'ఛీ'ల్డ్రన్స్ ఆసుపత్రి!
► అసాంఘిక కర్యకలాపాలకు అడ్డా
► పశువుల పాకగా మారిన వైనం
► పెరిగిపోతున్న దొంగతనాలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని స్టో న్‌హౌస్‌పేట చిన్న పిల్లల ఆసుపత్రి(రేబాల సరస్వత మ్మ చిన్నపిల్లల ఆసుపత్రి) 60 ఏళ్లుగా జిల్లా వ్యాప్తం గా చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించి రాష్ట్రం లోనే పేరు గాంచింది. ఎనిమిది నెలల క్రితం ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఆ సుపత్రిని ప్రధాన ఆ సుపత్రి కార్యకలాపాలను తరలిం చారు. పరికరాల ను, సిబ్బందిని మెడికల్ వైద్యకళాశాలకు అనుసంధానం చేశారు. అప్పటి నుంచి ఇక్కడ రూ.కోట్లు విలువ చేసే భవన సముదాయాలను గాలికి వదిలేశారు. ఆలనాపాలనా లేకపోవడంతో పశువులకొట్టంలా మారింది.కుక్కలు, పందులకు ఆవాసమైంది.
అప్పటి వరకు సేవలందించిన చిన్నపిల్లల ఆసుపత్రి విశాలమైన భవనాలు ప్రస్తుతం అసాంఘీక కార్యకలాపాలకు అడ్డా గా మారింది. ఖరీదైన తలుపులు, కిటికీలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి మార్కెట్‌లో అమ్మడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా రాత్రి సమయాల్లో ఆ గదులను, ప్రాంగణాలను బార్‌లుగా మార్చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పవిత్ర స్థలంగా వెలుగొందిన ఆసుపత్రి భవన సముదాయాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వాచ్‌మన్‌ను నియమించాలి:
ఒకప్పుడు చిన్నపిల్లల వైద్యం కోసం వచ్చేవారితో ఈ ఆసుపత్రి ప్రాంగణం కిటకిటలాడేది. ఆసుపత్రిని పెద్దాసుపత్రికి మార్చినప్పటి నుంచి ఇప్పటికీ పిల్లలను తీసుకొని వైద్యం కోసం వస్తున్నారు. ఇక్కడేమో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీనికి రక్షణ లేదు. రాత్రి సమయంలో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వాచ్‌మన్‌ను పెట్టాలి. - శరత్, స్థానికుడు
ఇలా మారడం బాధాకరం:
ఎంతో చరిత్రగల రేబాల ఆసుపత్రి ప్రస్తుతం ఈ స్థితికి చేరడం బాధాకరం. ఆసుపత్రిని మార్చినప్పుడు ఉన్న భవనాలు, కాంపౌండ్‌ను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. మరేదైనా ప్రభుత్వ కార్యాలయానికి ఇచ్చినా బాగుంటుంది. - లక్ష్మయ్య, విశ్రాంత ఉద్యోగి