దొంగతనానికి వచ్చి సజీవ దహనం! | Thief burned to death in rangareddy | Sakshi
Sakshi News home page

దొంగతనానికి వచ్చి సజీవ దహనం!

Published Wed, Mar 22 2017 8:25 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

Thief burned to death in rangareddy

- అగ్నికి ఆహుతైన టీ కొట్టు డబ్బా
- మంటలు ఆర్పిన తర్వాత బయటపడిన మృతదేహం
కొత్తూరు: దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి మంటల్లో చిక్కి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. కొత్తూరులోని పోలీస్‌స్టేషన్‌ వెళ్లే రోడ్డులో దొండిరామ్‌కు చెందిన టీ కొట్టులోంచి మంటలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పరిశీలించగా టీకొట్టు డబ్బాలో సగం కాలిన వ్యక్తి మృతదేహం కనిపించింది. 
 
ఈ విషయమై రూరల్‌ సీఐ మధుసూదన్‌ను వివరణ కోరగా.. టీకొట్టులో చోరీకి వచ్చిన దొంగ.. డబ్బాపై ఉన్న రేకులు తొలగించి లోపలికి ప్రవేశించినట్లు తెలిపారు. అదే సమయంలో టీకొట్టులో అమ్మకానికి పెట్టిన పెట్రోల్, కిరోసిన్‌ డబ్బాలపైన దొంగ పడ్డాడు. చీకటిగా ఉండడంతో వెలుతురు కోసం అగ్గిపుల్లను వెలిగించాడు. దీంతో మంటలు వ్యాపించి సజీవ దహనమైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. మరో కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement