
'దసరా' నుంచి రూట్ మార్చిన నాని.. మాస్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'హిట్ 3' చేస్తున్నాడు. రీసెంట్ గా నాని పుట్టినరోజు టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలతో తీస్తున్న 'ప్యారడైజ్' గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ వీడియో ప్రారంభంలోనే బూతులు కూడా ఉంటాయనే వార్నింగ్ ఇచ్చారు. 'ప్యారడైజ్' ప్రపంచం ఎలా ఉండబోతుందనే చూపించేశారు. వీడియో మొత్తంలో ఆ కాకుల రిఫరెన్సులు గట్టిగాన ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఆస్కార్ ఉత్తమ చిత్రం ఓ బోల్డ్ మూవీ.. ఏంటి 'అనోరా' స్పెషల్?)
ఇది కడుపు మండిన కాకుల కథ.. జమానా జమానా కెల్లి నడిచే శవాల కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పెంచి పోసిన ఓ జాతి కథ అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంది. నాని ఫేస్ చూపించలేదు గానీ పిలకలు వేసుకుని, మెడలో చైన్లతో చేతిలో గన్స్ తో చాలా వైవిధ్యంగా ఉన్నాడు.
ఇందులో నాని తల్లిపాత్రలో సోనాలి కులకర్ణి అనే సీనియర్ నటి కనిపించబోతుంది. ఒకప్పటి సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇది. గ్లింప్స్ చూస్తుంటే బహుశా ఇందులో హీరోయిన్ పాత్ర ఉండకపోవచ్చనిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్ గానే ఉంది. 2026 మార్చి 26న మూవీ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)
Comments
Please login to add a commentAdd a comment