ఇద్దరు చిన్నారులును కాపాడేందుకు ..ఆ నలుగురు మహిళలు..! | Ś To Save Badly Burned Niece Nephew | Sakshi
Sakshi News home page

ఇద్దరు చిన్నారులును కాపాడేందుకు ..ఆ నలుగురు మహిళలు..!

Published Thu, Mar 14 2024 1:27 PM | Last Updated on Thu, Mar 14 2024 2:31 PM

Ś To Save Badly Burned Niece Nephew - Sakshi

అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారులను కాపాడటం కోసం ఆ నలుగురు అత్తలు చేసిన పని వింటే షాక్‌కి గురవ్వుతారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అత్తలు ఉన్నారా? అనిపిస్తుంది. చెప్పాలంటే.. కుంటంబ బంధాలకు ఇచ్చిన ప్రాముఖ్యత తోపాటు, బాధలో ఉంటే మన అనుకునే వాళ్లకు ఎలా అండగా ఉండాలనేది చాటి చెబుతోంది ఈ కథ. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

తూర్పు చైనాలోని షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో ఫిబ్రవరి 20న పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల బాలిక కేకే, నాలుగేళ్ల చిన్నారి దండన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ఐదు రోజులు కోమాలో ఉన్నారు. శ్వాసకోశ మంట, అవయవ వైఫల్యంతో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆ చిన్నారుల తల్లి మిన్‌ ఈ విషయాన్ని తన కుంటుంబు సభ్యులకు తెలియజేసింది . పిలల్లను ప్రాణాలు దక్కాలంటే చర్మం, జుట్టు దానం చేయాలని పేర్కొంది. 

వెంటనే అందుకు ఆమె నలుగురు ఆడపడుచులు ముందుకు రావడమే గాక చర్మాన్ని, జుట్టుని దానం చేశారు. ఆ ప్రమాదంలో చిన్నారుల చర్మం తీవ్రంగా కాలిపోవడంతో ఆ ప్రదేశంలో ఆ మహిళలు దానం చేసిన చర్మన్ని అతికించి సర్జరీ చేస్తారు వైద్యులు. ఈ మేరకు ఆ చిన్నారి తల్లి మాట్లాడుతూ..ఈ విషయం గురించి తన ఆడపడుచులకు చెప్పగానే..వారు ముందుకు వచ్చి సాయం చేశారని సంతోషంగా చెప్పింది. ఇక ఆ ప్రమాదం ఎలా జరిగిందో వివరించింది. తన పిల్లల గదిలో ఎయిర్‌ కండీషనర్‌ను ఆన్‌ చేయగానే అకస్మాత్తుగా అది విరిగిపోయి ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకొచ్చింది ఆ చిన్నారుల తల్లి మిన్‌.

ఆ మహిళల తోపాటు ఆ చిన్నారుల తల్లి కూడా చర్మాన్ని, జుట్టుని దానం చేసింది. కాగా, ఆ చిన్నారులకు వెంటనే శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు వైద్యులు.ఈ మేరకు ఆ నలుగురు మహిళలు మాట్లాడుతూ.."మేము నలుగురం ఇలా ఒకేసారి గుండు గీయించుకుంటామని కలలో కూడా అనుకోలేదు. అయినా తమ మేనకోడలు, మేనల్లుడి ప్రాణాలు రక్షించడం కోసం ఏం చేసేందుకైనా తాము సిద్దం అని చెబుతున్నారు." ఆ నలుగురు మహిళలు. ఈ ఐదుగురు మహిళలు ఆస్పత్రి బెడ్‌పై ఆ చిన్నారులను ఒడిలో ఉంచుకుని దిగిన ఫోటోల తోపాటు ఈ విషయం చైనా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు వండర్‌ విమెన్‌ అని ఒకరూ, ఈ ఏడాది అత్యంత అందమైన ఆంటీలు వీరే అంటూ కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

(చదవండి: నటి ఒలివియాకి బ్రెస్ట్‌ కేన్సర్‌! ఏకంగా నాలుగు సర్జరీలు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement