మండలంలోని లింగాపూర్ గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు నివాసగృహం దగ్దమైంది.
► 3లక్షల ఆస్తి నష్టం
లింగాపూర్(నవీపేట); మండలంలోని లింగాపూర్ గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు నివాసగృహం దగ్దమైంది. రుక్మాబాయి అనే వివాహిత మహిళ తన ఇద్దరు కుమారులను బడికి పంపించాక ఎప్పటిలాగే ఉపాధి హామీ కూలీకి వెళ్లింది. ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. తలుపులు వేసి ఉండడంతో లోపలి భాగంలోని కట్టె దూలాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు పైకి వ్యాపించడంతో చుట్టు పక్కల వారు మంటలను ఆరిపేందుకు ప్రయత్నించారు. మంటలు ఎగసి పడడంతో అగ్ని మాపక శాఖకు సమాచారమందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాసక సిబ్బంది మంటలను ఆరిపేశారు. రుక్మాబాయి భర్త రామ్మూర్తి దుబాయ్‌లో ఉంటున్నాడు. వీఆర్వో రాజు ఆస్తి నష్టంపై పంచనామా చేశారు. ’ 52 వేల నగదు, 30 బస్తాల వడ్లు, అయిదు తులాల బంగారు ఆభరణాలు, వంట సామిగ్రి, బట్టలు కాలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని తహశీల్దార్ అనిల్‌కుమార్ పరిశీలించారు.