ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘పేరడైజ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ప్రముఖ దర్శకులు మణిరత్నం సమర్పించిన సినిమా ‘పేరడైజ్’. శ్రీలంక, ఇండియా రచయితలు కలిసి రాసిన కథతో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమాకు ప్రసన్న దర్శకుడు. రోషన్ మాథ్యూ, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ‘పేరడైజ్’ పూర్తిగా శ్రీలంకలో తీసిన సినిమా. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... ఓ జంట తమ ఐదో వివాహ మహోత్సవాన్ని జరుపుకోవడానికి శ్రీలంకలోని ఓ సుదూర గెస్ట్ హౌస్‌కు వెళుతుంది. ఆ గెస్ట్ హౌస్ కొండల మధ్యలో చాలా మారుమూల ప్రాంతంలో ఉంటుంది. దానికి దరిదాపులో ఓ చిన్న గ్రామం ఉంటుంది. వీళ్ళు వెళ్ళేటప్పటికీ శ్రీలంక దేశం మొత్తం ఉద్యమంతో ఉద్రిక్తత నెలకొని ఉంటుంది. ఈ జంట నివసిస్తున్న గెస్ట్ హౌస్‌లో ఓ రాత్రి దొంగతనం జరిగి వారి వస్తువులన్నీ దొంగలు ఎత్తుకెళ్తారు. ఆ దొంగలను పట్టుకునే క్రమంలో వీరు ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్నదే కథ.
ఈ సినిమా మొత్తంలో స్క్రీన్‌ప్లే కొంత ల్యాగ్ అపించినా ఆఖరి ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించనిది. అలాగే సినిమా మొత్తంలో సీతమ్మ, హనుమంతులు తిరిగిన ప్రదేశాలు చూపించడం, వాటి వివరణ ఇవ్వడం బావుంది. సినిమా మొత్తం చాలావరకు గ్రీనరీ చూడవచ్చు. ఎందుకంటే లంక అనేది రావణుని పేరడైజ్ కాబట్టి. మరి... మీరు కూడా ఈ ‘పేరడైజ్’ని ప్రైమ్ వీడియోలో చూసేయండి.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment