Childrens Hospital
-
Philadelphia: అవిభక్త కవలల సర్జరీ సక్సెస్
అవిభక్త కవలలుగా పుట్టిన ఇద్దరు అబ్బాయిలను విజయవంతంగా వేరుచేసి వారికి పునర్జన్మనిచ్చింది అమెరికాలోని ఓ పిల్లల ఆసుపత్రి. వేరుచేశాక గత నెల 29న ఈ చిన్నారులు తొలి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో నివసిస్తున్న షనేకా రూఫిన్, టిమ్ దంపతులకు అవిభక్త కవల పిల్లలు జన్మించారు. ఆ అబ్బాయిలకు అమరీ, జవార్ రూఫిన్ అని పేర్లు పెట్టుకున్నారు. కౌగిలించుకున్నట్లుగా ఎదురెదురుగా పొట్ట ప్రాంతమంతా అతుక్కుని పుట్టారు. పుట్టినప్పుడు ఇద్దరి బరువు కలిపి కేవలం 2.7 కేజీలు మాత్రమే. వాస్తవానికి అవిభక్తవ కవలల తల్లి షనేకా రూఫిన్ 12 వారాల గర్భంతో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నప్పుడు గర్భస్త శిశువులు అతుక్కున్నట్లు కనిపించింది. పుట్టే చిన్నారులకు శారీరక సమస్యలు వస్తాయని, ఆనాడే తల్లిని వైద్యులు హెచ్చరించారు. తల్లి మనసు ఊరుకోదుగా. గర్భస్రావం చేయించుకోనని తెగేసి చెప్పింది. ఎలాగైనా నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిస్తానని కరాఖండీగా చెప్పేసింది. భర్త టిమ్ సైతం ఆమె నిర్ణయానికి అడ్డుచెప్పలేదు. పిల్లలు అతుక్కుని పుడితే వచ్చే సమస్యలను పరిష్కారం కనుగొనేందుకు మరో ఆస్పత్రిని వెతికారు. అప్పుడే వాళ్లకు ‘చాప్’ చిల్డ్రెన్స్ ఆసుపత్రి ఆశాదీపంగా కనిపించింది. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా చిన్నారులను అతుక్కుని పుట్టినాసరే వేరుచేయవచ్చని అక్కడి వైద్యులు భరోసా ఇచ్చారు. పిల్లల ఉమ్మడి శరీరంలో పొట్టతోపాటు కాలేయంలో కొంత భాగం కలిసే ఉంది. పిల్లలకు 11 నెలల వయసు వచ్చాక ఆపరేషన్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 21వ తేదీన 24 మందికిపైగా నిష్ణాతులైన వైద్యులు, మత్తుమందు డాక్టర్లు, రేడియాలజిస్టులు, నర్సులు ఇలా భారీ వైద్యబృందం ఏకధాటిగా ఎనిమిది గంటలపాటు శ్రమించి చిన్నారులను విజయవంతంగా వేరుచేసింది. పొట్టను వేరుచేసేటపుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా మెష్, ప్లాస్టిక్ సర్జరీ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించి వారిని వేరుచేశాక ఇద్దరి పొత్తి కడుపులను జాగ్రత్తగా బయటి నుంచి కుట్టేశారు. కొద్దిరోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణ తర్వాత చిన్నారులను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్‌కు ముందు ఆస్పత్రి యాజమాన్యం గత నెల 29వ తేదీన ఘనంగా వీళ్ల పుట్టినరోజు వేడుక జరిపింది. ‘‘ఇద్దరినీ ఇలా వేరువేరుగా చూడటం వర్ణనాతీతమైన అనుభూతినిస్తోంది’’ అని తల్లి రూఫిన్ ఆనందం వ్యక్తంచేశారు. టిమ్ దంపతులకు అంతకుముందే కైలమ్, అనోరా అనే ఇద్దరు పిల్లలున్నారు. ‘‘ఆపరేషన్ తర్వాత మా కుటుంబసభ్యుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఆనందమయ జీవన ప్రయాణాన్ని ఇక ఆరంభిస్తాం. దీనిని సుసాధ్యం చేసిన నిపుణుల బృందానికి మా కృతజ్ఞతలు’’ అని తల్లి చెప్పారు. ప్రతి 35వేల నుంచి 80వేల కవలల జననాల్లో ఇలా అవిభక్త కవలలు పుడతారని వైద్యశాస్త్రం చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేబీ కేర్ న్యూ బోర్న్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో మొదలైన మంటలు చుట్టుపక్కలున్న మరో రెండు భవనాలకు సైతం వ్యాపించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. మొత్తం 16 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. ఆస్పత్రి రెండో అంతస్తులో నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. మంటలు వ్యాపించిన ఆస్పత్రి భవనం నుంచి మొత్తం 12 మంది శిశువులను బయటకు తీసుకురాగా వారిలో ఏడుగురు చనిపోయారని ఫైర్ చీఫ్ అతుల్ గర్గ్ చెప్పారు. మిగతా ఐదుగురిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారన్నారు. మంటలను గమనించిన స్థానికులు, షహీద్ సేవా దళ్ కార్యకర్తలు కలిసి భవనం వెనుక వైపు నుంచి నిచ్చెనల ద్వారా పైకెక్కి చిన్నారులను కిందికి తీసుకువచ్చారని ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది పరారైనట్లు చెబుతున్నారు. ఆస్పత్రి యజమాని నవీన్ కిచిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని షాదారా డీసీపీ సురేంద్ర చౌదరి చెప్పారు. ఈ దారుణంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబాలను కోరారు. -
ఢిల్లీలో ప్రైవెట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
భూటాన్‌లో ఆస్పత్రిని ప్రారంభించిన మోదీ
థింపు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివా రం భూటాన్ రాజధాని థింపూలో అత్యాధు నిక వసతులతో నిర్మించిన ఆస్పత్రిని ఆ దేశ ప్రధాని త్సెరింగ్ టోబ్గేతో కలిసి ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 150 పడకలతో కూడిన గ్యాల్ట్సుయెన్ జెట్సున్ పెమా వాంగ్‌చుక్ మాతా శిశు హాస్పిటల్‌ను భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను అందించే ఈ ఆస్పత్రి ఎన్నో కుటుంబాలకు ఆశా కిరణం వంటిదని అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్–టిబెట్ల ఆర్థిక సహకారానికి ఒక గొప్ప ఉదాహరణ ఈ ఆస్పత్రి అని తెలిపారు. భారత్ సాయంతో మొదటి దశలో రూ.22 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రి 2019 నుంచి సేవలందిస్తోంది. భారత్ అందించిన మరో రూ.119 కోట్లతో చేపట్టిన ఆస్పత్రి రెండో దశ నిర్మాణం తాజాగా పూర్తయిందని విదేశాంగ శాఖ తెలిపింది. ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికిన రాజు రెండు రోజుల పర్యటనకు గాను ప్రధాని మోదీ శుక్రవారం భూటాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజు జిగ్మే ఖేసర్ వాంగ్‌చుక్ ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను అందజేశారు. మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమ య్యారు. పర్యటన ముగించుకుని తిరిగి శనివారం మధ్యాహ్నం మోదీ తిరుగు పయనమయ్యారు. ఆయన వెంట ప్రధాని త్సెరింగ్ టోబ్గేతోపాటు రాజు జింగ్మే ఖేసర్ వాంగ్‌చుక్ స్వయంగా పారో విమానాశ్ర యానికి వచ్చారు. వీరిద్దరూ ప్రధాని మోదీకి ఘనంగా వీడ్కోలు పలికారు. -
టీటీడీ చిన్నారుల ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ తిరుపతిలో నిర్మించే శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలిపిరి వద్ద ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో 4,11,325 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్మిస్తోంది. ► శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, స్మైల్‌ట్రైన్ కాక్లియర్ ఇంప్లాంట్స్ దృశ్య మాలికను సీఎం పరిశీలించారు. వైద్యులు, గుండె ఆపరేషన్లు చేయించుకున్న చిన్న పిల్లల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ► ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో లోగోను ఆవిష్కరించారు. ► బర్డ్ ఆస్పత్రిలో గ్రహణం మొర్రి, చెవుడు, మూగ చికిత్సల వార్డులను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ► తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టీటీడీ సహకారంతో నగరంలోని శ్రీనివాసం సర్కిల్ నుంచి వాసవి భవన్ సర్కిల్ వరకు తొలిదశలో నిర్మించిన 3 కి.మీ మేర వంతెన శ్రీనివాస సేతు ప్రారంభ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ► తిరుపతి నగర పాలక సంస్థ రూ.83.7 కోట్లతో నిర్మించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు చెందిన ఐదు ప్లాంట్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో తడిచెత్త నుంచి గ్యాస్ తయారీ, ఎరువుల తయారీ, డ్రైవేస్ట్ రీ సైక్లింగ్, భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్, 25 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన భూగర్భ డ్రైనేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయి. డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డికి సీఎం సత్కారం టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి హృదయాలయంలో 300 మందికి పైగా చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందచేశారు. బర్డ్ ఆసుపత్రిలో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ చికిత్సలకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన స్మైల్ ట్రైన్ సంస్థ నిర్వాహకురాలు మమత కౌరల్‌ను ముఖ్యమంత్రి శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందించారు. శ్రీపద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ సందర్భంగా గురువారం అలిపిరి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరి సేవలను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. -
బాలల ఆరోగ్యానికి భరోసా
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మండలం లక్ష్మీపురానికి చెందిన ఈ చిన్నారి హర్షిత్‌కు రెండేళ్లు. పుట్టకతోనే గుండె సమస్యలున్నాయి. తల్లిదండ్రులు అనేక ఆస్పపత్రుల్లో చూపించారు. గుండెకు ఆపరేషన్ చేయాలని, రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత ఖర్చుపెట్టే స్తోమత లేని తల్లిదండ్రులు గతేడాది నవంబర్‌లో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయానికి వచ్చారు. హర్షిత్ గుండెకు వెళ్లే మంచి రక్తం, చెడు రక్తం కలిసిపోతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఇక్కడ ఉచితంగా ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కరించారు. ► అనంతపురం జిల్లా ఎం.ఎన్.పి తండాకు చెందిన చిన్నారి బాలచంద్ర నాయక్‌కు మూడేళ్లు. చంద్ర నాయక్‌కు పుట్టుకతోనే గుండె సమస్యలున్నాయి. నిరుపేద కుటుంబం. పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఉచితంగా గుండె చికిత్సలు చేస్తున్నారని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. గత ఏడాది చంద్రనాయక్‌ను ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఓపెన్ హార్ట్ (ఇంట్రా కార్డియాక్ రిపేర్) సర్జరీ చేశారు. ప్రస్తుతం చంద్రనాయక్ ఆరోగ్యంగా ఉన్నాడు. వీళ్లిద్దరే కాదు.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది పిల్లల ఆరోగ్యానికి భరోసానిస్తోంది శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం. ఇప్పుడీ ఆస్పత్రి సేవలు విస్తరించనున్నాయి. శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపాంతరం చెందుతోంది. బాలలకు గుండె సంబంధిత చికిత్సలతో పాటు, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా రూపు దిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి వద్ద దీనిని నిర్మిస్తున్నారు. రూ.300 కోట్లతో 350 పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఆస్పత్రి కోసం 6 ఎకరాల్లో జీ+6 భవనాన్ని నిర్మిస్తారు. భవన నిర్మాణానికి రూ.240 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.60 కోట్లతో అధునాతన వైద్య పరికరాలు, ఇతర వసతులు సమకూరుస్తారు. 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసేలా టీటీడీ ప్రణాళిక రూపొందించింది. ఆస్పత్రిపైనే హెలీప్యాడ్ గుండె, కాలేయం, కిడ్నీలకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవయవాలు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి. ఇతర ప్రాంతాల నుంచి అవయవాలను ఇక్కడికి తరలించాల్సి వస్తుంది. అవయవాల తరలింపు ఆలస్యం అవకుండా ఆస్పత్రి భవనంపైనే ఎయిర్ అంబులెన్స్ దిగేలా హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సౌకర్యం దేశంలో అతి తక్కువ ఆస్పత్రుల్లో మాత్రమే ఉంది. అందుబాటులోకి వచ్చే సేవలు ఈ ఆస్పత్రిలో హెమటో అంకాలజీ, మెడికల్ అంకాలజి, సర్జికల్ అంకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలాజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ లాంటి 15 రకాల ప్రత్యేక విభాగాల్లో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తారు. అత్యంత ఖరీదైన బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, గుండె, ఇతర అవయవాల మార్పిడి ఉచితంగా చేస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇలాంటి ఆస్పత్రి దేశంలోనే మొదటిది కాబోతుంది. 2,020 మందికిపైగా చిన్నారులకు పునర్జన్మ గత ఏడాది అక్టోబర్ 11న పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 70 పడకలతో ఈ ఆస్పత్రిని చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 12 మంది స్పెషలిస్ట్ వైద్యులు పనిచేస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇక్కడ ఇప్పటివరకు 2,020 మందికి పైగా చిన్నారులకు ఓపెన్ హార్ట్, కీ హోల్ సర్జరీలు చేశారు. ఉచితంగా అత్యాధునిక వైద్యం పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ద్వారా నిరుపేద, మధ్య తరగతి పిల్లలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇక్కడ వైద్య సేవలు అందుతాయి. 15 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవస్థలు తప్పుతాయి. – డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం పిల్లలకు వైద్య సేవలపై సీఎం ప్రత్యేక దృష్టి రాష్ట్ర విభజనకు ముందు పిల్లల కోసం హైదరాబాద్‌లో నీలోఫర్ ఆస్పత్రి ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత చిన్న పిల్లల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆస్పత్రి లేకుండాపోయింది. దీంతో పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడే పరిస్థితి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రకాల వైద్య సదుపాయాలను పేద కుటుంబాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో చిన్న పిల్లల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ చొరవతో తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమవుతోంది.విజయవాడ, విశాఖపట్నంలలోనూ పిల్లల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అత్యాధునిక లేబొరేటరీ, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ విభాగాలతో అత్యాధునిక ఆస్పత్రులు నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో ఆస్పత్రికి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. -
15 నిమిషాల్లోనే స్కానింగ్ రిపోర్ట్
తిరుపతి (తుడా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన గుండె చికిత్సాలయం ఆదరణ పొందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బర్డ్ పాత భవనంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 11న ప్రారంభించిన ఈ సెంటర్ రుయాకు వరంగా మారింది. ఇందులోని చిన్నపిల్లల ఆస్పత్రికి రోజుకు 200కు పైగా ఓపీలు నమోదవుతున్నాయి. వీరిలో రోజుకు 15 మంది చిన్నపిల్లలకు ఎకో కార్డియోగ్రామ్ (గుండె స్కానింగ్) అవసరమవుతోంది. కార్డియాక్ సెంటర్లో ఐసీయూ వార్డు మూడు నెలల క్రితం వరకు గుండె స్కానింగ్ కోసం స్విమ్స్, ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం కొత్తగా కార్డియాలజిస్టును నియమించడంతో ఈ సమస్య పరిష్కారమైంది. కేవలం 15 నిమిషాల్లోనే ఎకో కార్డియోగ్రామ్ (గుండె స్కానింగ్) రిపోర్టును అందజేస్తున్నారు. ఓపీ సేవలు ముగిసేలోపే రిపోర్టు వస్తుండటంతో వైద్యులు పరిశీలించి వెంటనే సూచనలు చేస్తున్నారు. గతంలో ఈ పరీక్ష చేయించుకుని నివేదిక తీసుకోవాలంటే రోజంతా నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. గుండె సంబంధిత సమస్యలున్న పిల్లలను బయటి ప్రాంతాలకు తీసుకెళ్లే పనిలేకుండా స్థానికంగానే అత్యున్నత వైద్యం అందుతుండటంపై బాధితుల కుటుంబీకులతోపాటు వైద్యాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పెళ్లైన 23 ఏళ్లకు తల్లి అయ్యింది.. అంతలోనే ప్రాణాలొదిలింది
కోరుట్ల: పెళ్లి అయిన 23 ఏళ్లకు మాతృత్వపు ఆశలు తీరినా 15 రోజులకే అవి ఆవిరయ్యాయి. ఇద్దరు మగశిశువులకు జన్మనిచ్చి కన్నుమూసింది ఓ తల్లి. తనివితీరా బిడ్డలను చూసుకోకముందే తనువు చాలించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్‌కు చెందిన పొన్నం స్వరూప (42), అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు. పెళ్లి అయి 23 ఏళ్లు అయినా వారికి సంతానంలేదు. సంతానం కోసం ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి ఆ దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నం ఫలించి పది నెలల క్రితం స్వరూప గర్భం దాల్చింది. జూలై 19న ఆమె మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్ద రు మగ శిశువులకు జన్మనిచ్చింది. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో పుట్టిన వెంటనే వారిద్దరినీ అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో మెట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన స్వరూప మూడు రోజుల క్రితం పిల్లలను చూసేందుకు హైదరాబాద్ వెళ్లింది. తన పిల్లలతో ఆనందంగా గడపకముందే ఇన్ఫెక్షన్తో అనారోగ్యం పాలైంది. హైదరాబాద్‌లోనే మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. -
రాజస్తాన్ సర్కారు దవాఖానాలో దారుణం
జైపూర్: రాజస్తాన్ రాష్ట్రం కోటా నగరంలోని జేకే లోన్ తల్లీ పిల్లల ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు 77 మంది శిశువులు మృత్యువాతపడ్డారు. ఆస్పత్రిలో అసౌకర్యాలు, పనిచేయని పరికరాల కారణంగానే వీరంతా మృతి చెందినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా ఆరోపించారు. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వంలో చలనం లేదని, మంత్రులెవరూ ఆస్పత్రికి వెళ్లి సమీక్షించిన దాఖలాల్లేవని మండిపడ్డారు. అయితే, గడిచిన ఆరేళ్ల గణాంకాలతో పోలిస్తే ఇవే అతి తక్కువ మరణాలని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అంటున్నారు. ‘గతంలో ఇక్కడ ఏడాదికి 1,500 మంది శిశువులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఆస్పత్రిలో రోజుకు కనీసం ఐదారుగురు పసివాళ్లు చనిపోతూనే ఉంటారు. ఇక్కడా అదే జరుగుతోంది. జేకే ఆస్పత్రిలో శిశు మరణాలను సీరియస్‌గా తీసుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విధుల నుంచి తొలగించాం’ అని వివరించారు. కాగా, పసికందుల మృతిపై కోటా నియోజకవర్గ ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
సాక్షి, హైదరాబాద్/నాగోలు: షైన్ (ఎల్బీనగర్) ఆస్పత్రి యాజ మాన్య నిర్లక్ష్యం చికిత్స పొందుతున్న చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. సోమవారం తెల్లవారు జామున (2.45 గంటలకు) ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిమోనియాతో బాధపడుతూ ఇంక్యుబేటర్‌పై చికిత్స పొందుతున్న మూడు నెలల శిశువు మృతి చెందగా, మంటల్లో చిక్కుకుని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలకు తోడు దట్టమైన పొగలతో ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రస్తు తం ఇద్దరి శిశువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మరో 42 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా డాక్టర్ వి. సునీల్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ సునీల్ పవార్ గత ఆరేళ్ల నుంచి షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. సునీల్‌కుమార్‌రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2014లో రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నుంచి 20 పడకలకు అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం జనరల్ వార్డులో 50 పడకలు ఏర్పాటు చేశారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించిన శిశువులతో పాటు, నిమోనియా, కామెర్లు ఇతర సమస్యలతో బాధపడుతున్న శిశువులను ఐసీయూలోని ఇంక్యుబేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో మంటలు.. సోమవారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఐసీయూలో ఒక్కసారిగా మం టలు ఎగిసిపడ్డాయి. అక్కడే ఉన్న ఇంక్యుబేటర్లు షార్ట్‌సర్క్యూట్‌కు గురై వాటి లైట్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా దూపాడ గ్రామానికి చెందిన డి.నరేష్, మానసల కుమారుడు (3 నెలలు) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన గిరి, మమతల కుమారుడు అవినాష్ (2 నెలలు)కి చాతి, కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. చిన్నారిని ఉప్పల్‌లోని శ్రీధ ఆస్పత్రికి తరలించారు. చంపాపేటకు చెందిన ముత్యాలు, సరితల 36 రోజుల శిశువును బంజారాహిల్స్‌లోని ఏవీఎస్ అంకుర ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా ఉరుమడ్లకు చెందిన నాగరాజు, సుగుణల 13 నెలల శిశువును ఎల్బీ నగర్‌లోని దిశ ఆస్పత్రికి, అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన మరో శిశువును మలక్‌పేటలోని సేఫ్ ఆస్పత్రికి తరలించారు. ఓ చిన్నారిని మరో ఆస్పత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి... అగ్ని ప్రమాదంతో ఐసీయూ సహా సాధారణ వార్డుల్లోనూ దట్టమైన పొగ అలముకోవడంతో పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పిల్లలకు సాయంగా వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు, నర్సులు, ఇతర సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. పిల్లల ఏడుపులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అర్థం కాక తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన రహదారి వైపుగా ఉన్న అద్దాలను ధ్వంసం చేసి నిచ్చెన సాయంతో పిల్లలను సురక్షితంగా కిందికి దించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 42 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరందరినీ ఒకే ఆస్పత్రికి తరలిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన యాజమాన్యం పలు ఆస్పత్రులకు తరలించింది. మృతి చెందిన, ఆందోనకరంగా ఉన్న ఇద్దరు పిల్లల మినహా మిగతా చిన్నారులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన సమయంలో పిల్లల వైద్య ఖర్చలన్నీ తామే భరిస్తామని చెప్పిన షైన్ యాజమాన్యం ఆ తర్వాత వారిని గాలికొదిలేయడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజుల క్రితమే ప్రమాదం... మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని ఐసీయూలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై రోగుల బంధువులు ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. నిర్వహకులు మాత్రం తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. పక్కా మరమ్మతులు చేసింటే ఈ పరిస్థితి ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనుమతి ఎలా ఇచ్చారు.. 200 గజాల స్థలంలో సెల్లార్ సహా జీ+3 అంతస్థుల్లో ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. పార్కింగ్, సెట్‌బ్యాక్ లేకుండా నిర్మించిన ఈ భవనానికి జీహెచ్ఎంసీ ఎలాంటి అనుమతులివ్వలేదు. ఏదైనా విపత్తులు సంభవిస్తే బయటికి వచ్చేందుకు సరైన దారి కూడా లేదు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవు. పార్కింగ్ కూడా లేని ఈ భవనానికి రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పెషాలిటీ హాస్పిటల్, డయాగ్నోస్టిక్స్ నిర్వహణకు అనుమతి ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకం. సామర్థ్యానికి మించి పడకలు ఏర్పాటు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. పార్కింగ్, ఇతర సమస్యలపై స్థానికులు జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారే లేరు. ఎండీపై కేసు నమోదు... ప్రమాద ఘటన తరువాత పోలీసులు ఆసుపత్రికి తాళాలు వేశారు. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. షైన్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ సునీల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. -
షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిపై కేసు నమోదు
-
షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
వ్యవ‘సాయ’ వైద్యుడు
వడ్డీలేని రుణాలిచ్చేందుకు ముందుకు గ్రామాల్లో రైతుల వివరాల సేకరణ సేంద్రియ సాగు చేసేవారికి సన్మానం ఆయన వృత్తిరీత్యా పిల్లల వైద్యుడు.. అయినా వ్యవసాయమంటే ఎనలేని ఇష్టం. ఆ అభిమానంతోనే పేద రైతులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను సన్మానిస్తున్నారు. గ్రామాల్లోని పేద రైతులను గుర్తించి వారికి వడ్డీలేకుండా రుణాలు ఇప్పిస్తున్నారు. ఇప్పటికే సారంగాపూర్ మండలంలోని మూడు గ్రామాల్లో పేద రైతులను గుర్తించారు. అంతేకాకుండా రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనే.. జగిత్యాల పట్టణానికి చెందిన ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి. – సారంగాపూర్ (జగిత్యాల) వ్యవసాయాన్ని రైతులు పండుగలా చేసుకోవాలన్న తలంపుతో జగిత్యాలకు చెందిన వైద్యుడు శ్రీనివాస్‌రెడ్డి సంకల్పించారు. ఇప్పటికే పదేళ్లుగా పేద విద్యార్థులను చదువుల వైపు మళ్లించేందుకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు చేయూతనిస్తున్నారు. కొత్త ఆలోచనకు శ్రీకారం వ్యవసాయంలో నష్టాలు సర్వసాధారణం. అయితే కొందరు రైతులు వాటిని అధిగమించి మరోసారి సాగుకు సన్నద్ధమవుతారు. మరికొందరు రైతులు మానసికంగా కృంగిపోతారు. పరిస్థితుల ప్రభావంతో కొందరు ఆత్మహత్యల వైపు మొగ్గుచూపుతారు. ఈ క్రమంలో పేద రైతులను ఆదుకునేందుకు శ్రీనివాస్‌రెడ్డి సంకల్పించారు. ఒక్కో రైతుకు పంటల పెట్టుబడి కోసం రూ.30వేల వరకు అందించేందుకు సంకల్పించారు. ఇప్పటికే సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్, పోచంపేట గ్రామాల రైతులను కలిసి పేదల వివరాలు సేకరించారు. అలాగే సేంద్రియ వ్యవసాయం చేసిన రైతులు 58మందిని గుర్తించి సన్మానించారు. పంటల సాగు విధానంపై ధర్మపురి మండలం నాగారానికి చెందిన తన బంధువు గడ్డం సత్యనారయణరెడ్డి (రాష్ట్రస్థాయిలో ఉత్తమ రైతు) తో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల వద్దకు తీసుకెళ్తున్నాడు. వ్యవసాయశాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులను వారివారి గ్రామాలకు తీసుకెళ్లి సాగులో మెలకువలు వివరిస్తున్నారు. అప్పు ఇస్తాడిలా.. గ్రామాల్లో వ్యవసాయం చేయాలని ఉన్నా.. పెట్టుబడికి ఇబ్బందిపడేవారిని గుర్తించి.. రెండెకరాలు ఉన్న రైతుకు రూ.30 వేలు.. ఆపైనా వడ్డీలేకుండా రుణాలు ఇచ్చేందుకు సంకల్పించారు శ్రీనివాస్‌రెడ్డి. ఇప్పటికే గ్రామాల్లోని చాలామంది రైతుల వివరాలు సేకరించారు. వారందరికీ త్వరలోనే రుణాలు ఇస్తానని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
డెంగీతో చిన్నారి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
నల్లకుంట: డెంగీ జ్వరంతో బాధపడుతున్న చిన్నారి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తమ పాప మృతికి వైద్యులే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. ఆస్పత్రి వర్గాలు, బాధితుల కథనం ప్రకారం... బాగ్‌అంబర్‌పేట బతుకమ్మకుంటకు చెందిన ఎం.అశోక్, కోటమ్మ దంపతులు తమ కుమార్తె పవిత్ర (ఏడాదిన్నర)కు తీవ్రమైన జ్వరం రావటంతో ఈ నెల 24న విద్యానగర్ ఓయూ రోడ్డులో గల ఓ ప్రైవేట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యులు డెంగీ జ్వరంగా నిర్ధారించి ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్స చేశారు. చిన్నారి ఆరోగ్యం కుదుటపడక పోవడంతో వైద్యులు ఎల్లో బ్లడ్ ఎక్కించాలని తల్లిదండ్రులకు చెప్పారు. అందుకు వారు అంగీకరించటంతో సోమవారం సాయంత్రం చిన్నారికి రక్తం ఎక్కించారు. రాత్రి నుంచి చిన్నారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో మంగళవారం తెల్లవారు జామున మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చిన్నారి చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. చివరికి ఆస్పత్రి యాజమాన్యంతో రాజీ కుదరటంతో చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. -
'ఛీ'ల్డ్రన్స్ ఆసుపత్రి!
► అసాంఘిక కర్యకలాపాలకు అడ్డా ► పశువుల పాకగా మారిన వైనం ► పెరిగిపోతున్న దొంగతనాలు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని స్టో న్హౌస్పేట చిన్న పిల్లల ఆసుపత్రి(రేబాల సరస్వత మ్మ చిన్నపిల్లల ఆసుపత్రి) 60 ఏళ్లుగా జిల్లా వ్యాప్తం గా చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించి రాష్ట్రం లోనే పేరు గాంచింది. ఎనిమిది నెలల క్రితం ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఆ సుపత్రిని ప్రధాన ఆ సుపత్రి కార్యకలాపాలను తరలిం చారు. పరికరాల ను, సిబ్బందిని మెడికల్ వైద్యకళాశాలకు అనుసంధానం చేశారు. అప్పటి నుంచి ఇక్కడ రూ.కోట్లు విలువ చేసే భవన సముదాయాలను గాలికి వదిలేశారు. ఆలనాపాలనా లేకపోవడంతో పశువులకొట్టంలా మారింది.కుక్కలు, పందులకు ఆవాసమైంది. అప్పటి వరకు సేవలందించిన చిన్నపిల్లల ఆసుపత్రి విశాలమైన భవనాలు ప్రస్తుతం అసాంఘీక కార్యకలాపాలకు అడ్డా గా మారింది. ఖరీదైన తలుపులు, కిటికీలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి మార్కెట్లో అమ్మడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా రాత్రి సమయాల్లో ఆ గదులను, ప్రాంగణాలను బార్లుగా మార్చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పవిత్ర స్థలంగా వెలుగొందిన ఆసుపత్రి భవన సముదాయాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాచ్‌మన్‌ను నియమించాలి: ఒకప్పుడు చిన్నపిల్లల వైద్యం కోసం వచ్చేవారితో ఈ ఆసుపత్రి ప్రాంగణం కిటకిటలాడేది. ఆసుపత్రిని పెద్దాసుపత్రికి మార్చినప్పటి నుంచి ఇప్పటికీ పిల్లలను తీసుకొని వైద్యం కోసం వస్తున్నారు. ఇక్కడేమో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీనికి రక్షణ లేదు. రాత్రి సమయంలో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వాచ్‌మన్‌ను పెట్టాలి. - శరత్, స్థానికుడు ఇలా మారడం బాధాకరం: ఎంతో చరిత్రగల రేబాల ఆసుపత్రి ప్రస్తుతం ఈ స్థితికి చేరడం బాధాకరం. ఆసుపత్రిని మార్చినప్పుడు ఉన్న భవనాలు, కాంపౌండ్‌ను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. మరేదైనా ప్రభుత్వ కార్యాలయానికి ఇచ్చినా బాగుంటుంది. - లక్ష్మయ్య, విశ్రాంత ఉద్యోగి -
రోగులకు శాపంలా ఆస్పత్రుల విలీనం
► వైద్యం అందక చిన్నారుల అవస్థలు ► నర్సులే వైద్యం చేస్తున్న వైనం ► ఆందోళనలో తల్లిదండ్రులు నెల్లూరు (అర్బన్) : డీఎంఈ (డెరైక్టర్ ఆఫ్ మెడకల్ ఎడ్యుకేషన్)లోకి ఆసుపత్రుల విలీనం రోగుల పాలిట శాపంలా మారింది. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఒకే చోట మెటర్నటీ, చిన్న పిల్లల ఆసుపత్రుల ఉండాలని జీజీహెచ్ ఆవరణలోని ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రికి జూబ్లీను మారుస్తున్నారు. తాజాగా నగరంలోని స్టోన్‌హోస్‌పేట వద్ద ఉన్న రేబాల చిన్న పిల్లల ఆసుపత్రిని కొత్త ఆసుపత్రికి మారుస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వస్తున్న చిన్నారులు అల్లాడిపోతున్నారు. నిరీక్షించాల్సిందే... రేబాల ఆసుపత్రిని ప్రభుత్వాస్పత్రికి మార్చామని, ఓపీ, అడ్మిషన్ల అక్కడే చూస్తారని చాలా రోజుల కిందటే బ్యానర్‌ను అంటించారు. సిబ్బంది కొంత మందిని తరలించారు. కొత్త ఆసుపత్రిలో రోగులను చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు అందుబాటులోకి వచ్చే వరకు రేబాలలో ఓపీల వరకు చూడాలని భావించారు. కేవలం ఒకరిద్దరు డాక్టర్లను, మరికొంత సిబ్బందిని మాత్రమే అందుబాటులో ఉంచారు. ఒకరిద్దరు నర్సులే పిల్లలను పరీక్షిస్తున్నట్లు సమాచారం. తమ వల్ల కాకపోతే కొత్త ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. మందులు సైతం లేవని చెబుతున్నారు. అంతా గందరగోళం.... ఆసుపత్రుల తరలింపు మొత్తం పూర్తిగా గందరగోళంగా సాగుతోంది. జూబ్లీకి, రేబాలకు రోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. అధికారులు వాళ్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మొక్కుబడిగా ఆసుపత్రులను తరలిస్తున్నారు. పలువురు డాక్టర్లు సంతకాలు పెట్టి ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడంలేదు. రెండు ఆసుపత్రుల్లో వైద్య సేవలను అనధికారికంగా బంద్ చేయించిన అధికారులు కొత్త ఆసుపత్రిలో సౌకర్యాలను త్వరగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. -
కాంట్రాక్ట్ కిడ్నాపేనా?
హుజూరాబాద్‌లో క్లినిక్ నిర్వహిస్తున్న పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డి కిడ్నాప్.. విడుదల ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. డాక్టర్‌ను కిడ్నాప్ చేసి రూ.35 లక్షలు డిమాండ్ చేసి చివరకు రూ.16 లక్షలు తీసుకుని విడుదల చేసినట్లు ప్రచారం జోరందుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వైద్యుడికి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తున్న ఫోన్ నంబర్ ఆధారంగా 20 మంది కాల్‌డాటా సేకరించినట్లు సమాచారం. పోలీసులు 10 మందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో పాత నేరస్తులూ ఉన్నట్లు సమాచారం. హుజూరాబాద్ : వైద్యుడి కిడ్నాప్ వ్యవహారంలో ఫోన్ కాల్‌డాటా ఆధారంగా ఎల్కతుర్తి మండలం దండెపల్లికి చెందిన ఒక ఆటోడ్రైవర్, వల్భాపూర్‌కు చెందిన ఒకరు, కేశవాపూర్‌కు చెందిన ఓ వ్యక్తితోపాటు జీల్గులకు చెందిన మరొకరిని పోలీసులు ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక మాజీ నక్సలైట్ పేరు, ఎల్కతుర్తి మండలానికి చెందిన ఒక నాయకుడి పేరును సందేహిస్తున్నట్లు సమాచారం. ఎవరి పాత్ర ఎంత అని ఇంకా స్పష్టంకాలేదు. అనుమానితుల ఫోన్నంబర్లకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి సిమ్‌కార్డులు పొందినట్లు తెలిసింది. దీంతో గుర్తింపుకార్డులు లేకుండా సిమ్‌కార్డులు ఇస్తున్న పలువురిని సైతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. ఒప్పందమేనా? డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్ ఉదంతం వెనుక పాత నేరస్తుల పేర్లు వినిపిస్తుండడంతో పోలీసులు కొత్త కోణంలో విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ జరిగిన తీరు, వైద్యుడికి చేసిన హెచ్చరికలు, డబ్బులు డిమాండ్ చేసిన పద్ధతి చూస్తుంటే దీని వెనుక ప్రొఫెషనల్ కిడ్నాపర్లు ఉండచ్చనే అనుమానాలు లేకపోలేదు. సదరు వైద్యుడిపై కక్ష, కోపాలతో ఎవరైనా కిడ్నాప్‌కు వ్యూహరచన చేశారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. వైద్యుడిని చంపినా.. చంపకున్నా డబ్బులు వస్తాయని కిడ్నాపర్లు మాట్లాడినట్లు తెలుస్తుండటంతో ఇటు వ్యూహరచన చేసిన వ్యక్తుల నుంచి వచ్చే డబ్బులతోపాటు అటు బాధిత వైద్యుడు ఇచ్చే డబ్బుల కోసం కూడా ఆశపడ్డట్లు అర్థమవుతోంది. చివరకు సగం డబ్బులతోనే వ్యూహం బెడిసికొట్టడంతో వారు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పక్కా కాంట్రాక్ట్‌తోనే ఈ కిడ్నాప్ జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఉదంతంపై పోలీసుల విచారణ ఒక కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. రెండురోజుల్లో సస్పెన్స్‌కు తెరదించుతామని ఖాకీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ‘సాక్షి’లో వరుసగా వస్తున్న కథనాలతో జిల్లా పోలీస్‌బాస్ సైతం ఈ విషయంపై ఆరా తీసినట్లు తెలిసింది. -
క్షణక్షణమూ నరకమే!
గజ్వేల్/తూప్రాన్: ‘‘మా బిడ్డ ఎంతో గొప్పది అవుదనుకున్నం.. గిట్ల మా కళ్ల ముందే కన్ను మూస్తదనుకోలేదు.. మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా ఆసుపత్రిలో ఉన్నరు.. దేవుడా నువ్వే దిక్కు.. ఇట్లాంటి కష్టం పగోడికి కూడా రావోద్దు..’’.. మాసాయిపేట స్కూలు బస్సు-రైలు దుర్ఘటనలో కూతురును కోల్పోయి, మరో ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో ఉన్న శివ్వంపేట మల్లాగౌడ్-లత దంపతుల ఆవేదన ఇది. వారు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె శృతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. మరో కుమార్తె రుచిత తీవ్రగాయాలతో ఆస్పత్రి బెడ్‌పై ఉంది.. కుమారుడు వరుణ్ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు... వీరిదే కాదు... ఆ ప్రమాదంలో మృతిచెం దిన, గాయపడిన వారి కుటుంబాల దీనగాథ ఇది. ఈ పెను విషాదంలో పిల్లలను కోల్పోయినవారు, తీవ్ర గాయాల బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు క్షణ క్షణం నరకయాతన పడుతున్నారు. వెంకటాయపల్లి గ్రామానికి చెందిన శివ్వంపేట మల్లాగౌడ్-లత దంపతుల కుమార్తె శృతి ప్రమాదంలో మృతిచెందగా.. మరో కుమార్తె రుచిత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కుమారుడు వరుణ్ ఇంకా సృ్పహలోకి రాలేదు. కానీ శృతి మరణించి మూడు రోజులు కావడంతో నిర్వహించాల్సిన సంస్కారాల కోసం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను వదిలి.. ఆ దంపతులు శనివారం తమ ఇంటికి చేరుకున్నారు. కార్యక్రమాన్ని ముగించిన తర్వాత తిరిగి వెంటనే ఆస్పత్రికి వెళ్లిపోయారు. ఇదే గ్రామంలో మన్నె స్వామి-లావణ్య దంపతుల కుమారుడు సద్భావన్(నర్సరీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ చిన్నారి ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడుతుందోనంటూ వారు ఆందోళన చెందుతున్నారు. దేవతా సత్యనారాయణ-గాయత్రి దంపతుల కుమార్తె సాత్విక (ఫస్ట్ క్లాస్), తొంట స్వామి-నర్సమ్మల కుమారుడు ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక జిన్నారం మండలం కానుకుంట గ్రామానికి చెందిన తప్పెట లక్ష్మన్-వీరమ్మల కుమారుడు సాయిరామ్ (యూకేజీ) వెంకటాయపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. అయ్యాలం-నీలమ్మల కుమారుడు శివకుమార్, లంబ రమేష్-పార్వతిల కుమార్తె శ్రావణి, ఉప్పల దుర్గయ్య-కవితల కుమారుడు సందీప్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘నా మనుమలను హాస్పటల్లో జూస్తుంటే జరమొచ్చింది.. బీపీ, షుగర్ పెరిగింది.. వారిని ఆ పరిస్థితిలో చూస్తుంటూ తట్టుకోలేక.. ఇంటికి వచ్చిన.. పిల్లలు బాగుండాలే.. ఇగ దేవుడే దిక్కు..’’..అంటూ తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అభినంద్-శరత్‌ల నానమ్మ నీలమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. శుభకార్యానికి పోయి బయటపడ్డం : జంగం ప్రవీణ్ (వెంకటాయపల్లి) ‘‘మా పిల్లలు మహాలక్ష్మీ (2వ తరగతి), కారుణ్య (నర్సరీ) కూడా కాకతీయ స్కూల్లోనే చదువుతున్నరు. మేం 21వ తేదీన మెదక్‌లో ఓ శుభకార్యానికి వెళ్లినం. 23న రావాల్సి ఉండె.. కానీ నా భార్యాపిల్లలు ఇంకోరోజు అక్కడే ఉంటామనడంతో ఒక్కడినే వచ్చిన. ఒకవేళ నాతోపాటే వచ్చి ఉంటే మా పిల్లలు కూడ స్కూల్ బస్సులో ప్రమాదానికి గురయ్యేవారు. జరిగింది తలుచుకుంటే భయం వేస్తోంది..’’