
కాలిపోయిన టీవీ, ఫ్రిజ్‌లను చూపుతున్న బాధితుడు
మెదక్ మున్సిపాలిటీ : షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సుమారు నాలుగు టీవీలు, రెండు ఫ్రిజ్‌లు కాలిపోయిన సంఘటన మెదక్ పట్టణంలోని బ్రహ్మణ వీధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పట్టణంలో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.
ఇదే సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో పలు ఇళ్లలో నాలుగు టీవీలు, రెండు ఫ్రిజ్‌లు, సెటప్‌బాక్స్‌లు, ఫ్యాన్లు, ఫోన్లు, ట్యూబ్‌లైట్లు తదితర వస్తువులు కాలిపోయాయి. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment