జాతీయ రహదారిపై వ్యాన్ దగ్ధం
సురక్షితంగా బయటపడిన డ్రైవర్
రావులపాలెం: జాతీయ రహదారిపై వెళుతున్న వ్యాన్‌లో గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించి క్షణాల్లో కారు కాలి పోయింది. నరేంద్రపురానికి చెందిన డ్రైవర్ నక్కా శరత్‌బాబు మారుతి వ్యాన్‌లో రావులపాలెం వైపు నుంచి తణుకు వైపు వెళుతున్నాడు. స్థానిక వీస్కే్వర్ థియేటర్ సమీపంలోకి వచ్చేసరికి కారులో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ శరత్‌బాబు కారు నుంచి బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. క్షణాల్లో మంటలు వ్యాపించి వ్యాన్ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఇరువైపులా సుమారు అరకిలోమీటరు దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఐ పీవీ రమణ అక్కడకు చేరుకుని కొత్తపేట అగ్నిమాపక అధికారికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోగా సీఐ స్థానికుల సాయంతో ఫోమ్ ఉపయోగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ వై.శ్రీరాములు అగ్నిమాపక సిబ్బందితో అక్కడకు చేరుకొని మంటలు అదుపు చేశారు. ఆ వ్యాన్‌లో రెండు గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను పోలీసులు గుర్తించారు. హైవే రెండో లైన్‌పై ట్రాఫిక్‌ను మళ్లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తెలిపారు.