ప్రేమపెళ్లి చేసుకుందని.. పెట్రోల్ పోసి చంపిన తల్లి | Pakistani girl burned alive by mother over love marriage | Sakshi
Sakshi News home page

ప్రేమపెళ్లి చేసుకుందని.. పెట్రోల్ పోసి చంపిన తల్లి

Published Wed, Jun 8 2016 8:09 PM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM

ప్రేమపెళ్లి చేసుకుందని.. పెట్రోల్ పోసి చంపిన తల్లి - Sakshi

ప్రేమపెళ్లి చేసుకుందని.. పెట్రోల్ పోసి చంపిన తల్లి

లహోర్: కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఓ తల్లి, సోదరుడు ఆ అమ్మాయి మీద పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన దారుణమైన ఘటన బుధవారం పాకిస్థాన్‌లో జరిగింది. బాధితురాలు జీనత్ (18) అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. తన కూతురు దిద్దుకోలేని తప్పు చేసిందని, ఒక అబ్బాయితో లేచిపోయి పెళ్లి చేసుకుందని తల్లి పర్వీన్ పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. కాగా, పరువు హత్యల పేరుతో పాకిస్థాన్ లో ఇలాంటి దారుణాలు మామూలయ్యాయి. పర్వీన్ నేరాన్ని ఒప్పుకొందని, ఆమె కొడుకుకు ఈ నేరంలో ఎలాంటి సంబంధం లేదని తెలిపిందని పోలీసులు చెప్పారు.

తమ ఇంటి సమీపంలోనే ఉండే హసన్ అనే వ్యక్తిని జీనత్ ప్రేమించింది. వాళ్ల పెళ్లికి పర్వీన్ ఒప్పుకోలేదు. దాంతో హసన్‌తో పారిపోయిన జీనత్.. కోర్టులో అతన్ని వివాహం చేసుకుంది. కొద్దిరోజుల కిందట జీనత్ తన వద్దకు వెళ్లి ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు క్షమించమని కోరింది. ఆమెను కుటుంబసభ్యులందరూ క్షమించారని చెప్పిన తల్లి, ఆశీర్వాదం తీసుకోవడానికి మరలా రావాలని చెప్పింది. తల్లి మాటలు నమ్మిన జీనత్ ఇంటికి వెళ్లగా.. తల్లి, సోదరుడు వేధించి తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు వివరించారు. పర్వీన్, ఇతర కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement