సిర్పూర్ (యూ) (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతిపటార్ గ్రామానికి చెందిన యువ కౌలు రైతు రాథోడ్ రాజు (34) వర్షాలకు పంట చేతికి రాదేమోననే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధుకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజుకు సొంత వ్యవసాయ భూమి లేకపోవడంతో గ్రామంలో 13 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగానికి పైగా పంట దెబ్బతింది.
చదవండి: టీఆర్‌ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం: ఈటల రాజేందర్
చేనుకు గురువారం ఉదయం వెళ్లిన రాజు దెబ్బతిన్న పంటను చూసి, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య జమున వెంటనే స్థానికుల సాయంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడికి పిల్లలు లేరు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.
చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా?
Young Farmer: అతివృష్టి తెచ్చిన కష్టం.. అప్పులు తీర్చలేక బలవన్మరణం
Published Fri, Oct 1 2021 7:56 AM | Last Updated on Fri, Oct 1 2021 8:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment