
ప్యారడైజ్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పే ప్రయత్నాలు ఏడో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. కార్చిచ్చు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య మొత్తంగా 59కి పెరిగింది. 130 మంది ఆచూకీ లేకుండా పోవడంతో వారి జాడను కనుగొనేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. ప్యారడైస్ పట్టణంలోని బుటె కౌంటీలో అత్యధిక మంది తప్పిపోయినట్లు సమాచారం. సియార్రా నెవడా పర్వతాల దిగువన 26 వేల మంది జనాభా నివసించిన ప్యారడైజ్ పట్టణం కార్చిచ్చు ధాటికి పూర్తిగా దగ్ధమైపోవడం తెలిసిందే. ఈ పట్టణంలో ఎక్కువగా ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన వృద్ధులే నివసిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment