుగా ఔటర్‌రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. కానీ.. ఇటీవల హైదరాబాద్ మెట్రోరైల్ ప్రకటించిన రెండో దశ డీపీఆర్‌లో ఉత్తరం వైపు మెట్రో ప్రస్తావన లేకపోవడం పట్ల తాజాగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.గత ప్రభుత్వ హయాంలో నగరానికి నలువైపులా మెట్రో సేవలను విస్తరించేలా 278 కిలోమీటర్ల మేర ప్రణాళికలను రూపొందించగా.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్లకే పరిమితం చేసింది. ఎయిర్‌పోర్టుతో పాటు కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీకి సైతం మెట్రో విస్తరించనున్నట్లు పేర్కొంది. గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ రెండో దశలో నార్త్‌సిటీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. డబుల్ డెక్కర్ మెట్రో ఎక్కడ? జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ఇదే మార్గంలో మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమధ్య ప్రకటించినా ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఈ రూట్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఎలాంటి నిధులను కేటాయించలేదు. భూసేకరణ దశకే ఈ ప్రాజెక్టు పరిమితమైంది.ప్యారడైజ్ జంక్షన్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీఫాం రోడ్డు వరకు ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఈ రూట్లో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నగరవాసులు సిటీ బస్సులపై ఆధారపడి ప్రయాణం చేయాల్సివస్తోంది. పలుచోట్ల రహదారులు ఇరుకుగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు రూ.1,580 కోట్ల అంచనాలలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి, అదే రూట్లో డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదించారు. కానీ ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆవిర్భావం.. నార్త్ సిటీకి మెట్రో నిర్మాణం చేపట్టాలనే డిమాండ్‌తో ఆవిర్భవించిన మేడ్చల్ మెట్రోసాధన సమితి ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ నేతృత్వంలో మేడ్చల్ సాధన సమితి ఆవిర్భవించింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి తూంకుంట వరకు 17 కిలోమీటర్ల మార్గంలో డబుల్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్, మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని, , ప్యారడైజ్ నుంచి కండక్లకోయ వరకు 12 కి.మీ మార్గంలో, ఓఆర్ఆర్ మేడ్చల్ ఇంటర్‌ఛేంజ్‌కు రాకపోకలు సాగించేలా మెట్రో సదుపాయం కల్పించాలని ఈ సంఘం డిమాండ్ చేస్తోంది. చదవండి: హైడ్రా.. రిజిస్ట్రేషన్లు విత్డ్రాఅలాగే గతంలో ప్రతిపాదించినట్లుగా ఉప్పల్‌క్రాస్‌రోడ్ నుంచి ఘట్కేసర్ ఓఆర్ఆర్– బీబీనగర్ వరకు 25 కిలోమీటర్లు, తార్నాకా ఎక్స్‌రోడ్– ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రో చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మరోవైపు ప్రతిరోజూ లక్షలాది మంది రాకపోకలు సాగించే సూరారం, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు మెట్రో విస్తరణ చేపట్టాలని, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లోని భరత్‌నగర్ నుంచి మూసాపేట్ మీదుగా సూరారం, కుత్బుల్లాపూర్ వరకు మెట్రో విస్తరించాలని ఆ ప్రాంతాల్లోని వివిధ కాలనీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. -
HYD: ‘ప్యారడైజ్’ హోటల్లో మంటలు
సాక్షి,హైదరాబాద్: బిర్యానీకి పాపులర్ అయిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్యారడైజ్ హోటల్లో శుక్రవారం(ఆగస్టు23) మంటలు కలకలకం రేపాయి. హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగాయి.వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కొద్ది సేపటికే మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఘటన అనంతరం హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారులు హోటల్‌కు వచ్చి ప్రమాదం ఎలా జరిగిందనేదానిని పరిశీలించారు. -
OTT: మలయాళ మూవీ ‘పేరడైజ్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘పేరడైజ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రముఖ దర్శకులు మణిరత్నం సమర్పించిన సినిమా ‘పేరడైజ్’. శ్రీలంక, ఇండియా రచయితలు కలిసి రాసిన కథతో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమాకు ప్రసన్న దర్శకుడు. రోషన్ మాథ్యూ, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ‘పేరడైజ్’ పూర్తిగా శ్రీలంకలో తీసిన సినిమా. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... ఓ జంట తమ ఐదో వివాహ మహోత్సవాన్ని జరుపుకోవడానికి శ్రీలంకలోని ఓ సుదూర గెస్ట్ హౌస్‌కు వెళుతుంది. ఆ గెస్ట్ హౌస్ కొండల మధ్యలో చాలా మారుమూల ప్రాంతంలో ఉంటుంది. దానికి దరిదాపులో ఓ చిన్న గ్రామం ఉంటుంది. వీళ్ళు వెళ్ళేటప్పటికీ శ్రీలంక దేశం మొత్తం ఉద్యమంతో ఉద్రిక్తత నెలకొని ఉంటుంది. ఈ జంట నివసిస్తున్న గెస్ట్ హౌస్‌లో ఓ రాత్రి దొంగతనం జరిగి వారి వస్తువులన్నీ దొంగలు ఎత్తుకెళ్తారు. ఆ దొంగలను పట్టుకునే క్రమంలో వీరు ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్నదే కథ. ఈ సినిమా మొత్తంలో స్క్రీన్‌ప్లే కొంత ల్యాగ్ అపించినా ఆఖరి ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించనిది. అలాగే సినిమా మొత్తంలో సీతమ్మ, హనుమంతులు తిరిగిన ప్రదేశాలు చూపించడం, వాటి వివరణ ఇవ్వడం బావుంది. సినిమా మొత్తం చాలావరకు గ్రీనరీ చూడవచ్చు. ఎందుకంటే లంక అనేది రావణుని పేరడైజ్ కాబట్టి. మరి... మీరు కూడా ఈ ‘పేరడైజ్’ని ప్రైమ్ వీడియోలో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ)
ప్రైవసీ కోసమో, అడ్వెంచర్ చేయాలనో.. ప్రశాంతంగా ఉండే ప్రదేశాలకు ఒంటరిగా లేదంటే జంటగా వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఆహ్లాదం వెనుకే కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు, అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఓ కథతో తీసిన మలయాళ సినిమానే 'ప్యారడైజ్'. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం!కథేంటి?అది 2022 జూన్. దేశం దివాళా తీయడంతో శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇదే టైంలో ఇండియా నుంచి కేశవ్ (రోషన్ మాథ్యూస్), అమృత (దర్శన రాజేంద్రన్) అనే జంట శ్రీలంకకి విహారయాత్రకి వస్తారు. ప్రైవసీ కోసం ఓ మారుమూల పల్లెటూరిలోని కాటేజీలో దిగుతారు. ఓ రోజు దుండగులు వీళ్ల గదిలోకి వచ్చిన ల్యాప్ ట్యాప్, ఫోన్స్ ఎత్తుకెళ్లిపోతారు. దీంతో కేశవ్-అమృత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?'ప్యారడైజ్' అంటే స్వర్గం అని అర్థం. శ్రీలంకని చాలామంది భూతల స్వర్గం అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడి లొకేషన్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాల్ని చూసేందుకు విదేశీ టూరిస్టులు చాలామంది వస్తూనే ఉంటారు. అలా శ్రీలంకలో 2022లో అల్లరు జరుగుతున్న టైంలో అక్కడికి వెళ్లిన భారతీయ జంట ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొంది అనే కాన్సెప్ట్‌తో తీసిన థ్రిల్లర్ డ్రామా మూవీ 'ప్యారడైజ్'.చాలామంది ప్రైవసీ కోసమో లేదంటే అడ్వంచర్ చేద్దామనో శ్రీలంక లాంటి చోట్లకు వెళ్తుంటారు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు దొంగతనం, ఇంకేదైనా జరగొచ్చేమో అనే ఓ భయం ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది. అలానే శ్రీలంకలో టూరిస్టులని అటు జనాలు కావొచ్చు, ఇటు పోలీసులు కావొచ్చు ఎంతలా గౌరవిస్తారనేది కూడా చాలా చక్కగా చూపించారు. సినిమాలో శ్రీలంక అందాల్ని చాలా బ్యూటీఫుల్ గా క్యాప్చర్ చేశారు.ఓ వైపు నెక్స్ట్ ఏం జరుగుతుందోనని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ థ్రిల్లర్, డ్రామా చూపిస్తూనే మరోవైపు రాముడు, రావణుడు, సీతతో పాటు రామాయణానికి సంబంధించిన కొన్ని సీన్స్ బాగుంటాయి. స్టోరీ పరంగా సింపుల్ లైన్ అయినప్పటికీ.. కొన్ని సీన్లు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లీడ్ రోల్స్ చేసిన రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్ చాలా నేచురల్‌గా యాక్ట్ చేశారు. మిగిలిన వాళ్లందరూ లోకల్ యాక్టర్స్. ఉన్నవి కొన్ని పాత్రలే అయినా సరే జీవించేశారు.కేవలం గంటన్నర నిడివి మాత్రమే ఉన్న ఈ సినిమా.. ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. అలానే లోన్లీగా ఉండే ప్రదేశాలకు వెళ్దామనుకునేవాళ్లు ఈ సినిమా చూస్తే మాత్రం కొంపదీసి సినిమాలో చూపించినట్లు జరిగితే అంతే ఇక అని భయపడేలా చేస్తుంది. రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకుంటే దీన్ని చూడండి.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్<br>Powered by <a href="https://youtubeembedcode.com">how to embed a youtube video</a> and <a href="https://howtostopgamstop.com/">how to get around gamstop</a> -
Welcome to Paradise: స్వాగతం.. సుస్వాగతం
రచయిత్రిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది నటి ట్వింకిల్ ఖన్నా.‘మిసెస్ ఫన్నీబోన్స్: ‘పైజామాస్ ఆర్ ఫర్ గివింగ్’ ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్’ పుస్తకాలతో పాఠకులను అలరించింది. తాజాగా తన కొత్త పుస్తకం ‘వెల్కమ్ టూ ప్యారడైజ్’ను ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ట్వింకిల్ ఖన్నా లండన్‌లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత వస్తున్న పుస్తకం ఇది. ‘ఈ పుస్తకంలోని క్యారెక్టర్లు గత అయిదు సంవత్సరాలుగా నా మనసులో తిరుగుతున్నాయి. నాకు మాత్రమే పరిచయమైన ఈ క్యారెక్టర్లు ఇప్పుడు మీకు కూడా పరిచయం కాబోతున్నాయి’ అంటూ రాసింది ఖన్నా. మానవ సంబంధాలు, ఎడబాట్లు, అనుబంధాలు, ఆప్యాయతలను ఆధారంగా చేసుకొని రాసిన ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. సామాన్య పాఠకుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో ఈ పుస్తకంపై కామెంట్స్ పెడుతున్నారు. -
సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు జరిమానా
సాక్షి, రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు జీహెచ్ఎంసీ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. బిర్యానీకి జాతీయ స్థాయిలో పేరున్న ఈ హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన కూరగాయలు కనిపించడంతో అధికారులు ఈ జరిమానా విదించారు. గురువారం హోటల్‌కు వచ్చిన ఓ వినియోగదారులు బిర్యానీలో వెంట్రుకలు కనిపించడంతో సిబ్బందిని నిలదీశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్, వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డిలు హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. హోటల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీబాగులు కనిపించాయి. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు వినియోగిస్తుండటం కిచన్లో అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. దీంతో అధికారులు హోటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు జారీ చేసి లక్ష రూపాయల జరిమానా విధించారు. మరోమారు ఇలాగే ఉంటే హోటల్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్యారడైజ్ హోటల్లో తనిఖీలు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు జమ్జమ్ బేకరీకిరూ.15వేల జరిమానా ప్యారడైజ్ సర్కిల్లో ఉండే జంజం బేకరీకి రూ.15వేల జరిమానా విదించారు. ఈ బేకరిలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతుండటం, కిచన్లో అపరిశుభ్రత కనిపించడంతో నోటీసులు జారీ చేసి జరిమానా విధించారు. జమ్జమ్ బేకరికి జరిమానా విధిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు -
కార్చిచ్చు మృతులు 59
ప్యారడైజ్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పే ప్రయత్నాలు ఏడో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. కార్చిచ్చు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య మొత్తంగా 59కి పెరిగింది. 130 మంది ఆచూకీ లేకుండా పోవడంతో వారి జాడను కనుగొనేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. ప్యారడైస్ పట్టణంలోని బుటె కౌంటీలో అత్యధిక మంది తప్పిపోయినట్లు సమాచారం. సియార్రా నెవడా పర్వతాల దిగువన 26 వేల మంది జనాభా నివసించిన ప్యారడైజ్ పట్టణం కార్చిచ్చు ధాటికి పూర్తిగా దగ్ధమైపోవడం తెలిసిందే. ఈ పట్టణంలో ఎక్కువగా ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన వృద్ధులే నివసిస్తారు. -
ప్యారడైజ్‌లో ఛాయ్ తాగిన సచిన్
-
ప్యారడైజ్‌లో టిఫిన్ తిని, ఛాయ్ తాగిన సచిన్
హైదరాబాద్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శుక్రవారం నగరంలో సందడి చేశారు. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్లో ఆయన టిఫిన్ తిని, ఇరానీ ఛాయ్ తాగారు. ప్యారడైజ్ హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు సచిన్ ఇక్కడకు విచ్చేసినట్లు సమాచారం. కాగా సచిన్‌ను చూసేందుకు ప్యారడైజ్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు, సామాన్యులు బారులు తీరారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు, పోలీసులు కూడా తమ సెల్ ఫోన్లలో సచిన్‌ను ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. ఇక గతంలో రాహుల్ గాంధీ కూడా హైదరాబాదు నగర పర్యటనలో ప్యారడైజ్ బిర్యానీ రుచి చూశారు. అలాగే ఎంపీలు ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ తదితరులు ఈ బిర్యానీని రుచి చూసినవారే. -
హాయిగా..ఊపిరి పీల్చుకున్న సిటీ
సాక్షి, సిటీబ్యూరో : ట్రాఫిక్ ‘జాం’జాటం... ముక్కుపుటాలదిరిపోయే వాయు కాలుష్యం... ఊపిరాడని దుస్థితి... ఇది రొటీన్‌గా ఉండే సిటీ సీన్. కానీ వీటి నుంచి నగరవాసికి ఏడు రోజుల పాటు ఉపశమనం లభించింది. ఈ సంక్రాంతికి గ్రేటర్‌వాసులు అధికశాతం పల్లెబాట పట్టడంతో లక్షలాది వ్యక్తిగత వాహనాలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాయి. ఫలితంగా వాయు కాలుష్యం భారీగా తగ్గింది. ఈ నెల 9 నుంచి 15 వరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) బృందాలు అబిడ్స్, పంజగుట్ట, ప్యారడైజ్, చార్మినార్, జూపార్క్, కేబీఆర్పార్క్, బాలానగర్, జూబ్లీహిల్స్, జీడిమెట్ల, ఉప్పల్ ప్రాంతాల్లో వాయుకాలుష్య మోతాదును నమోదు చేశాయి. కాలుష్య కారకాలు సాధారణ రోజుల్లో కంటే ఈ తేదీల్లో కొన్ని చోట్ల సగానికి, మరికొన్ని చోట్ల భారీగా తగ్గినట్లు పీసీబీ తాజా రిపోర్టు వెల్లడించింది. ముఖ్యంగా ఊపిరాడనీయకుండా చేసే సూక్ష్మ ధూళికణాలు (ఆర్‌ఎస్‌పీఎం), స్థూల ధూళికణాలు (టీఎస్‌పీఎం), ముక్కుపుటాలను అదరగొట్టి, ఊపిరితిత్తులకు పొగబెట్టే సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్‌ఓటూ), నైట్రస్ ఆక్సైడ్ (ఎన్ఓఎక్స్)ల మోతాదులు సాధారణ రోజుల్లో నమోదయ్యే సగటు కంటే బాగా తగ్గడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రేటర్‌లోని 6111 కి.మీ.ల రహదారులపై నిత్యం 40 లక్షల వాహనాలు (అన్నిరకాలు) రాకపోకలు సాగిస్తాయి. ఈ సెలవుల్లో సింహభాగం వాహనాలు ఇంటికే పరిమితం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గింది. దీంతో ఇంధన వినియోగం తగ్గి కాలుష్య ఉద్గారాలు వెలువడటం తగ్గిందని పీసీబీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘గ్రేటర్’లో సాధారణ రోజుల్లో సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఇంధనాన్ని మండించడం (వినియోగం) పెరిగి భయంకరమైన పొగ వెలువడుతుందని వారు తెలిపారు. ఇందులో ఆర్‌ఎస్‌పీఎం, టీఎస్‌పీఎం, ఎస్‌ఓటూ, ఎన్ఓఎక్స్ వంటి ఉద్గారాలు అధిక మోతాదులో ఉంటాయన్నారు. కానీ పండగ సెలవుల్లో ఈ పరిస్థితి లేని కారణంగా వాయుకాలుష్యం తగ్గిందని విశ్లేషించారు. -
కొంత ఉంది; కొంత లేదు
ఆజన్మం ఒక్కరికైనా లేచి సీటు ఇవ్వకపోవడానికి తగిన కారణం కనబడలేదు. చాలా రోజుల తర్వాత మేడ్చల్ వెళ్లాను. తెలియడంలేదుగానీ నిజానికి రోజులు కాదు, వెళ్లక ఏళ్లయింది. ఒక్కడినే పోవడానికి తోచక, పిల్లాణ్ని తీసుకెళ్దామనుకున్నాను. చూడండి... నేను అచ్చు సంసారినైపోతున్నాను! ‘వెళ్దాం’ అని ఊల పెట్టేసరికి, చిన్నోడు ఏడుప్పాట ఎత్తుకున్నాడు; ఎక్కడ వాణ్ని తీసుకెళ్లనేమోననీ, వాడికి బదులుగా అన్నను తీసుకెళ్తానేమోననీ. అదింకా ఎక్కువ బాధ కదా! పెద్దపిల్లల్తో పోల్చితే చిన్నవాళ్లు కొంత విస్మరణకు గురవుతారనుకుంటాను; ప్రతి ‘ఫస్ట్ మూమెంట్’ పెద్దపిల్లలే ఇస్తుంటారు కాబట్టి. ఆ ‘గ్రౌండ్’ మీద చిన్నోడివైపు మొగ్గాను. ‘పిల్లికి (కూడా) జిన్పాయింట్ ఏద్దా’మనే రకం వాడు! వేసుకుని, జుట్టు కట్టుకుని తయారైయాడు. బస్టాపుకు నడుస్తుండగా- ‘నేను ఎనుకకు వోత’ అని ముందు నడిచాడు; ‘ఆటో పీక ఒత్తుత నానా... నానా, ఆటో పీక ఒత్తుత’ అన్నాడు. అన్ని ఆటో హారన్లు ఒత్తించలేం; డ్రైవర్ ముఖం కొంత ప్రసన్నంగా కనబడాలి! ప్యారడైజ్ వెళ్తుండగా- ‘చీతపులి’ గురించి చెప్పాడు; ‘నేనింత పెద్దగైనగదా’ అని తన మూరెడు కొలత చూపించాడు; ‘నాగాజున్కు జిన్ పాయింట్ ఉంటదా’ అనడిగాడు; ‘నేను చిన్నగున్నప్పుడు’ పోయిన జా(రుడు)బండ గురించి చెప్పాడు. వాడికీ నాస్టాల్జియా! ఆ పూట మాటలు ‘ఖాళీ’ అయ్యాక, కునికిపాట్లు పడసాగాడు. దాంతో భుజం మీద వేసుకున్నాను. ప్యారడైజ్‌లో మేడ్చల్వి వరుసగా ఆరు బస్సులు వెళ్లిపోయాయి. అన్నీ ఫుల్లు! ఆదివారం పూట అంత రద్దీని ఊహించలేదు. ఏడోది కూడా వదులుకోవడం ఇష్టంలేక, వచ్చిన ‘మెట్రో’ ఎక్కేశాను(ము). రద్దీగా లేదుగానీ సీటు లేదు. ‘‘మీక్ సీట్ దొర్కలేదా?’’ టికెట్‌కు వచ్చిన కండక్టర్ ఆశ్చర్యపోయాడు! చంటిపిల్లాడిని ఎత్తుకుని కూడా నిలబడేవున్నానని ఆయన ఉద్దేశం! నవ్వి ఊరుకున్నాను. కాసేపు రాడ్ పట్టుకున్నాను; కాసేపు వాణ్ని కుడి భుజం మీదికి మార్చుకున్నాను; కొద్దిగా కదిలితే వీపుమీద నెమ్మదిగా తట్టాను. బస్సు వెనకవైపున్నాం. అందరూ ఊరికే కూర్చున్నారు. లగేజీలేం లేవు. ఒక్కరికైనా లేచి సీటు ఇవ్వకపోవడానికి తగిన కారణం కనబడలేదు. వాళ్లకు వాళ్లే బరువుగావుంటే ఏం లేస్తారులే! నేను కూర్చునివుండి, ఇంకెవరైనా ఇలా బాబుతో ఉంటే- ‘లేస్తానా, లేవనా’ అని తర్కించుకున్నాను. మహా అయితే పాతిక కిలోమీటర్ల దూరం! లేచేవాణ్నే, అనిపించింది. ఇక్కడ దూరం కన్నా కూడా, ఒక కన్సెర్న్ కదా! నా చిన్నపాటి వ్యక్తిగత సౌఖ్యం సమాజంతో ముడిపడివుండటం బాధించింది. అంతకుముందటి ప్రయాణానందం చేదెక్కింది. అందరి ముఖాలు నాకు వికారంగా కనబడుతున్నాయి. వాళ్లు సెల్‌ఫోన్లల్లో మాట్లాడుతున్నది చెత్త! కిటికీల్లోంచి చూస్తున్నది పేలవమైన ప్రపంచం! జీడిమెట్ల దగ్గర ఒకాయన సీటు ఆఫర్ చేశాడు(‘‘ఫర్లేద్సర్.’’). చిత్రంగా ఆయన ‘ప్రేమ’ కూడా నాకు రుచించలేదు. ‘దగ్గర్లోనే దిగుతా’నని లేచాడు. కూర్చున్నాక- ఎవరివైపూ తేరిపారగా చూడటం ఇష్టం లేకపోయింది. ఆ బస్సే సుఖంగా లేదు. కొంపెల్లి అందాజాలో చిన్నోడు మేలుకున్నాడు. ‘ఇది ఎంత నానా? అది ఎంత నానా?’ (ఏంటి) అని అడుగుతూపోయాడు. ‘ఇది నానా! అది నానా!’ అని చెబుతూపోయాను. నానా: ఒకే పదాన్ని రెండు భిన్న ప్రేమల్తో పిలుచుకోవడం ఆశ్చర్యంగా లేదూ! ఒక విషయాన్ని రియలైజ్ అవుతున్నప్పుడు- కేవలం అందులో ఆనందం పొందుతాను. ఆ అనుభవపు అసలైన క్షణం దాటింతర్వాత, ‘అరె, ఇది రాయొచ్చుకదా!’ అనిపిస్తుంది. వాళ్లకు మోకాళ్ల నొప్పులుండొచ్చు; కడుపులో మంట కావొచ్చు; గంటక్రితం వేరే బస్సులో నిలబడి వచ్చి, ‘అమ్మయ్య సీటుదొరికిం’దని కూర్చునివుండొచ్చు; ఏదైనా ఆపరేషన్ జరిగివుండొచ్చు; కొందరికి ఇవ్వాలనివున్నా మొహమాటం అడ్డురావొచ్చు. సానుకూల మొహమాటం కూడా ఉంటుంది. ఎవరూ భిక్ష వేయనప్పుడు మనం వేయడానికి పడే ఇబ్బందిలాంటిది! కొందరికి ఈ ఇష్యూతో సంబంధం లేకుండా ఇప్పుడే వచ్చిన స్టాపులో ఎక్కివుండొచ్చు. అయినా వాళ్లందరివైపూ నా కోపం పాకింది. వర్గం, కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన ఏర్పడే ద్వేషభావన కూడా ఇలాగే ఎదుటివారిని గురించి ఆలోచించనీయని అహేతుకతకు దారితీస్తుందా! సాయంత్రం రిటర్నులో- ప్యాట్నీ దగ్గర- దిగడానికి ఫుట్‌బోర్డు మీద రెడీగావున్న హెడ్‌ఫోన్స్-బ్లాక్ జీన్సు- బ్లూ టీషర్టు కుర్రాడు కవర్లో ఏదో ద్రవం పట్టుకెళ్తున్నాడు. కారి, ప్యాంటు మీద బుడగల్లా పడిందది. వెంటనే, వెనకసీట్లో కూర్చున్న బ్లాక్ జీన్సు- చెక్స్ షర్ట్ అబ్బాయి తన ‘సర్టిఫికెట్ల’ కవర్ తీసిచ్చాడు (‘‘థాంక్సన్నా.’’). మనుషుల దగ్గర కొంతేదో ఉంది; కొంతేదో లేదు. - పూడూరి రాజిరెడ్డి