షైన్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం | Fire breaks out in Shine children hospital | Sakshi
Sakshi News home page

షైన్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Oct 21 2019 8:10 AM | Updated on Mar 21 2024 8:31 PM

నగరంలోని ఎల్‌బీ నగర్‌ షైన్‌ అస్పత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయులో షాట్‌ సర్క్యూట్‌తో  మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మరణించిగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత‍్తం 42మంది చిన్నారులు ఉన్నారు. కాగా, మెరుగైన చికిత్స కోసం వీరిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అనంతరం మంటలను అగ్నిమాపక సిబ్బంది  అదుపులోకి తెచ్చారు. ఆస్పత్రి ఎదుట బంధువుల తల్లిదండ్రుల నిరసన తెలిపారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement