
రచయిత్రిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది నటి ట్వింకిల్ ఖన్నా.‘మిసెస్ ఫన్నీబోన్స్: ‘పైజామాస్ ఆర్ ఫర్ గివింగ్’ ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్’ పుస్తకాలతో పాఠకులను అలరించింది. తాజాగా తన కొత్త పుస్తకం ‘వెల్‌కమ్ టూ ప్యారడైజ్’ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ట్వింకిల్ ఖన్నా లండన్‌లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత వస్తున్న పుస్తకం ఇది.
‘ఈ పుస్తకంలోని క్యారెక్టర్లు గత అయిదు సంవత్సరాలుగా నా మనసులో తిరుగుతున్నాయి. నాకు మాత్రమే పరిచయమైన ఈ క్యారెక్టర్లు ఇప్పుడు మీకు కూడా పరిచయం కాబోతున్నాయి’ అంటూ రాసింది ఖన్నా.
మానవ సంబంధాలు, ఎడబాట్లు, అనుబంధాలు, ఆప్యాయతలను ఆధారంగా చేసుకొని రాసిన ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. సామాన్య పాఠకుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో ఈ పుస్తకంపై కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment