అప్పుడు 'దసరా'.. ఇప్పుడు 'ది ప్యారడైజ్' | Actor Nani upcoming film with Srikanth Odela | Sakshi
Sakshi News home page

అప్పుడు 'దసరా'.. ఇప్పుడు 'ది ప్యారడైజ్'

Published Thu, Nov 7 2024 3:11 AM | Last Updated on Thu, Nov 7 2024 7:38 AM

Actor Nani upcoming film with Srikanth Odela

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల, నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించి, టైటిల్‌ లోగోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు నాని. 

పీరియాడికల్‌ పవర్‌ఫుల్‌ యాక్షన్  డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని, ఇందులో సికింద్రాబాద్‌ కుర్రాడిగా నాని నటిస్తారని టాక్‌. హీరోయిన్ గా జాన్వీకపూర్‌ లేదా శ్రద్ధాకపూర్‌ నటిస్తారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు నాని ‘హిట్‌ 3’ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్ లో జరుగుతోంది. 2025 మే 1న ‘హిట్‌ 3’ రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement