Short circuits
-
ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనుండగా.. ఇంతలోనే విధి వక్రించి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మరో పక్షం రోజులు గడిస్తే.. ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనుండగా.. ఇంతలోనే విధి వక్రించి విషాదఛాయలు అలుముకున్నాయి.. వివరాలలోకి వెళ్తే .. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) రామన్నగూడెం గ్రామానికి చెందిన అనంతుల మల్లయ్య (52)కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. కుమార్తెకు వివాహం కాగా, ఇటీవల కుమారుడు మహేష్‌కు నిశ్చితార్థం జరిగింది. శ్రావణమాసంలో ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంది. ఈ పెళ్లికి వంట చెరుకు సమకూర్చేందుకు అనంతుల మల్లయ్య శనివారం ఉదయాన్నే ఓ రైతుకు చెందిన ఎడ్లబండి, మరో రైతు ఎడ్లను తోలుకుని గ్రామ శివారులోని ఏరు అవతలికి వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో ఏరు దాటలేకపోయాయి. ఈ సమయంలో ఏటిలోంచి పొలానికి నీళ్లు పెట్టుకునేందుకు ఓ రైతు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్‌కు సంబంధించి సర్వీస్ వైర్ ప్రమాదవశాత్తు ఎడ్ల బండికి తగిలింది. ఈ ప్రమాదంలో అనంతుల మల్లయ్యతో పాటు ఓ ఎద్దు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలువిడిచింది. గమనించిన సమీపంలో ఉన్న రైతు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట రూరల్ సీఐ విఠల్‌రెడ్డి, ఎస్సై లింగం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగం తెలిపారు. -
నిజామాబాద్‌లో కాలి బూడిదైన సెల్ టవర్
-
నాసి..అందుకే మసి!
సాక్షి, రంగారెడ్డి: గత మూడు నెలల నుంచీ నగరంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అహ్లాదంగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఉక్కపోత కూడా అంతగా లేదు. ఫలితంగా బహుళ అంతస్తుల్లో కొనసాగుతున్న వాణిజ్య, వ్యాపార, గృహ సముదాయాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం కూడా తగ్గింది. అయితే ఆయా భవనాల్లో వర్షాకాలంలోనూ షార్ట్‌సర్క్యూట్స్ వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం కూకట్పల్లి ప్రశాంత్‌నగర్ పారిశ్రామికవాడలోని నాగసాయి న్యూపాలిమార్ ప్లాస్టిక్ సంచుల తయారీ కంపెనీ సహా మలక్‌పేట్ సలీమ్‌నగర్‌లోని ఆదిహోం డా షోరూంలో భారీ అగ్నిప్రమాదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆయా భవన నిర్మాణాల సమయంలో భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు సామర్థ్యం గల కేబుళ్లను ఎంపిక చేయకపోవడం, ఒకేపిన్ నుంచి మూడు నాలుగు ఎలక్ట్రానిక్ వస్తువులకు కనెక్షన్లు ఇస్తుండటం వల్ల కేబుళ్లు అధిక ఒత్తిడిలోనై షార్ట్‌సర్క్యూట్‌లకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం విధులు ముగిసిన తర్వాత చాలా మంది ఆయా స్విచ్‌లను ఆఫ్ చేయకుండా పోతున్నారు. ఈదురు గాలితో కూడిన వర్షం కురిసినప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తడం, ఇలా కరెంట్ వచ్చిపోయినప్పుడు జాయింట్ల వద్ద అగ్నికీలలు ఎగిసిపడి విలువైన వస్తువులు దగ్ధమవుతున్నట్లు మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. అవసరాలు గుర్తించకుండా కేబుల్ పనులు ప్రస్తుతం నగరంలో భారీ బహుళ అంతస్తుల భవనాలు(అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, సాఫ్ట్వేర్ సంస్థలు, హోటళ్లు, సినిమాహాళ్లు, మాల్స్ 70 వేల వరకు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా వరకు బిల్డర్లు నిర్మించినవే. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ సమయంలోనే ఐఎస్ఐ మార్క్ ఉన్న విద్యుత్ కేబుళ్లు, స్విచ్‌లు, ప్లగ్పిన్లనే వాడాల్సి ఉన్నప్పటికీ...చాలా మంది తక్కువ సామర్థ్యం ఉన్న నాసిరకం వస్తువులను వాడుతున్నారు. తీరా ఆయా భవనాలు వినియోగంలోకి వచ్చిన తర్వాత అధిక లోడుతో కేబుల్ వేడెక్కి షార్ట్సర్క్యూట్లు జరుగుతున్నట్లు తెలిసింది. నిజానికి భవిష్యత్తు విద్యుత్ వినియోగం, ప్యానల్ బోర్డ్, కేబుల్, ఎర్తింగ్ వంటి పనులను నిర్మాణ సమయంలోనే విద్యుత్ తనిఖీ విభాగం అధికారులు పరిశీలించాలి. నిర్ధేశిత ప్రమాణాలకు అనుగుణంగా కేబుల్, లైన్లు ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే ఆయా బహుళ అంతస్థుల భవనాలకు ధృవీకరణ పత్రం జారీ చేయాలి. కానీ విద్యుత్ తనిఖీ అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. అడిగినంత ముట్టజెప్పితే చాలు కనీసం భవనాలను తనికీ చేయకుండానే సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అబిడ్స్ కేంద్రంగా నకిలీ కేబుళ్ల దందా నకిలీ విద్యుత్ కేబుళ్లు, స్విచ్‌లు, త్రిపిన్ ప్లగ్‌ల అమ్మకాల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. బ్రాండెడ్ కంపెనీలకు ఏమాత్రం తీసిపోని విధంగా వీటిని తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నారు. నగరంలోని అబిడ్స్ కేంద్రంగా ఈ నకిలీ కేబుళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షాపులో పది బాక్కుల కేబుల్ కొంటే వాటిలో మూడు నుంచి నాలుగు బాక్సుల కేబుల్ నకిలిదే బయటపడుతుండటంతో విద్యుత్ వర్కర్లు సైతం విస్తుపోతున్నారు. నగరంలో తరచూ వెలుగు చూస్తున్న షార్ట్సర్క్యూట్లలో 40 శాతం ప్రమాదాలకు నాసిరకం కేబుళ్లు, స్విచ్‌లు, ఫ్యూజ్‌లే కారణమని విద్యుత్ నిపుణు లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన మచ్చుకు కొన్ని ప్రమాదాలుః మలక్‌పేటలోని ఆదిహోండా హోండా షోరూంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యాబై బైకులు మంటల్లో దగ్ధమైనట్లు అంచనా. రూ.లక్షల విలువైన ఆస్తి బుగ్గిపాలైంది. కూకట్పల్లి ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని నాగసాయి న్యూపాలిమార్ ప్లాస్టిక్ సంచుల తయారీ కంపెనీలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ఏడాది క్రితం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తాత్కాలిక దుకాణాలు సహా రూ.లక్షల విలువ చేసే వస్తువులన్నీ అగ్నికి ఆహూతైపోయాయి. ఆరు నెలల క్రితం బాబూఖాన్ ఎస్టేట్ ఏడో అంతస్థులో వెలుగు చూసిన షార్ట్‌సర్క్యూట్ వల్ల ఏసీలు, కంప్యూటర్లు సహా కీలక వస్తువులు, ఫైళ్లు దగ్దం అయ్యా యి. నారాయణగూడ విఠల్‌వాడిలో గల నారాయణ కళాశాలో షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. విలువైన ఫర్నిచర్ దగ్థ మైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యార్థులెవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
గుంటూరు- రేపల్లె రైల్లో షార్ట్ సర్క్యూట్
-
నాసి..అంతా మసి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇటీవల వెలుగు చూస్తున్న విద్యుత్ షార్ట్సర్క్యూట్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉన్న సమయంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. తరచూ కరెంట్ వస్తూ పోతుండటం, కేబుల్ సామర్థ్యానికి మించి విద్యుత్ వినియోగించడం వల్ల ఓవర్‌లోడుతో షార్ట్సర్క్యూటవుతుంది. ఈ సయంలో కేబుల్ కాలిపోయి నిప్పురవ్వలు ఎగిసిపడటం సహజం. కానీ నిజానికి ఇటీవల విద్యుత్ సరఫరాలో ఎలాంటి హెచ్చుతగ్గులు కానీ, కోతలు కానీ లేవు. నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతోంది. అంతేకాదు ఇటీవల చలి తీవ్రత పెరిగింది. ఈ సమయంలో గృహ, వాణిజ్య సంస్థల్లో కరెంట్ వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పలు వాణిజ్య సముదాయల్లో వరుసగా అగ్నిప్రమాదాలు వెలుగు చూస్తుంటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు ఈ అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమా..? లేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యజమానులే తమ ఆస్తులను బుగ్గిపాలు చేసుకుంటున్నారా..? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. నాసిరకమే కారణం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని హైదరాబాద్ సర్కిల్లో 450పైగా ప్రమాదాలు చోటు చేసుకోగా వీటిలో 170 ప్రమాదాలకు షార్ట్‌సర్క్యూట్‌లే కారణంగా అధికారులు నిర్ధారించారు. రూ.11.6 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రకటించారు. సెంట్రల్ సర్కిల్ పరిధిలో 340కిపైగా ప్రమాదాలు చోటు చేసుకోగా, వీటిలో 170పైగా ప్రమాదాలకు షార్ట్‌సర్క్యూట్‌లే కారణమని, ఈ ప్రమాదాల్లో రూ.13.84 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు గుర్తించారు. అదే విధంగా ఈస్ట్ సర్కిల్ పరిధిలో 277పైగా ప్రమాదాలు చోటు చేసుకోగా, 96 ప్రమాదాలకుషార్ట్సర్యూట్లే కారణం కాగా రూ. కోట్లలో ఆస్తినష్టం వాటిల్లింది. ఇక నార్త్ సర్కిల్ పరిధిలో 404 ప్రమాదాలు చోటు చేసుకోగా, వీటిలో 169 ప్రమాదాలకు షార్ట్‌సర్క్యూట్‌లే కారణమని, రూ.0.28 కోట్ల ఆస్తినష్టం వాటి ల్లినట్లు గుర్తించారు. నిజానికి ఇప్పటి వరకు గ్రేటర్లో వెలుగు చూసిన విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌లకు నాసిరకం వైరింగే కారణంగా విద్యుత్ తనిఖీ శాఖ గుర్తించింది. అయితే కొంతమంది ఇన్సూరెన్స్ డబ్బులతో నష్టాల నుంచి గట్టేక్కేందుకు కావాలనే ఆస్తులను కాల్చేసి, వాటికి షార్ట్సర్క్యూట్లను కారణంగా చూపుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నాణ్యమైన వైరింగ్తోనే రక్షణ నిర్మాణ సమయంలోనే భవిష్యత్తు అవసరాలను గుర్తించి, ఆ సామర్థ్యం మేర వైరింగ్‌ను ఎంచుకోవాలి. స్విచ్‌లు, బోర్డులు, ఫ్యూజ్‌లు, వైరింగ్ వంటి విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దు. మార్కెట్లో రకరకాల వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లు దొరుకుతున్నాయి. ఐఎస్ఐ గుర్తింపు పొందిన వస్తువులనే ఎంచుకోవాలి. తక్కువ ధరకే వస్తున్నాయి కదా? అని నాసిరకం వైరింగ్‌ను ఎంచుకోవద్దు. ఇంటి వైరింగ్‌కు ఎర్తింగ్ తప్పనిసరి. స్విచ్ ఆఫ్ చేయకుండా ప్లగ్‌లను బయటకు తీయొద్దు. – నక్క యాదగిరి, విద్యుత్‌రంగ నిపుణుడు -
షార్ట్ సర్క్యూట్‌తో కాలిన టీవీలు, ఫ్రిజ్‌లు
మెదక్ మున్సిపాలిటీ : షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సుమారు నాలుగు టీవీలు, రెండు ఫ్రిజ్‌లు కాలిపోయిన సంఘటన మెదక్ పట్టణంలోని బ్రహ్మణ వీధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పట్టణంలో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఇదే సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో పలు ఇళ్లలో నాలుగు టీవీలు, రెండు ఫ్రిజ్‌లు, సెటప్‌బాక్స్‌లు, ఫ్యాన్లు, ఫోన్లు, ట్యూబ్‌లైట్లు తదితర వస్తువులు కాలిపోయాయి. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. -
అగ్నికి ఆహుతే..!
సాక్షి, హైదరాబాద్: అసలే వేసవికాలం.. ఆపై 45 డిగ్రీలకు పైగా ఎండలు.. మండిపోతున్న మే నెల. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎండ వేడితో షార్ట్ సర్క్యూట్లు జరిగి అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి నియంత్రణకు, ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చేసేందుకు ప్రతీ నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ హామీ నాలుగేళ్లయినా పూర్తికాలేదు. దీంతో చాలా నియోజకవర్గాల్లో అగ్నిప్రమాదాలతో ఆస్తులు ఆహుతైపోతున్నాయి. ఇక ఒక్కో నియోజకవర్గంలో కనీసం 4 నుంచి 5 మండలాలుంటాయి. నియోజకవర్గం పేరుతో ఉన్న అర్బన్ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అయితే నియోజకవర్గ కేంద్రానికి దూరంగా ఉన్న మండలంలోని ఏదో మారుమూల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగితే ఆ ఫైర్ ఇంజన్ వచ్చి మంటలార్పేసరికి ఆస్తులు బూడిదై పోతున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్టు పెద్ద నియోజకవర్గాలు, పైగా పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రతీ జిల్లా హెడ్‌క్వార్టర్‌లో రెండు ఫైర్స్టేషన్లు, శివారు ప్రాంతాలకు రూరల్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులే స్పష్టం చేస్తున్నారు. కానీ దీనిపై అగ్నిమాపక శాఖ దృష్టి సారించలేదు. గత రెండేళ్లలో 242 తీవ్ర అగ్నిప్రమాదాలు జరగ్గా, ఈ ప్రమాదాల్లో రూ.48 కోట్ల విలువైన ఆస్తి అగ్నికి ఆహుతైంది. 183 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఆకతాయి చేష్టలు...పంటలు బుగ్గిపాలు
కడప అగ్రికల్చర్: ఆకతాయిలు నిప్పు పెట్టడం వల్ల, విద్యుత్ షార్ట్‌సర్క్యూ వల్ల మామిడి, కంది, టమాటా, బుడ్డశగన పంటతోపాటు, వర్మీకంపోస్టు యూనిట్లు, డ్రిప్ పరికరాలు బుగ్గిపాలవుతున్నాయి. దీంతో రైతన్నలు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. విత్తనం మొదలుకొని పంట నూర్పిళ్ల దాకా అనేక రకాల సమస్యలను అధిగమించేందుకు రాత్రింబవళ్లు స్వేదాన్ని చిందించి శ్రమించినా తీరా పంట దిగుబడులతో మంచి ఆదాయాన్ని పొందుతామనుకున్న తరుణంలో ఇలా అగ్గిపాలవుతుండడాన్ని అన్నదాత తట్టుకోలేకపోతున్నాడు. అడవులకు నిప్పుపెడితే కేసులు పెడతామని బీరాలు పలికిన అటవీశాఖ అధికారులు ఆకతాయిల ఆగడాలను చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదని రైతు సంఘాలు బాహటంగా విమర్శిస్తున్నాయి. లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లె, టి. సుండుపల్లె, చిన్నమండెం, పెద్దముడియం, బి.కోడూరు, ఓబుళవారిపల్లె, పుల్లంపేట మండలాల సమీపంలో కొండ, గుట్టలున్నాయి. ఈ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, నిమ్మ, కూరగాయతోటలు, బుడ్డశగన పంట సాగులో ఉన్నాయి. రెండు నెలలుగా ఏదో ఒక చోట పంటతోటలు, చేలు తగలబడుతూనే ఉన్నాయి. దీనికి తోడు తుంపర, బిందు సేద్య పరికరాలు అగ్గిపాలయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీన రామాపురం మండలం చిట్లూరు దళితవాడకు చెందిన కౌలు రైతులు గంపాల వెంకటసుబ్బమ్మ, బాలిపోగు గంగమ్మ, చిన్నికృష్ణయ్య, వెంకటరమణ, ముసలిరెడ్డిపల్లెకు చెందిన రైతులు చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లకు చెందిన 150 ఎకరాల మామిడి చెట్లు, 30 ఎకరాల్లో సాగుచేసిన కందిపంట కాలిపోయింది. దీనికి ప్రధాన కారణం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నిప్పులు ఎగసిపడటమే. దీనివల్ల దాదాపు రూ.10లక్షల మేర నష్టం సంభవించింది. అదే నెల 6వ తేదీన రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన కాటిగారి ప్రతాప్‌రెడ్డికి చెందిన 5 ఎకరాల్లోని బుడ్డశనగ కట్టె కుప్ప కాలిపోయి రూ.2.50 లక్షల నష్టపోయినట్లు రైతు ఆవేదనతో తెలిపారు. ఆ నెల్లోనే 5వ తేదీన సంబేపల్లె మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన యువరాజా నాయుడు, రెడ్డి నారాయణకు చెందిన 30 ఎకరాల మామిడితోట దగ్ధమై రూ.12లక్షలు నష్టపోయినట్లు తెలిపారు. ఫిబ్రవరి1వ తేదీన లక్కిరెడ్డిపల్లె మండలం కాకుళారం గ్రామానికి చెందిన రైతు కత్తి రామచంద్ర, కత్తి వెంకటరమణ, గొర్లవీరుకు చెందిన 150 మామిడి చెట్లు ఆకతాయి చేష్టల వల్ల కాలిపోయాయి. దీంతో పాటు వర్మీకంపోస్టు యూనిట్ కూడా కాలిపోవడంతో మొత్తం రూ.5లక్షలు నష్టం సంభవించినట్లు రైతులు తెలిపారు. జనవరి నెల 28వ తేదీన పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామానికి చెందిన రైతులు కటారి జకరయ్య, కటారి ప్రభాకర్ 5 ఎకరాల్లోని బుడ్డశనగ కట్టె కల్లంలో దగ్ధం అయిందని, ఈ ప్రమాదం వల్ల రూ.1.20లక్షలు నష్టపోయామని వాపోయారు. ఫిబ్రవరి 21వ తేదీన ఓబుళవారిపల్లె మండలం పెద్ద ఓరంపాడు గ్రామ మహిళా రైతు ఆళ్ల నరసమ్మకు చెందిన 2 ఎకరాల్లోని అరటి తోట, బోరు మోటారు, టేకు చెట్లు, కొబ్బరి చెట్లు, వర్మీకంపోస్టు యూనిట్టు కాలిబూడిదయ్యాయి. దీని కారణంగా రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత మహిళా రైతు వాపోయారు. ఈ రైతులేకాదు జిల్లాలో చాలా మంది పంటలు అగ్నికి ఆహుతై పోవడంతో ఏమి చేయలేని స్థితిలో ఆందోళన చెందున్నారు. చోద్యం చూస్తున్న అధికారులు గుట్టలకు, కొండలకు ఆకతాయిలు నిప్పుపెట్టకుండా నిరోధించాల్సిన ఫారెస్టు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కొండలు, గుట్టల సమీపాన ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాల్సి ఉన్నా అలా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఏటా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది వారోత్సవాలు నిర్వహిస్తున్నా ఎందుకు నష్టాలు సంభవిస్తున్నాయనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అగ్నికి ఆహుతైన ఉద్యాన, వ్యవసాయ పంటలకు ప్రకృతి వైవరీత్యాల పథకంలోనైనా సాయం అందించాలని ప్రభుత్వానికి రైతులు విన్నవించుకుంటున్నారు. -
అర్థరాత్రి హాస్టల్లో హాహాకారాలు
విశాఖ క్రైం: ఆశీలుమెట్టలోని మేఘాలయ హోటల్ ఎదురుగా గల సేవ్హాండ్స్ లేడీస్ హాస్టల్లో శుక్రవారం అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే విద్యార్థినుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫోన్లు, నగదు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. పోలీసులు, విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, హైదరాబాద్‌తో పాటు వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 37 మంది విద్యార్థినులు అశీలుమెట్ట సమీపంలోని సేఫ్ హ్యాండ్స్ లేడీస్ హాస్టల్లో ఉంటున్నారు. వీరంతా శుక్రవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్థరాత్రి సమయంలో రూం నెంబర్ – 2లో షార్ట్ సర్క్యూట్ కావడంతో టేబుల్ ఫ్యాన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అవి సమీపంలోని మంచానికి, టీవీకి అంటుకోవడంతో కాలిపోయాయి. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన విద్యార్థినులు భయాందోళనతో పరుగులు తీసి తోటి వారికి విషయం తెలియజేశారు. వెంటనే అందరూ బయటకు పరుగులు తీశారు. ఈ హడావిడిలో కొందరు తమ సర్టిఫికెట్లు, ఇతర విలువైన వస్తువులు గదుల్లోనే వదిలేశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని నిర్వాహకురాలు జయమ్మతోపాటు అగ్నిమాపక శాఖ సిబ్బందికి తెలియజేశారు. అయితే వారెవరూ వెంటనే స్పందించలేదని... సంఘటనా స్థలికి రాకుండానే జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్వాహకురాలు జయమ్మ ఫోన్ పెట్టేసిందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా సమయానికి రాకపోవడంతో విలువైన వస్తువులన్నీ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు కాలిబూడిదవడంతో వారంతా కన్నీరు పెట్టుకున్నారు. గదుల్లోని టీవీ, ఫ్యాన్లన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. నీరు లేదని గంట సమయం ఆలస్యంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వారంతా క్షేమంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. నిర్వహణ లోపం వల్లేనా..? సేఫ్ హాండ్స్ లేడీస్ హాస్టల్‌ను అగ్గిపెట్టెల్లాంటి 15 చిన్న గదుల్లో 37 మంది విద్యార్థినులతో నిర్వహిస్తున్నారు. ఒక్కో గదిలో ఒక బెడ్, చిన్న బీరువా ఉండడంతో చాలా ఇరుకుగా ఉంటుంది. మరోవైపు హాస్టల్లో సరైన సౌకర్యాలు లేవని, అయినప్పటికీ నిర్వాహకురాలు పట్టించుకోవడంలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. చాలా గదుల్లో ఎక్కువ మంది ఉన్నారని, తగ్గించమని చెప్పినా వినిపించుకోలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.5వేలు చొప్పున వసూలు చేస్తున్నా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిందని చెప్పినా నిర్వాహకురాలు కనీసం స్పందించలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని నిర్వాహకురాలు జయ మ్మ వద్ద విలేకరులు ప్రస్తావించగా హాస్టల్లో ఆగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకుని సంఘటన స్థలా నికి చేరుకున్నానని... భగవంతుని దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదని అన్నారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేపడతామని ఈస్టు డివిజన్ ఏసీపీ అన్నెపు నర్శింహమూర్తి తెలిపారు. -
‘మంటల్లో’ రాజధాని
సాక్షి, ముంబై : విద్యుత్ పరికరాల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వల్ల దేశంలో ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో దేశ రాజధాని న్యూఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. అగ్ని ప్రమాదాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై రెండో స్థానంలో నిలువగా.. అహ్మదాబాద్ మూడవ స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ప్రకటించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత పదేళ్ల కాలంలో షార్ట్-సర్క్యూట్‌తో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల ఢిల్లీలో 424 మంది, ముంబైలో 418 మంది, అహ్మదాబాద్‌లో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. 2006 నుంచి 2015 మధ్య కాలంలో దేశంలో సంభవించిన అగ్ని ప్రమాదాల వివరాలను నివేదిక వివరించింది. మాజీ అగ్నిమాపక దళాధిపతి పీడీ కర్గూపికర్ మాట్లాడుతూ.. నామమాత్రపు చర్యలతో అగ్ని ప్రమాదాల్ని ఆపలేమన్నారు. ఇంజనీర్లతో ఎలక్ట్రికల్ ఆడిట్లు నిర్వహిస్తేనే సమస్యలకు కొంతమేర పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు మంటల్లో విలువైన ఆధారాలు ఎన్నో నష్టపోతామన్నారు. మంటలార్పే క్రమంలో నీటి ధాటికి మిగిలిన ఆధారాలు కూడా లభించవన్నారు. తద్వారా ప్రమాదానికి షార్ట్-సర్క్యూట్ కారణమా..? లేక మరేదైనా కారణమా? అనేది తేల్చడం కష్టమౌతుందన్నారు. ప్రధాన అగ్నిమాపక అధికారి పీ.ఎస్.రహంగ్దలే మట్లాడుతూ... నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడకపోవడం వల్లే షార్ట్-సర్క్యూట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. వైరింగ్ లోపం వల్ల, ఓవర్‌లోడ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం అధికమవుతుందన్నారు. భవనాలు, అపార్ట్‌మెంటుల్లోని చెత్త చాలా రోజుల పాటు అలాగే పెట్టేస్తారు. దాంతో చిన్నపాటి అగ్ని ప్రమాదం కూడా తీవ్ర రూపం దాలుస్తుందన్నారు. ప్రమాదం నుంచి బయటపడే మార్గం లేక.. వెలువడిన పొగ, విష వాయువుల్ని పీల్చడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
తిరుమల క్యూలైన్లలో విద్యుదాఘాతం!
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ ప్రవేశద్వారం దగ్గరున్న స్కానింగ్ సెంటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో భక్తులకు షాక్ తగిలింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో స్వల్ప తోపులాట చోటుచేసుకొని పలువురు భక్తులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో శ్రీవారి దర్శనానికి కొంత అంతరాయం ఏర్పడింది. ఆలయ ప్రవేశద్వారం వద్ద ఉన్న లగేజీ స్కానింగ్ సెంటర్ వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద, శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద స్కానింగ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఇక్కడ భక్తులను తనిఖీ చేసిన అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మహాద్వారం ఉన్న స్కానింగ్ సెంటర్ వద్ద తనిఖీలు చేస్తుండగా భక్తులకు షార్ట్ సర్క్యూట్ వల్ల షాక్ తగిలింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు క్యూలైన్లో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్ప తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారికి క్యూలైన్లోనే ప్రాథమిక చికిత్స అందించినట్టు తెలుస్తోంది. అనంతరం శ్రీవారి దర్శనానికి ఆ క్యూలైన్లోని వారిని అనుమతించారు. -
షార్ట్ సర్క్యూట్‌తో నివాస గృహం దగ్దం
► 3లక్షల ఆస్తి నష్టం లింగాపూర్(నవీపేట); మండలంలోని లింగాపూర్ గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు నివాసగృహం దగ్దమైంది. రుక్మాబాయి అనే వివాహిత మహిళ తన ఇద్దరు కుమారులను బడికి పంపించాక ఎప్పటిలాగే ఉపాధి హామీ కూలీకి వెళ్లింది. ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. తలుపులు వేసి ఉండడంతో లోపలి భాగంలోని కట్టె దూలాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు పైకి వ్యాపించడంతో చుట్టు పక్కల వారు మంటలను ఆరిపేందుకు ప్రయత్నించారు. మంటలు ఎగసి పడడంతో అగ్ని మాపక శాఖకు సమాచారమందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాసక సిబ్బంది మంటలను ఆరిపేశారు. రుక్మాబాయి భర్త రామ్మూర్తి దుబాయ్‌లో ఉంటున్నాడు. వీఆర్వో రాజు ఆస్తి నష్టంపై పంచనామా చేశారు. ’ 52 వేల నగదు, 30 బస్తాల వడ్లు, అయిదు తులాల బంగారు ఆభరణాలు, వంట సామిగ్రి, బట్టలు కాలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని తహశీల్దార్ అనిల్‌కుమార్ పరిశీలించారు. -
జాతీయ రహదారిపై ఓమిని వ్యాన్ దగ్ధం
డిచ్పల్లి: డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాంపల్లి శివారులో 44వ నంబరు జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఓమిని వ్యాన్ దగ్ధమైంది. ఎస్ఐ శ్రీధర్‌గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లిలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన ఓమిని వ్యాన్‌లో డ్రైవర్ రమేశ్ ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వచ్చాక షార్ట్ సర్క్యూట్‌తో వ్యాన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో రమేశ్ భయంతో కిందకు దిగిపోయాడు. అదే సమయంలో నవయుగ టోల్‌ఫ్లాజా హై వే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు ఆం దోళనకు గురయ్యారు. ఫైరింజన్‌కు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే వ్యాన్ పూర్తిగా తలగబడిపోయిం ది. వ్యాన్‌లో డ్రైవర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ వ్యాన్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలువడంతో మండల విద్యాశాఖాధికారులు, విద్యార్థుల కుటుంబీకులు కలవరానికి గురయ్యారు. ప్రాణనష్టం జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ‘‘ ఓమినీ వ్యాన్‌ను సొంత పనులకు వాడుతాం. డ్రైవర్ స్కూల్ బస్సులో పిల్లలను ఇళ్లల్లో దింపి వచ్చిన తర్వాత, పనుందని అడగటంతో వ్యాన్‌లో వెళ్లమని చెప్పాను. ప్రాణనష్టం జరగక పోవడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని స్కూల్ కరస్పాండెంట్ గంగారాం పేర్కొన్నారు. -
శిల్పారామంలో అగ్నిప్రమాదం
హస్త కళా స్టాళ్లు దగ్ధం రూ.60 లక్షల ఆస్తి నష్టం మాదాపూర్ : శిల్పారామంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏడు స్టాళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 14 స్టాళ్లు పాక్షికంగా కాలిపోయాయి. దాదాపు రూ.60 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దసరా నేపథ్యంలో హస్తకళా మేళా కోసం శిల్పారామంలో 120 స్టాళ్లను ఏర్పాటు చేశారు. యజమానులు రాత్రి 10 గంటలకే స్టాళ్లను మూసివేసి వెళ్లిపోయారు. 212 స్టాల్ సమీపంలో రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పదినిమిషాల్లోనే ఒక స్టాల్ నుంచి మరో స్టాల్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో విలువైన పట్టు చీరలు, ఖాదీ వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. మంటలు విస్తరించడంతో స్థానికులు గుర్తించి ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. వారు ఐదు నిమిషాల్లో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు పండగ కోసం తెచ్చిన సామగ్రిని స్టాళ్లలోనే ఉంచారు. అగ్నిప్రమాదంతో శనివారం శిల్పారామం మూసివే శారు. సాయంత్రం సందర్శకులను అనుమతించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఫైర్ ఆఫీసర్... సంఘటన స్థలాన్ని అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ సురేందర్ ఆనంద్ సందర్శించారు. కాలిపోయిన స్టాళ్లను పరిశీలించారు. కాలిపోయిన సామగ్రిని వెంటనే అంచనా వేయలేమన్నారు. కాలిపోయిన స్టాళ్లలోని స్టాక్ వివరాలను శిల్పారామం అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం రూ. 60 లక్షల ఆస్తి నష్టం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూటే.. స్టాల్స్ సమీపంలోని ఫ్యూజ్ బాక్స్ వద్ద విద్యుత్ వైర్లు చిందర వందరగా ఉండటంతో షార్ట్ సర్క్యూట్ అయిఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా ఓ యువకుడు మం టలను చల్లార్చేందుకు యత్నిస్తుండగా అతడి ముఖానికి గాయాలయ్యాయి. ఏసీ బస్సులో మంటలు చాదర్‌ఘాట్: దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఏసీ బస్ (ఏపీ 116 7286) టైర్ నుంచి మంటలు వచ్చాయి. బస్సు శనివారం సాయంత్రం లింగంపల్లి నుంచి దిల్సుఖ్నగర్ వస్తోంది. నల్గొండ క్రాస్‌రోడ్ వద్దకు రాగానే వెనుక టైర్ నుంచి పొగలు, మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ శ్రీనివాస్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించాడు. ఆందోళన చెందిన ప్రయాణికులు కొంతదూరం పరుగుపెట్టగా.. డ్రైవర్ తన వద్ద గల క్యాన్‌లోని నీటిని చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు గంటపాటు వెనుక టైర్ల నుంచి పొగలు వచ్చాయి. బేరింగ్ల నుంచి మంటలు వచ్చి ఉంటాయని డ్రైవర్ పేర్కొన్నారు. కారులో .... చైతన్యపురి: కారులో ఒక్కసారిగా మంటలు వచ్చి ఇంజిన్ కాలిపోయింది. శంషాబాద్‌కు చెందిన వ్యాపారి పాషా శనివారం ఎల్బీనగర్లోని తన స్నేహితుడిని కలిసేందుకు శాంత్రో కారులో వచ్చాడు. 3 గంటల ప్రాంతంలో తిరిగి వెళుతుండగా చైతన్యపురి చౌరస్తా సమీపంలోకి రాగానే కారు ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నాయి. బైక్‌పై వెళుతున్న వ్యక్తి ఈ విషయాన్ని కారు నడుపుతున్న పాషాకు చెప్పటంతో రోడ్డు పక్కన ఆపాడు. మంటలు ఎక్కువై పొగలు వ్యాపించాయి. స్థానికులు కొందరు బకెట్లలో నీరు తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు. మలక్‌పేట నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేలోపే మంటలు అదుపులోకి వచ్చాయి. కారు ఇంజిన్ భాగం పూర్తిగా కాలిపోయింది. -
కార్మికులను కాటేసిన కరెంట్
కుత్బుల్లాపూర్: షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పేట్ బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రహ్లాద్(25), అంగద్(28), ధ్రువ్ సహానీ(25), అమర్నాథ్ సహానీ(25)లు కాంట్రాక్టర్ అర్జున్ గుప్తా ద్వారా మేడ్చల్ గుండ్లపోచంపల్లి పరిధిలోని ఎస్కే గుప్తా గోదామ్‌లో పెయిం టింగ్ వేసే పనికి కుదిరారు. తోటి కార్మికులతో కలిసి సోమవారం సాయంత్రం వరకు గోడలకు పెయింటింగ్ వేసిన నలుగురూ గోదామ్ ఆవరణలో తాముంటు న్న రేకుల షెడ్డులో రాత్రి నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున 4 గం టలకు షార్ట్ సర్క్యూట్ కావడంతో వీరు నిద్రిస్తున్న షెడ్డుకు మొత్తం విద్యుత్ సరఫరా అయింది. ఇది గమనించిన ధ్రువ్ సహానీ, అమర్నాథ్ సహానీ సమయస్ఫూర్తితో బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రహ్లాద్, అంగద్ ఒకేసారి డోర్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించడంతో రేకులు తగిలి షాక్‌కు గురై క్షణాల్లో ప్రాణం విడిచారు. యాజమాన్యం నిర్లక్ష్యం... ఘటనలో యాజమాన్య నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. రేకుల షెడ్డులో నివాసాన్ని ఏర్పాటు చేసి అందులో కార్మికులను పడుకోబెట్టడం విమర్శలకు తావిస్తోంది. సర్కిల్ బ్రేకర్స్ లోపల షార్ట్ సర్క్యూట్ కావడం.. వాటికి దగ్గరగా రేకులు ఉండడం వల్ల అంతా విద్యుత్ వ్యాపించిందని ఘటనా స్థలాన్ని సందర్శించిన మేడ్చల్ విద్యుత్ ఏఈ హలీముద్దీన్ ‘సాక్షి’తో అన్నారు. దిక్కుతోచని స్థితిలో సహచరులు.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి జీవనోపాధి కోసం వచ్చిన నలుగురిలో ఇద్దరు మృత్యువాత పడటంతో మిగతా ఇద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరిని పనిలో పెట్టిన కాంట్రాక్టర్ స్థానికంగా లేకపోవడంతో తోటి కార్మికులు వీరికి అండగా నిలిచారు. యాజమాన్యం మధ్యాహ్న సమయంలో రెండు అంబులెన్స్‌ల్లో మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేయగా విగత జీవులుగా మారిన వారిని చూసి తోటి కార్మికులు బోరుమన్నారు.