lingapur
-
యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక
సిర్పూర్ (యూ) (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతిపటార్ గ్రామానికి చెందిన యువ కౌలు రైతు రాథోడ్ రాజు (34) వర్షాలకు పంట చేతికి రాదేమోననే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధుకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజుకు సొంత వ్యవసాయ భూమి లేకపోవడంతో గ్రామంలో 13 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగానికి పైగా పంట దెబ్బతింది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం: ఈటల రాజేందర్ చేనుకు గురువారం ఉదయం వెళ్లిన రాజు దెబ్బతిన్న పంటను చూసి, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య జమున వెంటనే స్థానికుల సాయంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడికి పిల్లలు లేరు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? -
‘సమత’ హత్యాచార కేసులో ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హత్యాచారానికి గురైన ‘సమత’కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి పేరిట జీవో జారీ అయింది. ఐదవ అదనపు సెషన్స్, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమత కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఈ నెల 9న ప్రభుత్వం హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ ఆమోదం తెలిపారు. కాగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పీఎస్ లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమత అనే ఆదివాసీ యువతిని షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, మక్లూ హత్యాచారం చేశారని కేసు నమోదైన విషయం తెలిసిందే. త్వరగా శిక్ష పడేలా చర్యలు: ఇంద్రకరణ్ సమత కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అటవీ, న్యాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. -
'సమత' పిల్లలకు ఉచిత విద్య
సాక్షి, ఆసిఫాబాద్: గత నెల 24న లింగాపూర్ మండలంలో అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ సమత ఇద్దరు పిల్లలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశం లభించింది. లింగాపూర్ పోలీసులు మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని పాఠశాలలో వారిని చేర్పించారు. సమత పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని ప్రభుత్వమిచ్చిన ఆదేశాల మేరకు.. బాధితురాలి పిల్లలు తగిన విద్యను అభ్యసించేందుకు వీలుగా పోలీసులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. అంతేకాక పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఆమె పిల్లలకు రూ. 10 వేల నగదు ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం నుంచి బతుకుదెరువు కోసం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్‌కు వలస వెళ్లిన ఒక దళిత మహిళపై హత్యాచారం జరిగింది. బుగ్గలు అమ్ముకుని జీవనం సాగించే బాధితురాలు సమత ఎప్పటిలానే బుగ్గలు అమ్ముకునేందుకు బయల్దేరి వెళ్లి.. తిరిగి శవమై కనిపించింది. ఆమెపై ఒంటిపై గాయాలు ఉండడం.. అనుమానస్పదస్థితిలో మృతి చెందడం, లైంగికదాడి చేయడంతో.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: ‘సమత’గా పేరు మార్పు: ఎస్పీ దారుణం: వివాహితపై అత్యాచారం.. హత్య -
దారుణం: వివాహితపై అత్యాచారం.. హత్య
సాక్షి, లింగాపూర్(ఆసిఫాబాద్) : బతుకుదెరువు కోసం మండలానికి వచ్చిన ఓ వివాహితను గుర్తుతెలియని దుండగులు పట్టపగలు అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన మండలంలోని ఏల్లాపటార్ రామునాయక్‌తండా వద్ద ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం జరిగినట్లు అనుమానిస్తున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, మృతురాలి భర్త గోపి కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్తాన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన టేకు లక్ష్మి, గోపి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. బతుకుదెరువు కోసం జైనూర్ మండల కేంద్రంలో ఓ ఇంటికి అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ వెంట్రుకలకు బుగ్గలు అమ్ముకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. కొద్దిరోజులుగా లింగాపూర్ మండల పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ.. బుగ్గలు అమ్ముతున్నారు. ఎప్పటిలాగే భార్యాభర్తలు కలిసి.. ఆదివారం ఉదయమే బుగ్గలు అమ్ముకునేందుకు బయల్దేరారు. భార్యను ఏల్లాపటార్‌లో దింపి.. గోపి ఖానాపూర్ వై పు వెళ్లాడు. లక్ష్మిని లింగాపూర్ కూడలిలో ఉండమని చెప్పాడు. ఉదయం 11 గంటలకు లింగాపూర్‌కు చేరుకున్న గోపికి లక్ష్మి కనిపించలేదు. మధ్యాహ్నం వరకూ వేచిచూసినా.. రాకపోవడంతో ఎల్లాపూర్‌కు వెళ్లి వాకబు చేశాడు. గ్రామం దాటి వెళ్లినట్లు కొందరు చెప్పగా.. రామునాయక్‌తండాకు వెళ్లి వాకబు చేశాడు. ఆమెను చూడనేలేదని స్థానికులు చెప్పడంతో తిరిగి లింగాపూర్ చేరుకున్నాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో గోపి లింగాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్ రంగంలోకి దిగి అదే రాత్రి గాలించినా ప్రయోజనం లేదు. తిరిగి సోమవారం వెదుకుతుండగా.. ఉదయం 10 గంటల సమయంలో రామునాయక్‌తాండ శివారు చెట్లపొదల్లో లక్ష్మి (30) శవమై కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉండడం.. అనుమానస్పదస్థితిలో మృతిచెంది ఉండడంతో పోలీసులు జైనూర్ సీఐ సురేశ్‌కు సమాచారం అందించారు. ఆయన ఆసిఫాబాద్ డీఏస్పీ సత్యనా రాయణతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీస్ జాగిలాలతో గాలించారు. లక్ష్మిపై లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేసినట్లు అనుమానించారు. ఏల్లపటార్ గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు స మాచారం. శవంతో కుటుంబ సభ్యుల ధర్నా బుగ్గలు అమ్ముకునేందుకు వెళ్లిన లక్ష్మిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఆమె బంధువులు మృతదేహంతో మండల కేంద్రానికి చేరుకుని గాంధీచౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. లైంగికదాడి చేసి.. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనుమానితులుగా భావిస్తున్న వారి ద్విచక్రవాహనాలను దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డీఎస్పీ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. నిందితులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
‘అడ్డు వస్తే ట్రాక్టర్‌తో తొక్కించి చంపుతాం’
ఇందల్వాయి : మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులోని వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకున్న తమను మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడొకరు దూషించినట్లు శివగణేష్ యూత్ సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇసుకను అక్రమంగా తరలించుకు పోవడానికి కొందరు మంగళవారం అర్ధరాత్రి ఐదు ట్రాక్టర్లతో లింగపూర్ వాగులోకి వచ్చారని తెలిపారు. అది గమనించిన తాము ఇసుక తరలింపును అడ్డగిస్తే వారు దాడికి దిగి, తమకు అడ్డొస్తే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తామని బెదిరించినట్లు లింగాపూర్ యువకులు నరేశ్, రవి, సంతోష్ తదితరులు తెలిపారు. దీంతో తాము గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు వచ్చి రెండు ట్రాక్టర్లను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారన్నారు. కందకాలు పూడ్చి మరీ అక్రమ రవాణ ఇసుక అక్రమ రవాణాకు అడుకట్ట వేసేందుకు నెల రోజుల క్రితం వాగులోకి ట్రాక్టర్లు, టిప్పర్లు వెళ్లకుండా తహసీల్దార్ సమక్షంలో కందకాలు తవ్వించారు. అయితే, ఇసుకాసురులు ఆ కందకాలను పూడ్చి మరీ ఇసుకను అక్రమంగా తరలించుకు పోతున్నారని, ప్రకృతితో పాటు, రైతులకు తీవ్రనష్టం చేస్తున్నారని లింగాపూర్ యువకులు తెలిపారు. ఇలాంటి దుండగులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్, గౌరారం సర్పంచ్ ఇమ్మడి లక్ష్మికి వినతిపత్రం అందించారు. -
షార్ట్ సర్క్యూట్‌తో నివాస గృహం దగ్దం
► 3లక్షల ఆస్తి నష్టం లింగాపూర్(నవీపేట); మండలంలోని లింగాపూర్ గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు నివాసగృహం దగ్దమైంది. రుక్మాబాయి అనే వివాహిత మహిళ తన ఇద్దరు కుమారులను బడికి పంపించాక ఎప్పటిలాగే ఉపాధి హామీ కూలీకి వెళ్లింది. ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. తలుపులు వేసి ఉండడంతో లోపలి భాగంలోని కట్టె దూలాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు పైకి వ్యాపించడంతో చుట్టు పక్కల వారు మంటలను ఆరిపేందుకు ప్రయత్నించారు. మంటలు ఎగసి పడడంతో అగ్ని మాపక శాఖకు సమాచారమందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాసక సిబ్బంది మంటలను ఆరిపేశారు. రుక్మాబాయి భర్త రామ్మూర్తి దుబాయ్‌లో ఉంటున్నాడు. వీఆర్వో రాజు ఆస్తి నష్టంపై పంచనామా చేశారు. ’ 52 వేల నగదు, 30 బస్తాల వడ్లు, అయిదు తులాల బంగారు ఆభరణాలు, వంట సామిగ్రి, బట్టలు కాలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని తహశీల్దార్ అనిల్‌కుమార్ పరిశీలించారు. -
లింగాపూర్‌లో చిరుత సంచారం
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ అటవీ ప్రాంతం సమీపంలో చిరుత సంచరిస్తుందనే సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లింగాపూర్ సమీపంలో చిరుత తిరుగుతుండటం గమనించిన సురేష్ అనే వ్యక్తి విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత పాదముద్రలను పరిశీలిస్తున్నారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. -
దేవుడిపైనే భారం వేశాం
- కళ్ల ముందే అంతా కకావికలం - స్వల్పగాయాలతో బయటపడ్డాం - నాలుగు రోజులు నరకం చూశాం - లింగాపూర్ చేరిన నేపాల్ భూకంపం బాధిత కుటుంబం గాయాలతో ఇల్లు చేరిన కల్యాణం మలయ్య బతుకుతామని అనుకోలేదు నా కుమారులు, కోడళ్లు పదేళ్లుగా నేపాల్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటుండ్రు. నెల రోజుల క్రితం పశుపతినాథ్ ఆలయం యాత్ర కోసం నేపాల్‌లో ఉంటున్న నా కొడుకుల వద్దకు వెళ్లిన. ఈ నెల 25న ఇంటినుంచి బీడి కోసం దుకాణం వెళ్లిన. తిరిగి వస్తుండగా ఒక్కసారిగా భూకంపం వచ్చింది. రెండుసార్లు కింద పడ్డాను. పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలి నాపై పడింది. కుడి కాలు, చేయి విరిగినయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భూకంపం వచ్చిందని తెలిసి గుండె ఆగినంత పనయింది. దేవునిపై భారం వేసి బతికి బయటపడ్డాం. - బిక్కుబిక్కుమంటూ గడిపాం - స్వగ్రామానికి చేరుకున్న భూకంప బాధితులు మానకొండూర్ : నేపాల్ రాజధ ాని కాఠ్మాండులో 25న భూకంపంలో చిక్కుకున్నప్పుడు దేవుడిపైనే భారంవేసి బిక్కుబిక్కుమంటూ గడిపామని మానకొండూర్ మండలం లింగాపూర్‌కు చెందిన బాధితులు తెలిపారు. ఈ గ్రామం నుంచి వెళ్లిన వారిలో భూకంపం ప్రభావంతో 62 మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడి బుధవారం స్వగ్రామం చేరిన వీరు ఆనాటి భయంకర పరిస్థితులను ‘సాక్షి’తో పంచుకున్నారు. లింగాపూర్‌కు చెందిన పలువురు బుడిగజంగాల వారు బతుకుదెరువు కోసం నేపాల్‌లోని సీనమంగల, కాఠ్మాండు, పురాణబాసి, బీంసింగ్‌కోలా తదితర పట్టణాల్లో జ్యోతిష్యం, ఉంగరాలు అమ్ముతూ కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. భూకంపం సంభవించి మోటం విజయ్, కిన్నెర లక్ష్మి, మోటం సంపత్, మోటం సురేశ్, ఓర రాజేశ్‌తోపాటు మరో 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి బయటపడి బిక్కుబిక్కుమంటూ నాలుగు రోజులపాటు గడిపిన వీరు ఎలాగోలా బయటపడి స్వగ్రామాలకు బుధవారం చేరుకున్నారు. కొందరు దేవుడిపై భారం వేసి అక్కడే ఉండి పోగా, మరికొందరు రైలు ద్వారా గురువారం చేరుకోనున్నారని బాధితుడు మల్లయ్య తెలిపాడు. ఇదే గ్రామానికి చెందిన కల్యాణం మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కుడి కాలు, కుడి చేయి విరిగింది. మల్లయ్య కుమారుడు శ్రీనివాస్, కోడలు లక్ష్మి, శ్రీనివాస్ కుమారుడు మహేశ్, కూతురు అనూష, శ్రీనివాస్ అన్న కుమారుడు వెంకటేశ్ మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో కఠ్మాండు నుంచి ఢిల్లీకి చేరుకుని, అక్కడినుంచి విమానంలో మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బస్సులో కరీంనగర్‌కు చేరుకుని బుధవారం ఉదయం స్వగ్రామానికి వచ్చారు. నేపాల్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆనందం నింపింది. -
గుడిసె దగ్ధం వృద్ధ మహిళకు గాయాలు
ఆదిలాబాద్: ఇంటి పై నుంచి వెళ్తున్న కరెంట్ తీగల్లో మంటలు చేలరేగి గుడిసె దగ్ధమైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. లింగాపూర్ గ్రామానికి చెందిన ముసుగు పోసాని(70) అనే వృద్ధ మహిళ గుడిసె మంటల్లో ఇరుక్కొవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 వేల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. విషయం తెలిసిన రెవిన్యూ అధికారి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వృద్ధ మహిళకు ఆర్థిక సాయం చేస్తామని హామినిచ్చారు.