విమానం డోర్ దాకా వచ్చి మరీ మోదీకి వీడ్కోలు పలుకుతున్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్
థింపు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివా రం భూటాన్ రాజధాని థింపూలో అత్యాధు నిక వసతులతో నిర్మించిన ఆస్పత్రిని ఆ దేశ ప్రధాని త్సెరింగ్ టోబ్‌గేతో కలిసి ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 150 పడకలతో కూడిన గ్యాల్‌ట్సుయెన్ జెట్సున్ పెమా వాంగ్చుక్ మాతా శిశు హాస్పిటల్‌ను భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించారు.
నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను అందించే ఈ ఆస్పత్రి ఎన్నో కుటుంబాలకు ఆశా కిరణం వంటిదని అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్–టిబెట్‌ల ఆర్థిక సహకారానికి ఒక గొప్ప ఉదాహరణ ఈ ఆస్పత్రి అని తెలిపారు. భారత్ సాయంతో మొదటి దశలో రూ.22 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రి 2019 నుంచి సేవలందిస్తోంది. భారత్ అందించిన మరో రూ.119 కోట్లతో చేపట్టిన ఆస్పత్రి రెండో దశ నిర్మాణం తాజాగా పూర్తయిందని విదేశాంగ శాఖ తెలిపింది.
ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికిన రాజు
రెండు రోజుల పర్యటనకు గాను ప్రధాని మోదీ శుక్రవారం భూటాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజు జిగ్మే ఖేసర్ వాంగ్చుక్ ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను అందజేశారు. మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమ య్యారు. పర్యటన ముగించుకుని తిరిగి శనివారం మధ్యాహ్నం మోదీ తిరుగు పయనమయ్యారు. ఆయన వెంట ప్రధాని త్సెరింగ్ టోబ్‌గేతోపాటు రాజు జింగ్మే ఖేసర్ వాంగ్చుక్ స్వయంగా పారో విమానాశ్ర యానికి వచ్చారు. వీరిద్దరూ ప్రధాని మోదీకి ఘనంగా వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment